diabetes and breastfeeding: బిడ్డకు చనుబాలు ఇవ్వడం ద్వారా తల్లి మధుమేహం నుంచి రక్షణ పొందవచ్చని ఓ అధ్యాయనంలో వెల్లడైంది. గర్భిణిగా ఉన్నప్పుడు గెస్టేషనల్ మధుమేహానికి లోనయ్యే మహిళ కాన్పు తర్వాత బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా దీర్ఘకాలంలో మధు మేహానికి లోనయ్యే ముప్పును తగ్గించు కోవచ్చని పరిశోధకులు గుర్తించారు. మూడు నెలలకు మించి తల్లిపాలు తాగించడం ద్వారా దీర్ఘకాలంలో శరీరంలో జీవక్రియ పరమైన మార్పులు సంభవిస్తాయని తమ అధ్యయనంలో వెల్లడైందని జర్మనీ పరిశోధకులు పేర్కొంటున్నారు.
diabetes and breastfeeding: దీని వల్ల మధుమేహం ముప్పు 40 శాతం దాకా తగ్గుతుందని గుర్తించారు. ఇందుకు కారణాలేమిటనేది వెల్లడవ్వలేదన్నారు. తల్లిపాలు తాగించడం ద్వారా కలిగే రక్షణ ప్రభావం, గెస్టేషనల్ మధుమేహం తర్వాత పదిహేనేళ్ల పాటు ఉంటుందన్నారు. తమ అధ్యయనంలో తేలిన అంశాలతో వ్యాధి సంబంధ జీవక్రియ మార్గాలపై సరికొత్త మార్గాలకు బాటలు పడతాయని పరిశోధకులు సాండ్రా హుమ్మెల్ పేర్కొన్నారు.