Delivery Boys Inside Story లైఫ్ రన్నింగ్ రేస్‌లా మారింది. ఆకలి తీర్చుకోవడానికి కొందరు..కడుపు నింపుకునేందుకు మరికొందరు ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ల రేస్‌లో పరుగులు పెడుతున్నారు. ఇదే రేస్ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఆన్లైన్ యాప్స్ డెలివరీ బాయ్స్ డెత్స్ ఆందోళన కలిగిస్తోంది. టైమ్ టు టైమ్ డెలవరీ వేటలో ప్రెజరే వారి ప్రాణాలకు పోయేందుకు(Delivery Boys Inside Story) కారణమా?

డెలివరీ బాయ్స్ బాధలు!
టెక్నాలజీ పెరుగుతోంది. లైఫ్‌స్టైల్ మారుతోంది. అంతా ఆన్లైన్ మాయ. ఏది కావాలన్నా, గడప దాటకుండానే ఇంటికొచ్చేస్తున్నాయి. నిత్యావసర వస్తువులు మొదలు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఆన్లైన్ సెక్టార్లో ప్రఖ్యాత కంపెనీలైనా అమోజాన్, ప్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జియోమార్ట్ సంస్థలు మనుషుల అవసరాలను తీరుస్తున్నాయి. అవసరం ఉన్నా ప్రతి వస్తువును వెంటనే డోర్ డెలివరీ చేస్తున్నాయి. వీటికి పోటీగా అనేక స్టార్టప్‌లు వస్తున్నాయి. వీటితో పాటు ప్రాసెసింగ్ ఫుడ్ డెలివరీలో స్విగ్జీ, జొమాటో వంటి అనేక సంస్థలు దూసుకుపోతున్నాయి. లేటెస్ట్గా ఇన్‌స్టా మార్ట్, లెట్స్బ్లింక్ ఇట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కంపెనీలు మార్కెట్లో పాగా వేసేందుకు పోటాపోటీగా ఆఫర్లు, టైమ్ టు టైమ్ డెలివరీతో రేస్ ప్రారంభించాయి.

అంతా ఫ్రీ!
ఒక వేళ 10 నిమిషాల్లో హోం డెలివరీ, టైమ్‌కి డెలివరీ కాకపోతే అంతా ఫ్రీ.. ఫ్రీ అంటూ ప్రకటనలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అనేక కంపెనీలు ఈ – కామర్స్‌లోకి రావడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ బిజినెస్‌లో డెలివరీ బాయిస్ లైఫ్ లో దిన దినగండలా మారుతోంది. ఇన్‌టైమ్‌లో ఫుడ్ డెలివరీ చేస్తే రేంటింగ్లు, అవార్డులు, నాలుగు ఎక్కువ ఆర్డర్లు, కాస్తా డబ్బు ఎక్కువ వస్తుందనే ఆశతో డెలివరీ బాయ్స్‌తో పరుగులు పెట్టిస్తోంది.
శాపంగా మారిన టార్గెట్స్!
డెలివరీ బాయ్స్‌కు టార్గెట్స్ శాంపగా మారాయి. టార్గెట్ రీచ్ అవ్వాలనే హడావుడిలో రాంగ్రూట్లో ప్రయాణించి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆర్డర్ తీసుకున్న దగ్గర నుంచి కస్టమర్‌కు చేరే వరకూ అనేక ఇబ్బందులు పడుతున్నారు డెలివరీ బాయిస్. ఆర్డర్ బుక్ ఐనా తర్వాత ఆ వస్తువు ప్యాక్ చేసేందుకు 3 నిమిషాలు, అక్కడి నుండి గమ్యస్థానానికి వెళ్లేందుకు 5 నిమిషాల నుంచి 7 నిమిషాల సమయం ఉంటుంది. డెలివరీ చేసేందుకు ఎంతో స్పీడ్‌గా బైక్‌లు నడుపుతున్నారు. తాజాగా మియాపూర్ ప్రాంతంలో బైక్‌పై వేగంగా వెళ్తూ మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఓ డెలివరీ బాయ్ రావూరి దుర్గా ప్రసాద్ మృతి చెందాడు.

భారత్‌లోని ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో బడా కార్పొరేట్ కంపెనీలకు తోడు స్టార్టప్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇక స్విగ్గి, జొమాటో మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ ఏడాది చివరి రోజున ఈ రెండు సంస్థలు దాదాపు 20 లక్షలకు పైగా ఫుడ్ డెలివరీలు చేసినట్టు ప్రకటించాయి. ఈ పోటీలో ఉండాలంటే కస్టమర్ కు సమయానికి ఆర్డర్ చేరి శాటిస్పై చేయాలి.
ఆయా సంస్థల నుంచి మెప్పు పొంది, నాలుగు డబ్బులు సంపాదించుకునే క్రమంలో అతివేగంగా ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దేశంలో ప్రతీ 4 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి లక్షన్నరమంది చనిపోతున్నారు. ఇంట్లో వాళ్లకు భారం కాకుండా తన చదువుల కోసం డెలివరీ బాయ్స్‌గా మారుతున్నారు చదువుకునే విద్యార్థులు. ఏదేమైనా కాలంతో పరుగులు పెట్టించి, ప్రాణాలు తీసే పరిస్థితులకు ఆన్లైన్ డెలివరీ సంస్థలు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని కోరుతున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ