disadvantages of using a credit card :క్రెడిట్ కార్డుల‌తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

0
13

disadvantages of using a credit card: చిన్న చిన్న అవ‌స‌రాల‌కు డ‌బ్బులు తీసుకునేందుకు క్రెడిట్ కార్డు వాడ‌టం నేడు ప్ర‌తిఒక్క‌రికీ ఫ్యాష‌న్ గా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. అవ‌సర‌మున్నా లేక పోయినా క్రెడిట్ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసి, ఇష్టానుసారం వినియోగించి.. త‌ర్వాత ఇచ్చే బిల్లులు, టాక్స్‌ల‌తో ప‌లువురు ల‌బోదిబోమంటున్నారు.

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉద్యోగుల‌కు క్రెడిట్ (disadvantages of using a credit card)కార్డు వ‌ల్ల చాలా ఉప‌యోగాలున్నాయి. అయితే దానిని వాడే విధానంలో నిర్ల‌క్ష్యం చూపినా వినోదాల‌కు ఖ‌ర్చు చేసినా వ‌చ్చే జీతానికి క‌ట్టే అమౌంట్‌కు ఎక్క‌డా పొంత‌న కుద‌ర‌క తీవ్ర ఇక్క‌ట్లు ప‌డాల్సి వ‌స్తుంది.

క్రెడిట్ కార్డు అంటే అప్పు చేసి ప‌ప్పుకూడు తిన్న‌ట్టే. అప్పు ఒక‌ప్పుడు త‌ప్పు కావ‌చ్చు కానీ, నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రికీ రుణాలు తీసుకోవడం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. బ్యాంకుల‌కు, ఆర్థిక సంస్థ‌ల‌కు ఇదే ప్ర‌ధాన వ్యాపారంగా మారింది. ఈ బాకీలు తీర్చ‌డంలో ఏమాత్రం అశ్ర‌ద్ధ చూపినా నిండా ఊబిలో కూరుకుపోవ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. లేదంటే అప్పులు తీర్చ‌డానికి కొత్త అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంటుంది.

క్రెడిట్ కార్డు తీసుకునే ముందే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు!

కార్డు తీసుకునే ముందు పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలి. అప్లికేష‌న్ పూర్తి చేసే స‌మ‌యంలో ఇన్సూరెన్స్ కావాలా? వ‌ద్దా? ఆఫ్ష‌న్ తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ రూ.500 నుంచి ఆపైన ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడినా వాడ‌క‌పోయినా నెల‌నెలా ఇన్సూరెన్స్ చెల్లించ‌క త‌ప్ప‌దు.

క్రెడిట్ కార్డు ద్వారా రూ.30,000/- వాడి దానిని చెల్లించ‌కుంటే ఇఎంఐ సౌక‌ర్యం కోసం సంబంధిత బ్యాంకును కోర‌వ‌చ్చు. దీని వ‌ల్ల నెల నెలా కొంత సొమ్ము క‌ట్టే వెసులుబాటు ఉంటుంది. లేనిప‌క్షంలో వ‌డ్డీ, చ‌క్ర వ‌డ్డీల‌తో త‌డిసి మోపెడు అవుతుంది.

జాగ్ర‌త్త‌లు తీసుకోండిలా!

వివిధ బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులు ఉప‌యోగించే ముందు అప్ర‌మ‌త్తంగా లేకుంటే స‌మ‌స్య‌లు కోరి తెచ్చుకున్న‌ట్టే. ఒక్కో స‌మ‌యంలో చ‌క్ర‌వ‌డ్డీ క‌ట్టాల్సి వ‌స్తుంది. అకౌంట్ స్టేట్ మెంట్ వ‌చ్చే వ‌ర‌కూ ఎదురు చూడ‌కుండా ప్ర‌తి నెలా బిల్లులు చెల్లించాలి. లేదంటే అద‌న‌పు ఛార్జీల మోత త‌ప్ప‌దు. అద‌న‌పు ఛార్జీలు వ‌చ్చినా, కొనుగోలు చేయ‌ని వాటికి బిల్లులు వ‌చ్చినా వెంట‌నే ఒక లెట‌ర్ త‌యారు చేసి బ్యాంకుకు రిజిస్ట‌ర్ పోస్టులో పంపించాలి.


కార్డు ఉంది క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఇష్టారాజ్యంగా వినియోగించ‌కూడ‌దు. ఒక వేళ కార్డు పోగొట్టుకుంటే వెంట‌నే పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాలి. త‌ర్వాత బ్యాంకు వారికి విష‌యం తెలియ‌జేయాలి. కార్డు పోయినా లేక ఏదైనా స‌మ‌స్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను సంప్ర‌దించాలి.

అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం!

క్రెడిట్ కార్డు తీసుకున్న తొలి నెల‌లో డ‌బ్బులు క‌ట్టాల్సిన తేది నుంచి మీరు చెల్లించే వ‌ర‌కూ వ‌డ్డీ కూడా భ‌రించాలి. ఆల‌స్యంగా క‌ట్టినందుకు అప‌రాధ రుసుం క‌ట్టించుకుంటారు. ఆల‌స్య చెల్లింపుల రుసుం కూడా వ‌సూలు చేస్తారు. కొన్ని బ్యాంకుల్లో లేటు ఛార్జీలు, లేటు పేమెంట్ రుసుం పేరుతో అద‌నంగా వ‌సూలు చేస్తారు. వ‌డ్డీ రేట్లు ఆయా బ్యాంకుల‌ను బట్టి మారుతాయి. తెలిసీ తెలియ‌క ఇందులో ఇరుక్కుపోతే త‌ర్వాత వ్య‌థ త‌ప్ప‌దు మ‌రి.

Latest Post  Bank Holidays march 2022: ఈ నెల‌లో మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు.. సెల‌వులు ఎన్ని రోజులంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here