Dog Food: మనం తింటున్నప్పుడు పెంపుడు కుక్కలు ఆశగా చూడటం సహజమే!. అంతమాత్రాన మనం తినే పదార్థాలన్నిటినీ వాటి నోటికి అందించకూడదు. కుక్కలు అన్ని పదార్థాలనూ అరిగించుకోలేవు. కొన్నిటిని తినడం వల్ల వాటి జీర్ణశక్తి దెబ్బతినటంతో పాటు కొన్ని సందర్భాల్లో వాటి ప్రాణాలే పోవచ్చు కూడా!. కాబట్టి కుక్కల(Dog Food)కు ఈ పదార్థాలను తినిపించకండి.
కుక్కలకు తినిపించకూడని పదార్థాలు!
చాక్లెట్(Chocolate) తింటున్నప్పుడు మీ ముద్దుల కుక్క ఎంత జాలిగా చూసినా దానికి తినిపించకండి. చాక్లెట్లలోని కెఫీన్, థియోబ్రొబైన్లను కుక్కలు అరిగించుకోలేవు. దాంతో చాక్లెట్లను తింటే కుక్కలకు వాంతులు, కడుపు నొప్పి, డీహైడ్రేషన్, కండరాల వణుకు, గుండెకొట్టుకునే తీరులో అవకతవకలు, శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, ఫిట్లతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణహానిలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
కుక్కల(Dog Food)కు వెల్లుల్లి ఉల్లిపాయలకంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. వీటిలోని శక్తివంతమైన మూలకాలు కుక్కలకు విషపూరితమైనవి. వీటిని తింటే కుక్కలు అలసటకు లోనై కదలడానికి మొరాయిస్తాయి. వాటి మూత్రం నారింజ రంగు నుంచి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ పరిస్థితి తీవ్రమైన కుక్క ప్రాణాలను కాపాడటం కోసం రక్తమార్పిడి చేయవల్సి వస్తుంది. ద్రాక్ష, ఎండు ద్రాక్షలు కుక్కలకు విషంలా పనిచేసి వాటి కిడ్నీలను దెబ్బతీస్తాయి. వీటిని తినడం వల్ల డీహైడ్రేషన్‌తో పాటు ఆకలి మందగించటం లాంటి లక్షణాలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని కుక్కల్లో కిడ్నీ ఫెయిల్యూర్ వీటిని తిన్న మూడు నాలుగు రోజుల్లోనే కనిపించవచ్చు.


ఉల్లిపాయాలు (Onions) కుక్కల్లో ఎర్ర రక్తకణాలను నాశనం చేసి వాటిని బలహీనపరిచి కదల్లేని స్థితికి చేరుస్తాయి. ఉల్లిపాయలు తిన్న కుక్కలకు కొన్ని సందర్భాల్లో రక్తమార్పిడి కూడా అవసరమవుతుంది. మనుషుల్లాగే కుక్కల్లో కూడా లాక్టోజ్ ఇన్‌టాలరెంట్ ఉంటాయి. అంటే పాలల్లోని లాక్టోజ్‌ను కొన్ని కుక్కలు చిన్నప్పు డు పాలను బాగానే జీర్ణం చేసుకోగలిగినా ఎంజైమ్స్ తయారవకపోవడం మూలంగా పెద్దయ్యాక పాలలోని చక్కెరలను జీర్ణం చేసుకోలేక ఇబ్బంది పడతాయి. దాంతో వాంతులు, విరోచనాలు, ఇతర జీర్ణశాయ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు ప్రాణాంతకమైనవి కాకపోయినా క్రమేపీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను కలిగించి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తాయి.
Dog Food ప్రాణాలకే ప్రమాదం!
పాలకులాగే చీజ్‌ను అరిగించుకునే ఎంజైమ్స్ కుక్క(Dog Food)ల జీర్ణాశయల్లో ఉండవు. దాంతో చీజ్ ఎక్కువుగా తింటే గ్యాస్, డయోరియా, వాంతులు లాంటి సమస్యలు కుక్కలను బాధిస్తాయి. తాగేసిన కాఫీ కప్పు కనిపిస్తే చాలు. కుక్కలు నాలుకతో నాకేస్తూ ఉంటాయి. ఇలా కాఫీ(Coffee) కప్పులను కుక్కలకు అందుబాటులో ఉంచకూడదు. కాఫీలో మిథైలేటెడ్ క్సాంథైన్ అనే ఉత్ప్రేరకం ఉంటుంది. ఇది కుక్కల్లో నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి వాంతులు, రెస్ట్‌లెస్‌నెస్, గుండె వేగంగా కొట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవడం లాంటి సమస్యలు తలెత్తేలా చేస్తుంది.


మాంసం వాసనకు కుక్కలు ఎగబడటం సహజమే. అయితే పొరపాటున కూడా బేకన్‌ను కుక్కలకు తినిపించకూడదు. కొవ్వు ఎక్కువుగా ఉండే బేకన్ లాంటి మాంసాహారాలు కుక్కల్లో పాంక్రియాటైటిస్ వ్యాధిని కలగజేస్తాయి. ఒక్కసారి కుక్కలు ఈ వ్యాధికి గురైతే వాటి క్లోమ గ్రంథి పనితీరు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.