Dinner Tea Recipe: రాత్రి వేళలో భోజనం తర్వాత డిన్నర్ టీ తీసుకుంటే నిద్రను కలిగిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. పొట్ట ఉబ్బరింపుని తగ్గిస్తుంది. గ్యాస్‌ని తయారవ్వనివ్వదు. జీర్ణక్రియా సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
–సోపు గింజలు పావు చెంచాడు
-దాల్చిన చెక్క ముప్పావు చెంచాడు
-జాజికాయ పొడి పావు చెంచా
-నీళ్లు 1 కప్పు
-పాలు పావు కప్పు
-పాతబెల్లం లేదా తేనె లేదా పటికబెల్లం లేదా పంచదార
Dinner Tea Recipe: తయారు చేసే విధానం!
స్టవ్ వెలిగించాలి. 1 కప్పు నీళ్లను స్టవ్‌మీద పెట్టి మరగించాలి. మరిగే నీళ్లకు సోపు గింజలు పావు చెంచాడు, దాల్చిన చెక్క చూర్ణం ముప్పావు చెంచాడు, జాజికాయ పొడి పావు చెంచాడు కలపాలి. వెంటనే మూత పెట్టాలి. స్టవ్ ఆపేయాలి. 5 నిమిషాలు వేచి ఉండాలి. కప్పులోకి వడపోసుఒని, పావు కప్పు పాలు కలపాలి. ఇష్టమైన తీపిపదార్థాన్ని కలిపి తాగాలి.