COVID Hospital : కడపలో ప్రైవేటు ఆస్పత్రులు అన్యూహ్య నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి కోవిడ్ కేసులు అడ్మిట్ చేసుకోబడవని తేల్చి చెప్పాయి. అయితే ఇటీవల ప్రభుత్వం కోవిడ్ ప్రైవేటు ఆస్పత్రులపై దాడులు చేయడం వల్లనే వారికి కోపం వచ్చి ఇలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది?
COVID Hospital : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం కాసులకు కక్కుర్తి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్(corona virus) సోకి చావు బతుకుల మధ్య ఆస్పత్రికి వస్తున్న కరోనా బాధితుల రక్తం పీల్చుతున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం రెండు మూడు రోజుల క్రితం కొరఢా ఝుళిపించింది. దీంతో యాజమాన్యాలకు కోపం వచ్చినట్టు ఉంది. ఇలా వేధిస్తే కరోనా బాధితులను చేర్చకోబోమని కడపలోని కొన్ని ఆస్పత్రులు ‘ఈ రోజు నుంచి కరోనా కేసులు అడ్మిట్ చేసుకోబడవు’ అని బోర్డులు, బ్యానర్లు ఆసుపత్రి ప్రాంగణం ఎదుట వెలిశాయి. ఒక విధంగా ఇది సాహసమే అని చెప్పాలి. అదే సమయంలో చట్టం పర్యవసనాలు తెలియని మూర్ఘత్వం అనుకోవాలి. పాండమిక్ చట్టాల(epidemic act) ప్రకారం ఆస్పత్రులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలను ఉంటుంది. ఒక ఆస్పత్రులే కాదు.. ప్రభుత్వానికి అవసరమైన భవనాలు, వాహనాలు వంటివి తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు.
ఇవేమీ తెలుసుకోకుండా, మా దోపిడీకి అడ్డొస్తే..ఆస్పత్రులు మూసేస్తాం అంటే ఆస్పత్రులు శాశ్వతంగా కోల్పోవడం తో పాటు, జైలు ఊచలు కూడా లెక్కించాల్సి వస్తుందని ప్రజలు, నిపుణులు అంటున్నారు. అక్రమాలకు పాల్పడు తున్న ఆస్పత్రులపై ప్రభుత్వ చర్యలు చట్టపరమైనవే అని, ఈ నిబంధనలు ఇలా అమలు చేయకపోతే సామాన్య జనం పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు ఇలా నిర్ణయం తీసుకోవడం ప్రజలకే నష్టం.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court