dental care: ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెక్-అప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేసే పరీక్షల్లో దంతక్షయం ఏదైనా జరిగిందా, పళ్లు పుచ్చి పోయాయా, పళ్లల్లో రంధ్రాలు ఏవైనా వచ్చాయా? అని దంత వైద్యులు పరిశీలిస్తారు. పళ్లల్లో పడ్డ రంధ్రాల పరిమాణం పెరిగితే రకరకాల ఫిల్లింగ్ మెటీరియల్‌తో వాటిని పూడ్చుతారు.
ఒక వేళ ఈ రంధ్రాలు నరం వరకు చేరితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ అవసరం కావచ్చు. ఆహారంంలో స్వీట్స్, కూల్‌డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఎసిడిక్ ఫుడ్స్ వంటివి పళ్లల్లో చేరి అవి చెడిపోవడానికి కారణమవుతాయి. అంతేకాదు, పంటి ఎనామెల్ దెబ్బతినవచ్చు. తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లు, వాళ్లు తినే పదార్థాలను పర్యవేక్షిస్తూ నియంత్రించడం వల్ల వాళ్ల పళ్లనూ (dental care) పరిరక్షించినట్టవుతుంది. పిల్లలకు స్వీట్స్, చాక్లెట్స్, క్యాండీసి్‌కి బదులుగా ఆపిల్స్, క్యారెట్స్ తినమని చెప్పాలి. ఎప్పటికప్పుడు చిగుళ్ల ఆరోగ్యం బాగుందేమో చూస్తూ, అవసరాన్ని బట్టి క్లీనింగ్, స్కేలింగ్ చేయిస్తూ ఉండాలి.
dental care: చిగుళ్లు నల్లగా ఉంటే?
సాధారణంగా చిగుళ్లు గులాబి రంగులో ఉంటాయి. అయితే ఒక్కోసారి శరీరంలో రంగును ఇచ్చే పిగ్మెంట్‌లో అసమతౌల్యత వల్ల చిగుళ్ల రంగు మారవచ్చు. మన చిగుళ్లు ఏ రంగులో ఉంటాయన్నది జన్యువుల ఆధారంగా నిర్ణయమవుతుంది. అందుకే చిగుళ్ల రంగు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. వివిధ జాతుల వాళ్ల చిగుళ్ల రంగులోనూ కొద్దిగా మార్పులు ఉంటాయి. చిగుళ్ల రంగు మారడానికి ప్రత్యేకంగా ఎలాంటి చికిత్సా అవసరం లేదు.
అయితే ఈ విషయంలో మరీ ఆత్మన్యూనతకు గురవుతుంటే ముదురు రంగు (Dark Colour) ఉండే చిగుళ్ల పై పొరను చిన్న శస్త్ర చికిత్స ద్వారా తొలగించి దాని కింద గులాబీ రంగులో ఉండే పొరను పైకి వచ్చేలా చేయవచ్చు.మీకు అందుబాటో ఉన్న డెంటిస్టును కలిసి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి.
dental care: ఏలకులు బెస్ట్
మనం నిత్యం వాడే మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఏలకులలో మూడు రకాలు ఉన్నాయి. పచ్చ, నలుపు, తెలుపు రంగులలో ఏలకులు లభిస్తాయి. మనం ఎక్కువగా వాడేది మాత్రం పచ్చవే. దంత సమస్యలు, దంతాలకు ఇన్‌ఫెక్షన్లు ఏర్పడినప్పుడు ఏలకుల వైద్యం చక్కగా పని చేస్తుంది. అలాగే ఒబేసిటికీ కూడా ఏలకులు బాగా పనిచేస్తాయి. కడుపులో వికారంగా ఉంటే దానికి విరుగుడుగా అల్లం బాగా పనిచేస్తుంది.


నోటి దుర్వాసన పోవాలంటే?
రెండు కప్పుల నీటిలో కొద్దిగా కొత్తిమీర, రెండు లవంగాలు వేసి మరగించి దించాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని వడగట్టి పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఇలా క్రమం తప్పకుండా చేస్తే నోటి (Mouth) దుర్వాసన తగ్గి మంచి ఫలితం ఉంటుంది. యాలకులు వలిచిన తరువాత పొట్టు డస్టిబిన్‌లో వేయకుండా టీ పొడి డబ్బాలో వేస్తే టీ యాలకుల రుచితో బాగుంటుంది.