అడ్వ‌కేట్‌కు లాయ‌ర్‌కు తేడా ఏమిటి? | Difference Between Lawyer And Advocate?

Lawyer And Advocate : లాయ‌ర్ అంటే ఎవ‌రు? అడ్వ‌కేట్ అంటే ఎవ‌రు? లాయ‌ర్‌కు, అడ్వ‌కేట్‌కు తేడా ఏమిటి? అస‌లు వాళ్లిద్ద‌రూ ఒక‌టేనా? ఒక‌టేనేమో అనే ప్ర‌శ్న ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌లో మెదిలే అవ‌కాశం కొంద‌రిలో ఉండే ఉంటుంది. కానీ వారిద్ద‌రూ చేసే ప‌నుల్లో, గుర్తిపుల్లో, అర్హ‌త‌ల్లో తేడాలున్నాయి. లాయ‌ర్‌కు కోర్టుకు వెళ్లి వాదించే అవ‌కాశం లేదు. అడ్వ‌కేట్‌కు కోర్టులోకి వెళ్లి వాదించే అవ‌కాశం ఉంది. అది ఎలానో చూద్ధాం!

అడ్వ‌కేట్ ముందుగా ఎల్ఎల్‌బి / బిల్ చ‌దివిన త‌ర్వాత డిగ్రీ పొందుతారు. వారి యొక్క సొంత రాష్ట్రంలో బార్‌కౌన్సిల్ లో ఎన్వ‌రాన్‌మెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్వ‌రాల్‌మెంట్‌లో అడ్వ‌కేట్ తో యాక్ట్ 1961 ప్ర‌కారం ప్ర‌మాణం చేయిస్తారు. అనంత‌రం ఎన్వ‌రాన్‌మెంట్‌ స‌ర్టిఫికెట్ ఇస్తారు. అనంత‌రం ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ (ఏఐబిఇ) ప‌రీక్ష రాసి క్వాలిపై అవ్వాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత పూర్తి స్థాయిలో అడ్వ‌కేట్ అవుతారు. ప్రాక్టీస్ చేసే ప్రాంతం ఏదైనా కోర్టు బార్ అసోసియేష‌న్ లో స‌భ్య‌త్వం తీసుకున్నాక‌, క్ల‌యింట్ కేసుల‌కు వ‌క‌ల్తా వేసుకోవాడినికి అర్హులు అవుతారు. ఈ విధంగా లాయ‌ర్ అడ్వ‌కేట్ అవుతారు. వీరికి కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంది. అన్ని కేసుల విష‌యంలోనూ త‌న‌ వ‌ద్దకు వ‌చ్చిన క్లైయింట్ త‌ర‌పున వాధించే అవ‌కాశం అడ్వ‌కేట్‌కు మాత్ర‌మే ఉంటుంది.

అయితే లాయ‌ర్ మాత్రం ఎల్ఎల్‌బి చేసి డిగ్రీ పొందిన‌ప్ప‌టికీ బార్ కౌన్సిల్‌లో ఎన్వ‌రాన్‌మెంట్‌ చేసుకోనంత వ‌ర‌కు కోర్టుకు వెళ్లే అవ‌కాశం లేదు. కేవ‌లం లీగ‌ల్‌గా ఎవ‌రికైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డానికి మాత్రం లాయ‌ర్ వృత్తి ప‌నికి వ‌స్తుంది. త‌ప్ప కోర్టుల్లోకి వెళ్లి క్లైయింట్ త‌ర‌పున వాదించే అవ‌కాశం లేదు. ఎవ‌రైనా బిజినెస్‌లు పెట్టుకున్న‌ ప్పుడు కానీ, బ్యాంకులు యాజ‌మాన్యాలు లాయ‌ర్ల‌ను లీగ‌ల్ అడ్వ‌జ‌ర్లుగా స‌ల‌హాలు, సూచ‌ల‌ను ఇవ్వ‌డానికి వ్య‌క్తిగ‌తంగా పెట్టుకుంటారు. అయితే లాయ‌ర్ భ‌విష్య‌త్లో అడ్వ‌కేట్ అవ్వ‌డానికి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసి, బార్ అసోసియేష‌న్‌లో స‌భ్య‌త్వం తీసుకుంటే అడ్వ‌కేట్‌గా మారే అవ‌కాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *