DIG Kanthi Rana Tata : దాడి జ‌రిగిన‌ట్టు ఆధారాలు లేవు : డీఐజీ

Spread the love

DIG Kanthi Rana Tata : దాడి జ‌రిగిన‌ట్టు ఆధారాలు లేవు : డీఐజీ

DIG Kanthi Rana Tata : తిరుప‌తిలో చంద్ర‌బాబు రోడ్‌షోలో రాళ్ల దాడి ఘ‌ట‌న‌పై తిరుప‌‌తి అర్బ‌న్ ఎస్పీ కార్యాల‌యంలో అనంత‌పురం రేంజ్ డీఐజీ కాంతి రానా టాటా(DIG Kanthi Rana Tata) స్పందించారు. మంగ‌ళ‌వారం డీఐజీ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. చంద్ర‌బాబు రోడ్ షో 5.30 గంట‌ల‌కు ప్రారంభ‌మై రాత్రి 7.45 కి ముగిసింద‌న్నారు. మీటింగ్ చివ‌ర‌లో ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు రాళ్లు త‌గిలాయ‌ని చెప్పార‌న్నారు. వారిని ఆసుప‌త్రికి పంపించామ‌న్నారు. సీన్ రీక‌న్ట్స్ర‌క్ష‌న్ చేశామ‌న్నారు. సీసీ టీవీ పుటేజ్‌, ప్ర‌త్య‌క్ష సాక్షుల‌ను ప‌రిశీలించినా ఆధారాలు ల‌భించ‌లేద‌న్నారు.

టిడిపి నేత‌ల ఫిర్యాదు ఆధారంగా చంద్ర‌బాబు భ‌ద్ర‌తా సిబ్బంది, ఎన్ ఎస్ జీ క‌మాండోస్ ను విచారించామ‌న్నారు. వాహ‌న శ్రేణిని ప‌రిశీలించామ‌న్నారు. చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌ను అడ్డుకోవాల‌ని రాళ్ల దాడి చేసిన‌ట్టు ఆధారాలు ల‌భించ‌లేద‌న్నారు. పోలీసుల‌పై చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్నామ‌న్నారు. ఎన్నిక‌ల‌ను స‌జావుగా న‌డిపించ‌డానికి పోలీసులు శ్ర‌మిస్తున్నార‌న్నారు. పోలీసుల‌ను నిందించ‌డం స‌బ‌బు కాద‌ని డీఐజీ అన్నారు.

ఫిర్యాదు చేసిన టిడిపి నాయ‌కుల‌ను ఆధారాల‌ను స‌మ‌ర్పించాల‌ని కోరామ‌న్నారు. స‌మాచారం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు కి నోటిసు ఇచ్చామన్నారు. ఆధారాలు ఇవ్వాల‌ని మాత్ర‌మే నోటీసులు ఇచ్చామ‌న్నారు. విజువ‌ల్స్ ఏమ‌న్నా ఉంటే స‌మ‌ర్పించాల‌ని కోరామ‌న్నారు. ఫిర్యాదు ఇచ్చిన‌ట్టు విచార‌ణ‌లో ప‌రిస్థితులు క‌నిపించ‌లేద‌న్నారు.

తిరుప‌తిలో చంద్ర‌బాబు రోడ్ షో దృశ్యం

ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టిడిపి అధినేత చంద్ర‌బాబు సోమ‌వారం తిరుప‌తిలోని రైల్వే స్టేష‌న్ ప్రాంతం నుంచి కృష్ణాపురం ఠాణా వ‌ర‌కు రోడ్ షో నిర్వ‌హించారు. అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్ధేశించి ప్ర‌స‌గించారు. ప్ర‌సంగం ముగుస్తున్న స‌మ‌యంలో కొంద‌రు రాళ్ల దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబునాయుడు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు మంగ‌ళ‌వారం తిరుప‌తిలో చంద్ర‌బాబు బ‌స చేస్తున్న బ‌స్సు వ‌ద్ద‌కు వ‌చ్చి నిన్న‌టి దాడి ఘ‌ట‌న‌పై భ‌ద్ర‌తా సిబ్బందిని ఆరా తీశారు. చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త‌, భ‌ద్ర‌తా సిబ్బందిని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. రాళ్లు వేసిన వారిని చూశారా? ఎటువైపు నుంచి వ‌చ్చాయో గ‌మ‌నించారా? అని అడిగి తెలుసుకున్నారు. చంద్ర‌బాబు కాన్వాయ్‌ను తిరుప‌తి అర్బ‌న్ పోలీసులు వీడియో తీశారు. ఈ విష‌య‌మై టిడిపి నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇదే విష‌యంపై సోమ‌వారం రాత్రి వ‌ర్ల రామ‌య్య గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశారు.

Ratna Prabha IAS | Former IAS Ratna Prabha Contest in Tirupathi | తిరుప‌తి లోక్‌స‌భ అభ్య‌ర్థిగా ర‌త్నప్ర‌భా ?

Ratna Prabha IAS | Former IAS Ratna Prabha Contest in Tirupathi | తిరుప‌తి లోక్‌స‌భ అభ్య‌ర్థిగా ర‌త్నప్ర‌భా ?Tirupathi : తిరుప‌తి లోక్‌స‌భ Read more

AP Local body elections | the benefit of Chandrababu |Ambati Rambabu(YSRCP)చంద్ర‌బాబుకు మేలు చేకూర్చ‌డానికే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌య‌త్నాలు: అంబ‌టి

AP Local body elections | the benefit of Chandrababu |Ambati Rambabu(YSRCP)చంద్ర‌బాబుకు మేలు చేకూర్చ‌డానికే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌య‌త్నాలు: అంబ‌టిTadepalligudem: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్థానిక Read more

AP Elections : హైకోర్టు తీర్పు చెంప‌పెట్టులాంటింది : డా.కె.నారాయ‌ణ‌

AP Elections : హైకోర్టు తీర్పు చెంప‌పెట్టులాంటింది : డా.కె.నారాయ‌ణ‌ AP Elections : ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించిన ఎన్నిక‌ల Read more

TDP Formation Day : కేసీఆర్ మాట‌ల్లోనే వైసీపీ పాల‌నేంటో తెలుస్తోంది!

టిడిపి 40వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు TDP Formation Day : ''స‌రిగ్గా 40 ఏళ్ల కింద‌ట ఇదే రోజున Read more

Leave a Comment

Your email address will not be published.