DK Shruti reddy

DK Shruti reddy: బీజేపీ నాయ‌కురాలి కూతురిపై ఎస్సీ,ఎస్టీ కేసు న‌మోదు!

Telangana

DK Shruti reddy హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రం బీజేపీ నేత డీకె అరుణ కూతురు డికె.శృతిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధ‌వారం న‌మోదైంది. కోర్టు అనుమ‌తుల‌తో శృతి రెడ్డి(DK Shruti reddy), వినోద్ పై కేసు నోమోదు చేశారు పోలీసులు. న‌గ‌రంలోని బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో ఎలిషా బాబు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ప‌లు సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. బంజారాహిల్స్‌లోని పివిపి(PVP) కాంపౌండ్ వ‌ద్ద నిర్మాణం ప‌నులు చేస్తున్న త‌మ‌పై శృతిరెడ్డి దూషించార‌ని ఫిర్యాదులో బాధితుడు ఎలిషా బాబు పేర్కొన్నారు. అంతేకాకుండా శృతి రెడ్డి దూషించే వీడియోల‌ను ఆధారాల‌తో స‌హా పోలీసుల‌కు చూపించారు. దీంతో పోలీసులు డీకె.అరుణ కూతురిపై కేసు న‌మోదు చేశారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *