delhi pollution ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం పెరగడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని గత కొన్నాళ్లుగా వాతావరణ కాలుష్యం ఏ మాత్రమూ అదుపులోకి రావడం లేదు. ఇటీవల కొన్ని రోజులుగా కాలుషయ స్థాయి ప్రమాదకరస్థాయికి చేరడంతో సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ జనజీవనం సాధ్యం కాని పరిస్థితులు ఉత్పన్నమయ్యయాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు(delhi pollution) తీసుకుంది.
పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాలని పేర్కొంది. ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలకు సూచించింది. అంతేకాదు.. ఈ నెల 14 నుంచి 1 7 వరకు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై నేడు సమీక్ష జరిపారు. లాక్డౌన్ విధించాలన్న సీజేఐ ఎన్వీ రమణ సూచనను పరిశీలిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. కేంద్రంతో చర్చించి లాక్డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!