Election Boycott : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు శుక్రవారం జరగడంపై కాస్త ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ‘ప్రజల్లారా ఓటింగ్‌లో పాల్గొనవద్దు..కరోనా బారిన పడవద్దు’ అంటూ ఓ డాక్టర్ నిరసన చేపట్టారు.
Election Boycott : దేశంలో నిమిషం ఆలస్యం లేకుండా ప్రజలు కరోనా భారిన పడి పిట్టల్లా రాలిపోతున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అందుకు రాజకీయ పార్టీలు దానికి వత్తాసు పలకడం నిజంగా సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించవచ్చు. రాజకీయ నాయకులకు ఓట్లపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదనడానికి ఈ నిరసన ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి పరిస్థితులు అస్సలు బాగాలేవు. ఎవరూ ఓటింగ్‌లో పాల్గొన కండి. 10 లక్షల మంది చనిపో యినా ప్రభుత్వానికి పోయేదేమీ లేదు. కానీ మీ కుటుంబంలో ఒక్కరిని పోగొట్టుకున్నా మీరు భరించలేరు కాబట్టి ఓటింగ్‌లో పాల్గొనకండి అంటూ వరంగల్‌లోని ఎంజిఎంహెచ్ దగ్గర డాక్టర్ కోట శ్యాంకుమార్ నిరసన(Protest) వ్యక్తం చేశారు.
ఓటింగ్‌లో పాల్గొనకండి మీ ప్రాణాలకు మీరే రక్ష, ఓటు అడిగిన ఏ నాయకుడూ కూడా మీకు వైద్యం చేయించడు ఇది గమనించాలని ప్లకార్డులు చేతపట్టి విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలేసి మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కరోనాతో పోరాడుతుంటే మీ స్వార్థం కోసం ఎన్నికలు పెట్టి ఎంత మందిని కరోనాకు బలితీసుకుంటారని డాక్టర్ కోట శ్యామ్ కుమార్ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సిద్ధిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ పురపాలక సంఘాలకు ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఇందుకు అధికారులు ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లను సిద్ధం చేశారు. అయితే కోవిడ్(covid) రెండో దశ తీవ్రత నేపథ్యంలో జరనున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల ఓటర్లు, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తతుం వరంగల్‌లో కరోనా కేసులు బుధవారం నాటికి 203 కు చేరాయి. ఇక అచ్చంపేటలో 43, నకిరేకల్‌లో 43, సిద్ధిపేటలో 80, ఖమ్మం నగర పాలక సంస్థలో 312 కరోనా కేసులు ఉన్నాయి.
నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్ (video)
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం