Discipline | క్రమశిక్షణ అంటే శిక్షగాను, తిరస్కారంగాను, ఆత్మత్యాగంగాను కొందరు అపార్థం చేసుకుంటారు. ఈ రకమైన భావం వారి అంతరాంతరాలలో గూడుకట్టుకుని ఉంటుంది. చిన్నతనంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వానిరి బాగా క్రమశిక్షణలో పెట్టి ఉంటారు. అందుకే ఈ భావం ఎక్కువుగా ఉంటుంది. కాని, క్రమశిక్షణను సరిగ్గా అర్థం చేసుకుంటే దాని వల్ల జీవితంలో ఎన్నో సాధించవచ్చని అంటున్నారు కెరీర్ నిపుణులు.
Discipline: కొన్ని త్యాగం చేయక తప్పదు!
క్రమశిక్షణ వల్ల వ్యక్తి జీవితంలో సరదా కొరవడుతుందన్నది వాస్తవమే. కానీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వల్పకాలిక వినోదాలను ఒక్కోసారి త్యాగం చెయ్యకతప్పదు. దీంతో ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడం, దానివల్ల కలిగే సంతృప్తి, సంతోషాల ముందు ఆ త్యాగం వెలవెలపోతుంది. క్రమశిక్షణ, విశ్వసనీయత ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. దానికి కారణమేంటంటే క్రమశిక్షణ గల వ్యక్తి తాను చేయవల్సి ఉన్న పనులపైన కాలపరిమితులపైన దృష్టిసారించి నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేసేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. అలాగే క్రమశిక్షణకు విలువనిస్తారు కూడా. అప్పుడే జీవితంలో జయించగలగుతారు.
ఆఖరికి రాజకీయనాయకులకు కూడా!
క్రమశిక్షణ అనేది పిల్లల వద్ద నుంచి పెద్దల వరకు చివరకు రాజకీయ ప్రముఖల వరకు నేర్చుకోవాల్సిందే, పాటించాల్సిందే. పిల్లల పెంపకంలో గారాభం ఎక్కువ అయితే క్రమశిక్షణకు తావు ఉండదు. కాస్త అప్పుడప్పుడు కఠువుగానైనా ఉండి వారిని సరైన దారిలో ఉంచి వారికి క్రమశిక్షణ అలవాటు చేయాలి. చిన్న పిల్లలప్పుడే Discipline తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాలి. ఆ తర్వాత గురువుల వద్దకు వెళ్లిన తర్వాత 10 మంది పిల్లల మధ్య క్రమశిక్షణ కలిగి ఉండటం నేర్చుకుంటారు. పై చదవులకు వెళ్లిన తర్వాత స్నేహితులతో క్రమశిక్షణ కలిగి ఉంటారు. అనంతరం ఉద్యోగాలు, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు సమాజంలో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ఇలా కింది స్థాయి నుండి క్రమశిక్షణ పరిస్థితులు వారిని మరింత బలవంతులను చేస్తాయి. ఉన్నత శిఖరాలు అందుకోవడానికి దోహద పడతాయి.
మనం చూస్తూనే ఉంటాం. రాజకీయాల్లో కూడా Discipline లేని నాయకుడిపై చర్చలు తప్పకుండా తీసుకుంటారు. వారి పార్టీ నిబంధనలను పాటించకుండా ఇష్టారీతాగా మాట్లాడేవారిని, ప్రవర్తించే వారిని పార్టీ అధిష్టానం హెచ్చరిస్తుంది. వారి ఆగడాలు మరింత ఎక్కువ అయితే చివరికి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. అప్పుడు చివరకు పార్టీ నుండి కూడా తొలగిస్తారు. నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం క్రమశిక్షణ. అది ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారితో మాట్లాడే తీరు, వారు అడిగే ప్రశ్నలకు బదులిచ్చే సమాధానాలు ఏ విధంగా ఉంటాయో కొందరి నాయకులను బట్టి మనం చూస్తూనే ఉంటాం. క్రమశిక్షణ లేనివాడు ఎక్కడా కూడా ఇమడలేడు. చివరకు ఇబ్బందుల పాలవుతాడు.