Police Recruitment

Police Recruitment : పోస్టుల రిక్రూట్ మెంట్‌పై అపోహ‌లు వ‌ద్దు

Spread the love

Police Recruitment : ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల‌పై డీజిపి గౌతమ్ స‌వాంగ్ స్పందించారు. దేశానికే ఆద‌ర్శంగా ఏపీ పోలీసు వ్య‌వ‌స్థ ఉంద‌ని కొనియాడారు. అలాగే జాబ్ క్యాలెండ‌ర్‌పై గురించి కూడా మాట్లాడారు.


Police Recruitment : అమ‌రావ‌తి : మ‌హిళా సంర‌క్ష‌ణే ధ్యేయంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌డుతూ దేశంలోనే ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని రాష్ట్ర డిజిపి గౌత‌మ్ స‌వాంగ్ అన్నారు. సోమ‌వారం వారు మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గ్రామ స‌చివాల‌యాలు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయ‌ని అన్నారు. మ‌హాత్మాగాంధీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యం సాకార‌మ‌య్యే దిశ‌గా ముందుకు క‌దులుతున్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి గ్రామంలో ఒక మ‌హిళ రూపంలో పోలీస్ వాఖ ప్ర‌తినిధి ఉండాల‌నే ఉద్ధేశ్యంతో, గ్రామ స‌చివాల‌యంలో గ్రామ / వార్డు మ‌హిళ సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి అనే పోస్టును సృష్టించి సుమారు 15,000 మందిని రిక్రూట్ చేసుకున్నామ‌న్నారు. వీరి సేవ‌ల‌ను మ‌రింత విస్తృత ప‌ర‌చాల‌న్న ఉద్ధేశ్యంతో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప‌నిచేసే మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శుల‌ను మ‌హిళా పోలీస్‌గా గుర్తిస్తూ ఈ మ‌ధ్య‌నే ఉత్త‌ర్వుల‌ను జారీ చేశామ‌న్నారు.

పోలీస్‌శాఖ ప్ర‌తినిధిగా, మహిళా పోలీసులు ప్ర‌తి ఇంటి గ‌డ‌ప వ‌ద్ద‌కు వెళ్లి అద్భుత‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నార‌న్నారు. ఇప్ప‌టికే 20 ల‌క్ష‌ల మందికి పైగా మ‌హిళ‌లు దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవ‌డంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషించార‌న్నారు. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా 96 పోలీస్ సేవ‌ల‌ను అందిస్తున్నార‌ని డిజిపి తెలిపారు. గ్రామంలో పోలీస్ స్టేష‌న్ యొక్క విస్త‌రించిన మ‌రో అస్త్రం ఈ మ‌హిళా పోలీసు అని కొనియాడారు. వారికి పోలీసు శాఖ అధికారులు, విధులు త్వ‌ర‌లో ఇవ్వ‌బోతున్నామ‌ని పేర్కొన్నారు.

క‌ఠోర శిక్ష‌ణ‌తో అత్యున్న‌త స్థానం!

పోలీసు శాఖ లో శిక్ష‌ణ అనేది కీల‌క‌మైన అంశం అన్న విష‌యాన్ని గుర్తించాల‌ని, క‌ఠోర శిక్ష‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసును అత్యున్న‌త స్థానంలో నిల‌బెడుతోంద‌న్న విష‌యం మ‌న‌కంద‌రికీ తెలిసిందేన‌ని అన్నారు. మ‌హిళా పోలీసుల‌కు కూడా అత్యున్న‌త శిక్ష‌ణ ఇచ్చేందుకు పూనుకు న్నామ‌న్నారు. ఇప్ప‌టికే ప్రాథ‌మిక శిక్షణ పూర్త‌య్యింద‌ని, విడ‌త‌ల వారీగా వీరికి క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వ‌బోతున్నామ‌ని తెలిపారు.

పోస్టుల భ‌ర్తీని ప‌రిశీలిస్తాం!

14,000 వేల కానిస్టేబుల్ పోస్టులు భ‌ర్తీ చేయ‌లేదు అన్న విష‌యంలో నిజ‌నిజాల‌ను చూస్తున్నామ‌న్నారు. ముందుగా 15000 మ‌హిళా పోలీసులు పోలీసు శాఖ‌లో చేరార‌న్న విష‌యాన్ని అంద‌రూ గుర్తించాల‌న్నారు. పోలీసు శాఖ‌లో వారి చేరిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుశాఖ‌కు గ‌ర్వ‌కార‌ణం , దేశానికే ఆద‌ర్శ‌మ‌ని డిజిపి అన్నారు. పోలీసు శాఖ‌లో మ‌హిళా భాగ‌స్వామ్యం 33 శాతం ఉండాల‌న్న జాతీయ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వీరి నియామ‌కం చేబ‌ట్ట‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు శాఖ కీర్తిని ఇనుమ‌డింప చేస్తున్న‌ద‌న‌డంలో ఎటువంటి సందేహం లేద‌న్నారు. 2019 – 20 లో ఇప్ప‌టికే 3057 మంది కానిస్టేబుళ్ల‌ను రిక్రూట్ చేసుకుని, శిక్ష‌ణ ఇచ్చి డ్యూటీలో చేర్చుకున్నామ‌ని, ఇంకా 11000 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని అన్నారు.

దుష్ప్ర‌చారం చేస్తున్నారు!

మ‌హిళా పోలీసుల క్యాప్సూల్ శిక్ష‌ణ ఉండ‌టం వ‌ల్ల‌, శిక్ష‌ణ సామ‌ర్థ్యం 6,500 మందికి మాత్ర‌మే కావ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వం వ‌చ్చే జాబ్ క్యాలెండ‌ర్ నుండి సంవత్స‌రానికి 6,500 చొప్పున భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యిం చార న్నారు. అయితే దీనిని వ‌క్రీక‌రించి దుష్ప్ర‌చారం చేయ‌డం, నిరుద్యోగుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్ల‌డం బాధాక‌రం. కాబ‌ట్టి పోలీసు శాఖ‌లో చేరాల‌నుకునే ఆశావ‌హులు, నిరుత్సాహం చెంద‌కుండా, కొంత ఓపిక వ‌హించాల‌ని డిజిపి మ‌న‌వి చేశారు.

ఉద్యోగ నియామ‌కాల విష‌యానికి వ‌స్తే ఈ ప్ర‌భుత్వం రెండు సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధిలో 1,84,264 రెగ్యూల‌ర్ ఉద్యోగాలు, కాంట్రాక్టు ప‌ద్ధ‌తి ద్వారా 19701 ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2193 ఉద్యోగాలు మొత్తం 605949 ఉద్యోగాలు విచ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌ని అన్నారు. ఇది ఇలా ఉండ‌గా, రికార్డులను ప‌రిశీలిస్తే, గ‌త ప్ర‌భుత్వం 5 సంవ‌త్స‌రాల కాలంలో కేవ‌లం 34563 ఖాళీలు మాత్ర‌మే భ‌ర్తీ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందేని పేర్కొన్నారు.

Mudragada letter: నా ఉత్త‌రాల‌కు భుజాలు త‌డుముకుంటున్న పెద్ద‌లు ఎందుకో మరి!?

Mudragada letter కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రాసిన లేక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌న ఉత్త‌రాలు చ‌దివి చాలా మంది పెద్ద‌లు భుజాలు Read more

TDP Volunteers: ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారనున్న వాలంటీర్లు

TDP Volunteers అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పైన ప‌లు విమ‌ర్శ‌లు చేసిన టిడిపి ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుని పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్స‌హాన్ని నింపే ప్ర‌య‌త్నం Read more

fake currency:దారి బాట‌లో న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట!

fake currencyవినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈపూరు మండ‌లంలోని న‌కిలీ క‌రెన్సీ వెలుగు చూసింది. ఓ రైతు పొలంకు వెళుతుండ‌గా క‌వ‌ర్లో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌టాన్ని Read more

AP News today:ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పై మ‌హిళా నాయ‌కురాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌

AP News today:పెడ‌న: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన వైసీపీ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పై ఆ పార్టీకి చెందిన Read more

Leave a Comment

Your email address will not be published.