Dhanu Rasi 2023: 12 రాశుల వారు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. రాశులు పరిశీలించుకునే వారు కచ్చితంగా వారి ప్రణాళికలను రూపొందించుకుంటారు. ప్రతి ఒక్కరికీ ప్లాన్ ఉంటుంది కానీ ఆ ప్లాన్ ప్రకారం ఏదీ మనం అనుకున్నట్టు జరగదు. కేవలం ప్రకృతి మాత్రమే మన స్థితిగతులను అంచనా వేస్తుంది. ఈ ఏడాది వారు నాలుగు రాశుల వారికి బాగుంటుంది కానీ ఆరు రాసుల వారికి అంతగా బాగుడవని ఆస్ట్రాలజీ (Astrology) పండితులు అంటున్నారు.
ముఖ్యంగా శని, గురు గ్రహాలు ఎక్కువ కాలం ప్రయాణిస్తుంటాయి కాబట్టి అవి బాగా కలిసి వస్తాయని అంటున్నారు. మిగతా గ్రహాలు మాత్రం ప్రతి మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి మారతాయని అంటున్నారు. కానీ శని, గురు గ్రహాలు మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే మారుతాయట. ఈ ఏడాది ముందుగా శని గ్రహం మారిందని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు 2023 రాసుల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు Dhanu Rasi 2023 లో ఎలా ఉంటుందో తెలుసుకుందాము.
Dhanu Rasi 2023: ధనుస్సు రాశి ఫలాలు
2023 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి విడుదల కలగబోతుంది. ఈ రాశి వారికి జనవరి 26, 2023 గత సంవత్సరం నుంచి ఏడున్నర సంవత్సరాలు పడ్డ కష్టాల నుండి విముక్తి కలగబోతుందట. ఈ ధనుస్సు రాశి వారికి 2023లో లక్ష్మీదేవి ఇంటి తలపు తట్టనుందట. ఎందుకంటే ఈ ఏడున్నర సంవత్సరాల పాటు ధనుస్సురాశి వారికి అంతగా కలిసిరాలేదంటున్నారు ఆస్ట్రాలజీ పండితులు. ఇప్పుడు ఈ రాశివారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయట.
మంచి ఉద్యోగాలు, ఆపన్నహస్తం ఇచ్చేవారు ఎదురవ్వబోతున్నారట. 2023లో ధనుస్సురాశి వారికి శత్రువులు కూడా మిత్రులు అవ్వబోతున్నారు. కానీ గతంలో ఉన్న బాధలు, కష్టాలనే తలచుకుంటూ ఉంటే ప్రయోజనం ఉండదట. అదే ఆలోచనలో ఉంటే వచ్చే లక్కు కూడా చేతికందదు అంటున్నారు. ఈ సంవత్సరం (2023) లో టాప్ 3 పొజిషన్లో ఉన్నవారు ఈ రాశివారేనట. కాబట్టి బంధుమిత్రులతో, అన్నదమ్ములతో గొడవలు పడవద్దని అంటున్నారు. ముఖ్యంగా అహంకారం వీడాలంటున్నారు.
అన్నీ మంచి రోజులే
Dhanu Rasi 2023: ఈ ఏడాది ప్రతి ఒక్కరినీ ప్రేమించండి, క్షమించండి అంటున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి 2023 నుండి 2027 సంవత్సరం వరకు అంతా మంచిగానే జరుగుతుందట. వీరికి శని గ్రహం బాగా కలిసి వస్తుందట. ఆంజనేయ స్వామిని పూజించాలని అంటున్నారు. మానసికంగా ఈ రాశివారు గత కాలం వరకు కుంగిపోయి ఉంటారంట. కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉండబోతున్నారట. అప్పులు కూడా తీరిపోతాయంట. ప్రతి ఒక్కరూ ఇక నుండి ధనుస్సు రాశి వారికి అంతా మంచే జరగనుందట.
ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి చాలా బాగుంటుందట. రక్త సంబంధీకుల నుండి ఆదరణ పొందుతారట. ధనుస్సు రాశి వారకి ఈ ఏడాది వారి కుటుంబాల్లో వెలుగు రాబోతుందని చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వారికి అన్నీ లాభదాయకంగానే జరగనున్నాయట. జనవరి 26, 2023 నుంచి గ్రహాలు మార్పు చెందుతాయి కాబట్టి అప్పటి నుంచి మంచి ఫలితాలను, ఫలాలను ధనుస్సురాశి అందుకోబోతున్నారని ఆస్ట్రాలజీ పండితులు చెబుతున్నా మాట.