Dhana Pathiram: మనకు ఉన్న ఆస్థి అనగా భూమిలో ఇతరులకు అనగా పేదవారికి, బంధువులకు, రక్త సంబంధీకులకు, పోషించిన వారికి, ఏదైనా దేవాలయాలకు కొంత భూమి ఇవ్వడాన్నే దాన పత్రం అంటారు.
ఇది ఎటువంటి రుసుము చెల్లించకుండా కేవలం అభిమానంతోనూ, భక్తితోనూ, ప్రేమతోనూ ఇచ్చే ఆస్తిగా చెప్పవచ్చు. ఈ భూమి సర్వ హక్కులు సదరు యజమానికి ఉండటం వల్ల ఆ యజమాని రాసి ఇచ్చే పత్రాన్ని దాన పత్రంగా చెప్పవచ్చు. Dhana Pathiram ఎలా రాయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దాన పత్రము ఎలా రాయాలి?
దాన పత్రం ఒక రిజిస్ట్రేషన్ స్టాంప్ కాగితాలపై వ్రాసుకోవచ్చు. ముందుగా దాన పత్రం రాసేటప్పుడు సంవత్సరం, నెల, తేదీ అంకెలతో పాటు అక్షరాలలో రాయాలి. తరువాత వ్రాయించుకున్నవారు, వ్రాయించి ఇచ్చిన వారు పూర్తి చిరునామా రాసి ఉండాలి.
వ్రాయించుకున్నవారు జిల్లా, మండలం, పట్టణం/ గ్రామం, కాలనీ వారి తండ్రి పేరు, వారి పేరు, ఒక వేళ దేవాలయం సభ్యులు అయితే ధర్మకర్త పేరు, ట్రస్టు సభ్యులు అయితే వారి పేర్లు రాయాలి. వ్రాయించి ఇచ్చిన వారి పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, పట్టణం / గ్రామం, కాలనీ పేరు, ఇంటి నెంబర్, ఆధార్ నెంబర్, సెల్ నెంబర్ కూడా రాయవచ్చు.
తరువాత స్వభావం రాయాల్సి ఉంటుంది. స్వభావం అనగా ఆస్తి, భూమి ఎక్కడ ఉంది. ఏ ప్రాంతంలో ఉంది. ఎన్ని గుంటలు(సెంట్లు) ఉంది. ఎంత చదరపు గజాలు ఉంది. లింకులు తో సహా రాయాల్సి ఉంటుంది.
వ్రాయించి ఇచ్చిన వారు తన నిర్వివాద స్వాధీన అనుభవ హక్కుభుక్తములలో ఉన్న భూమిని సదరు దేవాలయంకు గానీ, వ్యక్తులకు గానీ, ట్రస్టుకు గానీ స్వాధీనం చేయటమైనది అని తెలియజేయాలి.
ఏ అవసరం కోసం భూమి దానం చేస్తున్నారో తెలియజేసి, అట్టి భూమిని ఇతర ఏ విధమైన అన్యాక్రాం తములు చేయుట గానీ, ఇతర ప్రయోజనాలు కొరకు స్థలము వినియోగించరాదనే వాక్యం తప్పని సరిగా తెలియజేయాలి.
అనంతరం Dhana Pathiram రాసేటప్పుడు నుంచి స్థలము యందు వ్రాసుకునే వారికే (దేవాయలం, ట్రస్టు) సర్వహక్కులు ఉంటాయని దానం చేసే స్థలం విషయంలో తెలియజేసి రాయాలి.
ఇక మాకు గాని, మా వారసులకు గాని, నా సంతానముకు గాని పైన దానం చేసిన ఆస్తి విషయంలో ఏ విధమైన హక్కులు ఉండబోవని దానపత్రంలో రాసి ఇవ్వాలి. చివరిగా దాన పత్రం నా ఇష్టపూర్తిగా వ్రాయించి ఇచ్చానని ముగించాలి.
Dhana Pathiramలో చివరిగా షెడ్యూలు రాయాల్సి ఉంటుంది. ఈ షెడ్యూలులో ఆస్తి/ భూమి యొక్క హద్దులు రాయాల్సి ఉంటుంది. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం హద్దులు ఎవరు ఉన్నారో వారి స్థలం ఎన్ని గజాలు ఉందో వారి పేరుతో సహా రాయాల్సి ఉంటుంది.
అనంతరం సాక్షులు సంతకాలు, వారి ఆధార్ కార్డులు దానపత్రం రాసిన స్టాంప్ పేపర్లకు జత చేయాల్సి ఉంటుంది. ఇరువురి సంతకాలు పెట్టిన తరువాత జిరాక్స్ కాపీలు, ఒరిజనల్ కాపీలు ఇరువురి వద్ద ఉండాలి.