Dccb Bank ATM

Dccb Bank ATM: ఏటీఎం మిష‌న్ల‌లో న‌గ‌దు అప‌హ‌ర‌ణ లోక‌ల్ వారి ప‌నే!

Andhra Pradesh
Share link

Dccb Bank ATM చిత్తూరు: ఈ నెల 13వ తేదీన చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి ప‌ట్ట‌ణంలోని భార‌త్ పెట్రోల్ బంక్ (bharath petrol bunk)ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డ్ కాల‌నీ వ‌ద్ద డిసిసిబి బ్యాంక్ ఎటిఎం లో చోరీ జ‌రిగింది. సుమారు రూ.4 ల‌క్ష‌ల 95 వేలు అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యాయి. రంగంలోకి దిగిన పోలీసుల టీం విచార‌ణ చేప‌ట్టారు. ద‌గ్గ‌ర‌లో ఉన్న సిసి కెమెరాల‌ను ప‌రిశీలించారు. చోరీ జ‌రిగిన తీరును కూడా ప‌రిశీలించారు. అస‌లే చెడ్డీ గ్యాంగ్ చోరీల‌(cheddi gang)తో ఏపీలో పోలీసుల‌కు నిద్ర ప‌ట్ట‌ని ప‌రిస్థితి రావ‌డంతో ఈ ఏటీఎంలో న‌గ‌దు చోరీని స్థానిక పోలీసులు ఒక స‌వాల్‌గా(Dccb Bank ATM) తీసుకున్నారు.

అయితే ఎట్ట‌కేల‌కు ఏటిఎం మిష‌న్ల‌లో చోరీల‌కు పాల్ప‌డుతున్న బ్యాచ్‌ను అరెస్టు చేశారు. ఆదివారం తిరుప‌తి అర్బ‌న్ జిల్లా ఎస్పీ వెంక‌ట‌ప్ప నాయుడు విలేక‌ర్ల సమావేశంలో చోరీ విష‌యంపై మాట్లాడారు. చోరీ చేసిన దొంగ‌ల‌ది తిరుప‌తిలో వేదాంత‌పురం అగ్ర‌హారానికి చెందిన న‌రేష్ అని గుర్తించారు. ఇత‌ను ఆ డిసిసిబి బ్యాంక్ అధికారిగా ప‌నిచేస్తున్నారు. అయితే అత‌ను, ఆయ‌న స్నేహితులు విలాసాల‌కు బానిస‌కావ‌డంతో ఏటీఎం మిష‌న్ లో న‌గ‌దు చోరీకి(Dccb Bank ATM) పాల్ప‌డ్డార‌న్నారు.

నిందితుల వివ‌రాలు వెల్ల‌డిస్తున్న Tirupati Urban SP Venkatappala Naidu

స్నేహితులైన వినోద్‌, జ‌య సూర్య మ‌రియు వంశీ, ర‌మీజ్ ప‌లు ప్రాంతాల్లో చోరీల‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింద‌ని ఎస్పీ తెలిపారు. వారి వ‌ద్ద నుంచి సుమారు రూ.11 ల‌క్ష‌లు 49,900 వేలు, 4 సెల్ ఫోన్లు, ఒక కారు, బైక్ స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు. ఈ కేసును విచారించి నిందితుల‌ను ప‌ట్టుకున్న స్థానిక సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్ల‌ను ఎస్పీ అభినందించారు.

See also  AP CRIME NEWS:బ‌ల్లి ప‌డిన ఆహారం తిన్న విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త|10 కేజీల బంగారంతో ప‌రార్‌|ఆరు అడుగుల తాచు పాము హ‌ల్‌చ‌ల్!

Leave a Reply

Your email address will not be published.