diabetic retinopathy stages: విద్యావంతుల శాతం పెరిగిన కొద్దీ ఆధునికత పెరుగుతోంది. దాంతోపాటు రకరకాల వ్యాధులు విస్తరిస్తున్నాయి. అలాంటివాటిలో ప్రముఖంగా చెప్పకోవలిసింది మధు మేహం. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ముప్పై రెండు లక్షల మంది మధుమేహ వ్యాధి వల్ల మరణిస్తు న్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
నిజానికి ఈ వ్యాధి ముదరకుండా అదుపులో ఉంచగలిగితే జీవితాంతం హాయిగా గడిపేయవచ్చు. కాని చాలా మందికి Diabetes పైన సరియైన అవగాహన కలగడం లేదు. ఫలితంగా కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బుల వంటి ఇతర సమస్యలు వస్తున్నాయి. వీటితోపాటు జీవితాన్ని అంధకా రంలోకి తోసే మరో సమస్య డయాబెటిక్ రెటినోపతి diabetic retinopathy stages, డయాబెటిస్ వల్ల వచ్చే కంటిజబ్బు (eye strain).
diabetic retinopathy stages: నిర్లక్ష్యమే ప్రధాన కారణం
చాలా మంది మధుమేహం విషయంలో సరియైన జాగ్రత్తలు పాటించరు. వైద్యులు తెలిపిన ప్రకారం ఆహారనియమాలు పాటించడం, వ్యాయామం చేయడం వంటి విషయంలో అలసత్వం వహించడం వల్ల వ్యాధి రోజురోజుకూ పెరిగిపోతుంది. వ్యాధి తగ్గకపోవడం వల్ల ఏ రకమైన వైద్యాన్ని స్థిరంగా తీసుకోరు. ఫలితంగా వ్యాధి తీవ్రత పెరుగుతుంది. శరీరంలో పెరిగిన చక్కెరలు, ఇతర సమస్యలు కలిగించిన తర్వాత అప్పుడు కంటి పరీక్షలు చేయించుకున్నా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం అంతగా ఉండదు. కాబట్టి డయాబెటిస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు.
రెటినోపతి ఎలా వస్తుంది?
మన కంటిచూపులో ముఖ్యపాత్ర వహించేది రెటీనా, మధుమేహం వల్ల రక్తంలో పెరిగిన చక్కెరలు ఈ రెటీనాలో ఉండే రక్తనాళాలను దెబ్బతీస్తాయి. క్రమంగా రక్తనాళాలలో వాపు కనిపిస్తుంది. దానివల్ల చూసే దృశ్యం అస్పష్టంగా ఉంటుంది. కన్ను పూర్తిగా దెబ్బతిని అంధత్వాన్ని కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి రెండు కళ్లకూ ఒకేసారి రావచ్చు. రెటీనా వాపును గుర్తించడం కూడా కష్టమే. పూర్తిగా లక్షణాలు కనిపిం చాలంటే, వ్యాధి తీవ్రమైపోవచ్చు. సాధారణంగా వ్యాధి తొలిదశలో చూసే దృశ్యం అస్పష్టంగా మచ్చలతో కనిపిస్తుంది. ఆ తరువాత క్రమంగా దృష్టి మందగిస్తుంది.
నిర్ధారణ ఎలా?
మన శరీరంలోని రక్తనాళాలు బయటకు కనిపించే ఏకైక భాగం కన్ను. కాబట్టి కంటిపరీక్షల ద్వారా చాలా రకాల వ్యాధులను గురించి తెలుసుకోవచ్చు. వ్యాధి Diabetic Retinopathy స్థితిని అంచనా వేయవచ్చు. కంటిని మన శరీరానికి కిటికీ వంటిదంటారు. ఎందుకంటే శరీరంలో కలిగే పరిణామాలను కంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ, గుండె వంటి ఇతర సమస్యలు ఉన్నయో లేదో కూడా పరీక్షల ద్వారా కనుక్కోవడం సులభం. కాబట్టి మధుమేహం ఉన్న విషయం తెలియగానే కంటి పరీక్షలు చేయించుకోవాలి.
నివారణ ఎలా?
రెటీనా వాపువల్ల కలిగే ఈ దృష్టి లోపాన్ని లేజర్ చికిత్స ద్వారా సరిచేయవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చికిత్స చేయించుకునే దశను నివారించడమే మేలు. డయాబెటిక్ రెటినోపతి రాకుండా నివారించగల ఉత్తమమైన మార్గం మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం. మధుమేహ నియంత్రణలో తినే ఆహారం, వ్యాయామం, ఆ తరువాతే ఔషధాలు అనే విషయాన్ని గుర్తించాలి. కొందరు ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అని ఎడాపెడా స్వీట్లు తినేస్తుంటారు. కాని దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి తీపికి పూర్తిగా దూరంగా ఉండాలి.
అదే విధంగా వ్యాయామం చేయడం నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజూ చాలా దూరం నడుస్తున్నాం కదా, ఇక వేరే వ్యాయామం exercise, ఎందుకని పొరపడుతుంటారు. కాని, ఉదయం పూట చేసే వాకింగ్ వల్ల మాత్రమే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహాన్ని (diabetic retinopathy stages) నియంత్రించడానికే నడుస్తున్నాననే భావన మనసులో ఉండాలి. ప్రతి నెలా తప్పకుండా రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. మూడు నెలలకు ఒకసారి రెటీనాలో వచ్చే మార్పులను పరీక్ష చేయాలి.
మధుమేహం ఉన్నవారు ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటిపరీక్షలు చేయించుకుంటే ఇతర సమస్యలు బయటపడతాయి. దాన్ని బట్టి ఆయా సమస్యలకు తగిన చికిత్సలు చేయించుకోవడం సులభం అవుతుంది. డయాబెటిస్ Diabetes, ఉన్నా లేకపోయినా 40 ఏళ్ళు దాటగానే కనీసం ఏడాదికి ఒకసారైనా కంటిపరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాదకర సమస్యల నుంచి బయటపడవచ్చు.