Dehydration | ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏవో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. కారణం వాతావారణంలో వేడి శరీర ధర్మప్రక్రియల్లో అవరోధానలను సృష్టిస్తోంది. అందుకే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుంటాయి. ఎక్కువ మంది ఎండా కాలంలో వాంతులు, విరేచనాలతో బాధపడు తుంటారు. గంటల వ్యవధిలోనే శరీరంలోని Water కోల్పోయి నీరసపడిపోతారు. చిన్నారుల్లో ఈ సమస్య తలెత్తితే మరింత త్వరగా ఢీలాపడిపోతారు. Dehydration నుంచి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
లక్షణాలు ఇవే!
కడుపునొప్పితో సమస్య ప్రారంభమవుతుంది. గంటలో రెండు, మూడు సార్లు నీళ్ల విరోచనాలు అవుతాయి. కొంతమందిలో శరీరం ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కడుపునొప్పి, విరోచనాలకు తోడు Vomiting కూడా అవుతుంటాయి. ఏమి తిన్నా, నీళ్లు తాగినా వెంటనే వీరోచనం అవుతుంది. దీని వల్ల శరీరంలో లవణాలు, సూక్ష్మపోషకాలు నష్టపోతారు. నోటిలో, నాలుక మీద తేమ తగ్గిపోతుంది. పొడిగా మారుతుంది. నీరసం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు స్పృహ కోల్పోతారు. చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తలు ఇవే!
ఎక్కువగా విరోచనాలు, వాంతులు అవుతున్నప్పుడు Deహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనిని నివారించడానికి ఓరల్ రీ హైడ్రేషన్ సోల్యూషన్ (ఓఆర్ఎస్) ద్రవ్యాన్ని ఎక్కువగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. శరరీం కోల్పోతున్న లవణాలను, సూక్ష్మ పోషకాలను ORS ద్రవం భర్తీ చేస్తుంది. సగ్గు బియ్యం, బార్లీతో చేసిన గంజి, మజ్జిగ, Coconut బొండాం ఎక్కువగా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, రాగి Malt, కిచిడి వంటివి తీసుకోవాలి. వాంతులు, విరేచనాలు అనగానే ముందుగా ఆహారం పెట్టడం ఆపేస్తారు. ఇది సరికాదు. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు ఆహారం ఇవ్వాలి.

ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. మామూలుగా Enda వల్ల వచ్చే విరోచనాలు, వాంతులు, రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. వారం రోజుల్లో తిరిగి మామూలు మనిషి అవుతారు. రెండుమూడ్రోజుల కన్నా ఎక్కువ రోజులు విరోచనాలు, వాంతులతో బాధపడుతుంటే వెంటనే Doctorను సంప్రదించాలి. తాగే నీరు కలుషితం అయితే విరోచనాలు, వాంతులు అవుతాయి. ఎండ వేడిని భరించలేక చాలా మంది తాత్కాలిక ఉపశమనం ఇచ్చే శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుంది. నీళ్ల Virochanalaతో పాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలూ కూడా వస్తాయి.