Dog Behaviors | మనం కుక్కను ఎందుకు పెంచుకుంటాం. మనం ఎక్కడికైనా వెళ్లిన మనకు రక్షణ ఇవ్వడానికి, మన ఇంటికి కాపలా కాయడానికి, దొంగలను, అపరిచిత వ్యక్తులను రాకుండా చూడటానికి కుక్కలను పెంచుకుంటాం కదా. అదే విధంగా కుక్కలు విశ్వాస జీవులు(Dog Behaviors) కాబట్టి మనిషికి అన్ని జంతువుల కన్నా కుక్క(Dog) అతి దగ్గరిగా మారింది. అయితే ఈ అతి విశ్వాసమే చూపించి ఓ తాత కు సున్నం పెట్టినంత పని చేసింది ఓ కుక్క.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం Nachinapally గ్రామానికి చెందిన చేరాలు అనే తాత గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆ గొర్రెలకు కావలిగా ఈ కుక్కు పెట్టుకుంటాడట. ఎప్పటి లాగానే కొన్ని గొర్రెలు అమ్మితే రూ.1.50 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులు Bankలో వేసుకుందామని ఆలోచించి ఆ డబ్బుల సంచీ(money bag)ని ఇంటి వద్ద ఓ తువ్వాల కింద పెట్టి తానం చేయడానికి వెళ్లాడంట. చేసి వచ్చిన తర్వాత వచ్చి చూస్తే తువ్వాలు పక్కన పడింది. పైసలు సంచి కనిపించకుండా పోయిందట.


ఇప్పటి వరకు ఇక్కడ్నే ఉన్న కుక్క ఎటుపాయరా..అని అటు ఇటు చూసినా అది కొద్ది సేపటి వరకు కనిపించలేదంట తాతకు. ఈ కుక్కు నిత్యం చెప్పులు, బట్టలు నోటకర్చుకుని బయట పడేయటం అలవాటంట. ఆ అలవాటులో పొరపాటుగా ఏమైనా డబ్బులు సంచి చెత్త కుప్పలో పడేసిదేమోనని పాపం తాత అన్ని చోట్ల వెతికాడంట. కుక్క పోయిన చోట కల్లా పోయాడటం. కానీ పైసలు సంచి కనిపించక పోవడంతో తాత దిగాలు పడ్డాడంట. ఈ తాత బాధను తెలుసుకున్న చుట్టప్రక్కల వాళ్లు కూడా డబ్బులు సంచి వెతికారంట. కానీ ఏం లాభం లేదంట. అయితే ఇంత మంది వెతికినా డబ్బులు సంచి దొరకలేదంటే ఎవరో ఎత్తుకొని పోయి ఉంటారని భావిస్తున్నారు. పాపం ఈ Tata బాధను చూసైన ఆ డబ్బులు సంచి తీసుకొని వచ్చి ఇవ్వండి అని అంటున్నారు నెటిజన్లు.