Municipal Workers Salary : Hyderabad: పారిశుధ్య, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి నెలకు రూ.21 వేలు జీతం పెంచాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ మరియు ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయం, పురపాలక శాఖ కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓఎస్డి మహేందర్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర కమిషనర్ , డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ సత్యానారాయణ కు, ఏఐటియుసీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. అనంతరం మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బంది పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్షత చూపుతుందని అన్నారు. కరోనా విపత్తులో మున్సిపల్ సిబ్బంది అందరూ పనిచేశారని తెలిపారు. ఒక్క జీహెచ్ఎంసి పారిశుధ్య సిబ్బందికే జీతం రూ.3 వేలు పెంచారని, రాష్ట్ర వ్యాప్తంగా మిగతా మున్సిపల్ సిబ్బందికి జీతం పెంచకపోవడం సమంజసం కాదని అన్నారు.
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు జీతం పెంచకుండా ఉద్యోగ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవడం సరైంది కాదని విమర్శించారు. తెలంగాణలో కొత్తగా పంచాయతీల నుండి అప్ గ్రేడ్ అయిన మున్సిపల్ ఉద్యోగ కార్మికుల అవస్థలు వర్ణనాతీతమని అన్నారు. సిబ్బంది నెలంతా పారిశుద్ధ్య తదితర విభాగాల్లో శక్తి వంచన లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్నారని అన్నారు. వీరికి పని భద్రత లేదని, ఆరోగ్య రక్షణ లేదని అయినప్పికీ అనేక కష్టనష్టాలకు ఓర్చి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నెల చివరి వరకూ జీతం అందక ఆ కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నాయని తెలిపారు.
ఘట్ కేసరి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 60 వేల మంది జనాభా ఉంటే, మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్యపనులు చేయించుకునేందుకు 137 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని అన్నారు. ఉన్న సిబ్బందికి పనిభారం తగ్గించేందుకు సిబ్బంది సంఖ్య పెంచాలని అనేక మార్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా ఫలితం శూన్యమని వెంటనే సిబ్బంది సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య మరియు వివిధ రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో సిబ్బంది నిలువ నీడలేని వారు ఇంటి అద్దెలు కట్టలేక చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ బ్రతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, పురపాలక సంఘాలుగా ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తోందని, ఒక్కసారి తూతూ మంత్రంగా రక్షణ పరికరాలను అందించి చేతులు దులుపుకున్నారని ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు నిర్ణయించి జీతం చెల్లించేలా చర్యలు చేపట్టాలని కరోనా సోకి విశ్రాంతి పొందిన సిబ్బందికి పూర్తి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల పెండింగ్ సమస్యలపై రానున్న రోజుల్లో దశలవారి ఆందోళనలు చేపడతామని హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లురి జయచంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముడి మార్టిన్, ఘట్కేసరి ఏఐటియూసీ యూనియన్ గౌరవ అధ్య క్షులు లొట్టి ఈశ్వర్, నాయకులు శ్రీనివాస్ (చిన్నా), ఎం.రామచందర్, ఎస్.రామ్ కుమార్, టి.బాబు, ఎ.అరుణ్, కె. నర్సింహా, సురేష్, కె.ఆండాలు, అరుణ , సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి:తెలంగాణ కోడలను నేను.. విమర్శకులకు షర్మిలా సమాధానం!
ఇది చదవండి:పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
ఇది చదవండి: కేసీఆర్ ఒక విలన్: భట్టి విక్రమార్క
ఇది చదవండి:తమిళ స్మగ్లర్ అరెస్టు
ఇది చదవండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!
ఇది చదవండి:మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు
ఇది చదవండి:ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను
ఇది చదవండి:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు!