Dasara Festival 2022: ద‌స‌రా పండుగ‌లో ‘ద‌శ‌హ‌రా’ అంటే ఏమిటి స్టోరీ?

Dasara Festival 2022: శ్లో!జ‌యంతీ మంగ‌ళా కాశీ-భ‌ద్ర‌కాళీ క‌పాలినీ
దుర్గాక్ష‌మా శివ‌ధాత్రీ- స్వాహాస్వ‌ధ‌న‌మోస్త‌తే అంటూ న‌మ‌స్తే శంక‌ర ప్రియే అను మంత్ర‌ముల‌చే జ‌గ‌న్మాత‌ను అవాహ‌నం చేసుకొని జ‌గన్మాత‌ను తొమ్మిది రోజులు పూజించిన త‌ర్వాత దురాగతాల‌ను అరిక‌ట్టి దుష్టులైన అసురుల‌ను నాశ‌నం చేసింద‌ని అమ్మ విజ‌యానికి సంకేతంగా Vijayadashami నాడు విజ‌యోత్స‌వాల‌ను జ‌రుపుకుంటారు. అంద‌రూ దేవుడిని కొలిచే జ‌గ‌ద్గురువు సాయిబాబా ఈ ద‌స‌రానాడే (Dasara Festival 2022) స‌మాధి చెందారు. Saibaba చెప్పిన సూక్తుల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ్తూ సాయికి భ‌క్తులంతా న‌మ‌స్క‌రిస్తారు.

Dasara Festival 2022 | ద‌శ‌హ‌రా అంటే ఏమిటి?

శ్ర‌వ‌ణా న‌క్ష‌త్ర యుక్త ద‌శ‌మి తిథిన ఈ ద‌స‌రా వైభ‌వాలు పూర్తి చేసే ఈ ద‌స‌రాకు మ‌రోపేరు ద‌శ‌హ‌రా. అంటే ప‌ది పాపాల‌ను హ‌రించేది అని అర్థం. మానువుడు క‌లి ప్ర‌భావంతో తెలిసో తెలియ‌కనో పాపాల‌ను చేస్తుంటాడు. సాధార‌ణంగా మానువుడు శారీర‌క పాపాలు మూడు విధాలుగా చేస్తాండ‌టారు. అవి ఇతరుల ద్ర‌వ్యాన్ని వారితో చెప్పుకుండానే తీసుకోవ‌డం, ప‌ర‌స‌తీ స‌మాగ‌మం, ఇత‌రుల‌ను హింసించ‌డం లాంటివి. మాన‌సిక పాపాలు కూడా మూడు ర‌కాలున్నాయి. అవి ప‌ర‌ద్ర‌వ్యం పై అభిలాష క‌లిగి ఉండ‌టం, అంద‌రిక‌న్నా నేనే అధికం అనే అహంకారం పెంచుకోవ‌డం లాంటివి.

ఇక వాచ‌క పాపాల‌నేవి నాలుగు ర‌కాలు. ప‌రుల‌ను నిందించ‌డం, అస‌త్యాల‌ను ప‌ల‌క‌డం, అసంబద్ధంగా మాట్లాడ‌టం, ఇత‌రుల‌ను ప‌రుషంగా మాట్లాడుతూ హింసించ‌డం లాంటివి ఈ ప‌ది ర‌కాల‌ను పాపాల‌ను పొగొట్ట‌డానికి ద‌స‌రా ప‌దిరోజులూ అమ్మవారిని పూజించాల‌ని ఆ అమ్మ ప‌శ్చాత్తాపంతో మ‌నం చేసే పూజ‌ను చూసి ద‌య‌తో అనుగ్ర‌హించి ఈ ద‌శ‌విధ పాపాల‌ను అమ్మ దూరం చేస్తుంద‌ని అంటారు. స‌ర్వ‌లోకాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో ఆజ‌మాయిషి చేసే త‌ల్లిని ప్రార్థిస్తే మానవుని జాత‌కం(Horoscope) లో ఉండే మ‌హ‌ర్ధ‌శ‌లు, దుర్ధ‌శ‌ల‌లోని బాధ క‌లిగించే దుర్ధ‌శ‌ల‌ను క‌లిగించే గ్ర‌హాల‌ను అనుకూలంగా మార్చి మ‌హ‌ర్ధ‌శ‌ల‌ను క‌లుగ జేస్తుంద‌ని అంటారు.

జ‌మ్మి చెట్టుకు ద‌స‌రాకు సంబంధం ఏమిటి?

Dasara Festival 2022 | అస‌లు మాన‌వునిగా జ‌న్మ‌నెత్తిన త‌ర్వాత ఉండే బాల్య‌, కౌమార‌, యౌవ‌న‌, వృద్ధాప్యా ల‌ను అవ‌స్థ‌ల‌ను తొల‌గిస్తుంది. ఎందుకంటే అమ్మ‌ను పూజించిన వారికి ఈ నాలుగు ద‌శ‌లూలేని జ‌న్మ‌రాహిత్యం క‌లుగు జేస్తుంది. క‌నుక అమ్మ వ్ర‌తం క‌నుక ద‌శ‌హ‌రా అని కూడా ద‌స‌రాకు పేరు వ‌చ్చింద‌ ని శాస్త్ర వాఖ్యం. పాండ‌వుల‌కు, రామున‌కు, ర‌ఘుమ‌హారాజుకు విజ‌యాన్నిచ్చిన శ‌మీ వృక్షాన్ని ఈ ద‌శ‌మి నాడు శ‌మీపూజ చేస్తే న‌శిస్తాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. ఒక‌సారి దుర్గాదేవి (Durga Devi) లోహాడ‌నే రాక్ష‌సుడ్డి వ‌ధించ‌గా లోహం పుట్టింద‌ని, అందువ‌ల్ల అగ్నిలో వేస్తే పొగ లేకుండా స‌ర్వ‌లోహాలు శ‌మీ వృక్ష ర‌సంలో భ‌స్మ‌మ‌యిపోతాయ‌ని ర‌సతంత్రాల్లో వివ‌రించ‌బ‌డింది.

శ‌మీ వృక్షం అంటే జ‌మ్మిచెట్టు ఈ చెట్టును వైదిక భాష‌లో ఆర‌ణి అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భ‌వించేందుకు కాష్టాంత‌రంచే మ‌ధింప యోగ్య‌మైన దారువ‌ని ఆర‌ణి అని అర్థం. ఈ శ‌మీ వృక్షాన్ని హిందువులు దేవ‌తా వృక్షంగా పూజిస్తారు.

Share link

Leave a Comment