disha app: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన సంఘటన
disha app మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన disha app సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను, విద్యార్థినులను కాపాడుతోంది. ఇదే క్రమంలో తాజాగా దిశ యాప్ సాయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను పోలీసులు కాపాడారు.
పొరుమామిళ్లకు చెందిన సుభాషిణి అనే యువతి, ఉపాధ్యాయ పరీక్ష రాసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో సదరు యువతితో ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే దిశ యాప్ ఎస్వోఎస్ ద్వారా జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన కడప జిల్లా పోలీసులు సకాలంలో ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆ మహిళను పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఆటో డ్రైవర్ నుంచి కాపాడి కడపకు చేరే వరకు యువతికి పోలీసులు అండగా నిలబడ్డారు.
ఆపదలో ఉన్న సమయంలో తనను క్షేమంగా గమ్యానికి చేర్చిన జిల్లా పోలీసులకు బాధిత యువతి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్పీ అన్భురాజన్ మాట్లాడుతూ దిశ యాప్ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- Jajimogulali Song Lyrics | Rudrangi Movie
- Lut gaya lyrics | Jubin Nautiyal | Emraan Hashmi
- Pasoori Lyrics in English | Hindi
- shiv tandav lyrics in English
- Kesineni Nani: అర్జునుడిని ఇలా చూడటం బాధాకరం!