Depression Problems:డిప్రెష‌న్ లో ఉన్నారా? అయితే మాన‌సిక స్థైర్యాన్ని నింపేదెలా?

Depression Problems డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డే వారికి ఆత్మీయుల అండ చాలా ముఖ్యం. వారిలో మాన‌సిక స్థైర్యాన్ని నింప‌డంతో పాటు డాక్ట‌ర్లకు చూపించ‌డం ద్వారా వారు సాధార‌ణ జీవితం గ‌డిపేలా చేయ‌వ‌చ్చు. బాధ‌గా ఉండ‌టం, ఆత్య‌న్యూన‌త‌కు లోనుకావ‌డం, నిరాశ‌, నిస్పృహ‌ల‌తో రోజులు గ‌డ‌వ‌డం, జీవితంప నిరాస‌క్త‌త‌, చేసే ప‌నుల‌పై ఆస‌క్తి లేక‌పోవ‌డం, ఒంట‌రిగా గ‌డ‌పాల‌ని అనిపించ‌డం, ఇలాంటి ల‌క్ష‌ణాలున్న‌ట్ల‌యితే డిప్రెష‌న్‌లో ఉన్నార‌ని గుర్తించాలి. డిప్రెష‌న్ పురుషుల్లో క‌న్నా స్త్రీల‌లో ఎక్కువుగా(Depression Problems) చూస్తుంటాం.

నిజానికి ఈ డిప్రెష‌న్ అనేది అంద‌రికీ వ‌స్తుంది. అయితే కొంద‌రిలో అది కొన్ని రోజుల పాటు ఉంటుంది. కొంద‌రిలో వారాల‌పాటు ఉంటుంది. ఇలా వారాల‌పాటు డిప్రెష‌న్ కొన‌సాగ‌డం స‌మ‌స్యాత్మ‌కం. ఈ స్థాయిల‌ను గుర్తించి చికిత్స తీసుకోగ‌లిగిన‌ప్పుడు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతారు. అస‌లు తాము డిప్రెష‌న్‌లో ఉన్నామ‌న్న సంగ‌తిని గుర్తించ‌గ‌ల‌గ‌డ‌మే అస‌లు విష‌యం. డిప్రెష‌న్‌లో ఉన్నంత‌కాలం ప్ర‌తికూల భావ‌న‌లు వెంటాడుతూ ఉంటాయి. బాధ‌తో పాటు ఆక‌లి ఉండ‌క‌పోవ‌డం, క‌ల‌త నిద్ర‌, ఏ ప‌నిమీదా ఆస‌క్తి లేక‌పోవ‌డం, ప్ర‌తిదానికి త‌ప్పు చేశామ‌న్న భావ‌న క‌ల్గ‌డం, సిగ్గుగా అనిపించ‌డం వంటివ‌న్నీ డిప్రెష‌న్‌కు సూచ‌న‌లు. ఇలాంటి వ‌న్నీ మ‌న‌సులో ఉంటే ప్రొఫెష‌న‌ల్స్ స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది. కొంద‌రిలో హార్మోన్ల లోఅస‌మ‌తుల్య‌త‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు, ప్రాణాంత‌క జ‌బ్బులు, విడాకులు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ఎక్కువ కాలం ఒంటిరిగా ఉండం వంటివి కూడా డిప్రెష‌న్‌కు కార‌ణ‌మ‌వుతాయి.

శారీర‌క బాధ‌ల‌కంటే మాన‌సిక‌మైన బాధ‌ను అనుభ‌వించ‌డం చాలా క‌ష్టం. నా ప‌న్ను నొప్పి లేస్తోంది అని చెప్పినంత సుల‌భంగా మై హార్ట్ ఈజ్ బ్రోకెన్ అని ఇతరుల‌కు చెప్పుకోలేరు. ఈ డిప్రెష‌న్ వ్య‌క్తుల రోజువారి జీవితాల్లోనే కాదు.. వారి చుట్టూ ఉన్న వారిపైనా ప్ర‌భావం చూపిస్తుంది. కాబ‌ట్టి డిప్రెష‌న్ వ‌చ్చిన‌ప్పుడు దాని తీవ్ర‌త‌ను బ‌ట్టి సైకోథెర‌పీ, యాంటీ డిప్రెసంట్ వంటి చికిత్స‌లు తీసుకోవాలి.

డిప్రెష‌న్ ర‌కాలు

మేజ‌ర్ డిప్రెష‌న్ (Major Depression)- ఇందులో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు తీవ్ర‌స్థాయిలో ఉంటాయి. ఆక‌లిలేక‌పోవ‌డం, నిద్ర‌లేక‌పోవ‌డం, ప‌నిలో శ్ర‌ద్ధ లేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు తీవ్ర‌స్థాయిలో ఉంటాయి.

డిస్థిమిక్ డిజార్డ‌ర్‌(Dysthymic depression)- త‌క్కువ స్థాయి డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు దీర్ఘ‌కాలం ఉంటాయి. అయితే ఈ ల‌క్ష‌ణాలు కొన్నిసార్లు క‌న‌బ‌డ‌కుండా రోగి నార్మ‌ల్‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. అయితే డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు తిరిగి ఉత్ప‌న్నం అవుతూనే ఉంటాయి.

సైకోటిక్ డిప్రెష‌న్ (psychotic depression)- డిప్రెష‌న్ ల‌క్ష‌ణాల‌తో పాటు ఇల్యూజ‌న్‌, హ‌ల్యునిజ‌నేష‌న్ ఉన్న‌ట్ల‌యితే సైకోటిక్ డిప్రెష‌న్ అంటారు.

పోస్ట్ నాట‌ల్ డిప్రెష‌న్ (postnatal depression)- కొంత మంది స్త్రీల‌లో డెలివ‌రీ త‌రువాత హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వ‌ల్ల డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దానిని పోస్ట్‌నాట‌ల్ డిప్రెష‌న్ అంటారు.

సీజ‌న‌ల్ ఎఫెక్టివ్ డిజార్ట‌ర్‌(seasonal effective depression)- సూర్య‌ర‌శ్మి త‌గ్గ‌డం వ‌ల్ల కొంత‌మందిలో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు వ‌స్తాయి.

బైపాలార్ డిజార్డ‌ర్ (bipolar disorder)- డిప్రెష‌న్‌లో కొంత మంది పిచ్చిగా, కోపంగా, విప‌రీత‌మైన ప్ర‌వ‌ర్త‌న‌ను క‌న‌బ‌రుస్తారు. వీరిలో కోపం, ఉద్రేకం తారాస్థాయికి చేర‌డం త‌రువాత నార్మ‌ల్‌కి రావ‌డం జ‌రుగుతుంది.

ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నాయా?

1.రాత్రి నిద్ర‌కు ముందు ఆ రోజు జ‌రిగిన సంతోష‌క‌ర‌మైన సంఘ‌న‌ట‌ల‌కు బ‌దులుగా బాధించిన అంశాల‌ను ప‌దే ప‌దే గుర్తు చేసుకుంటూ ఉంటారు.

2.మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ప్ర‌శంసిస్తే ముక‌స్థుతి కోసం చెప్పిన‌ట్టు భావిస్తారు?

3.ఒక‌ప్పుడు ఇష్టంగా చేసిన ప‌నుల‌న్నింటి మీద క్ర‌మంగా ఆస‌క్తి కోల్పోయారు?

4.ఆక‌లి, నిద్ర క‌రువ‌య్యాయి?

5.మీరు మ‌న‌స్పూర్తిగా న‌వ్వ‌డం మానేసి చాలా కాల‌మైంది?

6.ప్ర‌తి చిన్న విష‌యానికి ఏడుపు త‌న్నుకొస్తుంది?

7.ఉద‌యం నిద్ర లేవ‌గానే హ‌మ్మ‌య్య ఒక రోజు గ‌డిచింది. అని నిట్టూరుస్తున్నారు?

8.ఒంట‌రిగా గ‌డ‌ప‌టానికే ఎక్కువుగా ఇష్ట‌ప‌డుతున్నారు?

9.మ‌తిమ‌రుపు పెరిగింది?

10.జీవితం మీద ఆస‌క్తి కోల్పోయారు?

రిజ‌ల్ట్ :- పై ప్ర‌శ్న‌ల్లో ఎక్కువ ప్ర‌శ్న‌ల‌కు మీ స‌మాధానం అవును అయితే మీరు నిరాశ‌, నిస్పృహ‌ల్లో కూరుకుపోయార‌ని అర్థం. ఆ స్థితి తాత్కాలిక‌మే అయితే ప‌ర్వాలేదు. కానీ ఎక్కువ కాలం కొన‌సాగితే త‌ప్ప‌క మాన‌సిక వైద్యుల్ని సంప్ర‌దించాలి.

Share link

Leave a Comment