Darling Movie

Darling Movieకి 11 ఏళ్లు పూర్తి.. ఫొటో షేర్ చేసిన Hero Prabhas

Spread the love

Darling Movieకి 11 ఏళ్లు పూర్తి.. ఫొటో షేర్ చేసిన Hero Prabhas

Darling Movie : ఇండియ‌న్ యాక్ట‌ర్ ప్ర‌భాస్‌, హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన డార్లింగ్ సినిమా వ‌చ్చి శుక్ర‌వారంతో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్‌మీడియాలో డార్లింగ్ సినిమా పోస్ట‌ర్ల‌ను షేర్ చేస్తున్నారు. 2010 సంవ‌త్స‌రంలో ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలో బి.వి.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అప్ప‌టికే త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో ప్ర‌భాస్ ఈ డార్లింగ్ సినిమాతో ల‌వ‌ర్ బాయ్‌గా మారాడు. ఆ సినిమాలో పాట‌ల‌కు ఇప్ప‌టికీ ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద రూ.26 కోట్ల నుంచి సుమారు రూ.30 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టింది. అప్ప‌టికే చ‌త్ర‌ప‌తి సినిమాలో హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ప్ర‌భాస్‌, ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రికొత్త రికార్డు సృష్టించారు.అనంత‌రం డార్లింగ్ సినిమా తీశారు.

ఇక హీరో ప్ర‌భాస్ వ‌రుస విజ‌యాల‌తో ఇండియాలో త‌న కంటూ అగ్ర‌హీరో స్థాయికి ఎదిగారు. మ‌ళ్లీ రాజ‌మౌళితో బాహుబ‌లి సినిమాలో హీరోగా చేసి ప్ర‌పంచ స్థాయిలో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. బాహుబ‌లి-2 సినిమాలు వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతో ప్ర‌భాస్ పై బాలివుడ్ ద‌ర్శ‌కుల క‌న్ను ప‌డింది. అనంత‌రం సాహో సినిమా చేసిన‌ప్ప‌టికీ అది అంత‌గా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు చేర‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ క్రేజ్ ఏమాత్ర‌మూ త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం రాదేశ్యామ్ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది జూలై 30 తేదీన విడుద‌ల కానుంది.

Bangarraju Teaser: చైతు బ‌ర్త‌డే సంద‌ర్భంగా బంగార్రాజు టీస‌ర్‌ విడుద‌ల‌!

Bangarraju Teaser అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న Bangarraju Teaser First Look మంగ‌ళ‌వారం విడుద‌లైంది. అక్కినేని నాగ‌చైత‌న్య Birthday సంద‌ర్భంగా Read more

Akhanda Teaser : బోయ‌పాటి – బాల‌య్య కాంబినేష‌న్‌లో ద‌‌ద్ధ‌రిల్లే డైలాగుల‌‌తో అఖండ

Akhanda Teaser : బోయ‌పాటి - బాల‌య్య కాంబినేష‌న్‌లో ద‌‌ద్ధ‌రిల్లే డైలాగుల‌‌తో అఖండ హీరో బాల‌కృష్ణ Akhanda Teaser ఉగాది సంద‌ర్భంగా విడుద‌లైంది. ఈ సినిమాకు బోయ‌పాటి Read more

ARDHASHATHABDAM Teaser: ద‌డ పుట్టిస్తున్న అర్థ‌శ‌తాబ్ధం టీజ‌ర్ మామూలుగా లేదు!

ARDHASHATHABDAM Teaser: ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ ర‌త్నం హీరోగా న‌టిస్తున్న అర్థశ‌తాబ్ధం సినిమా టీజ‌ర్(ARDHASHATHABDAM Teaser) విడుద‌లైంది. ఈ సినిమా పూర్తిగా రాజ‌కీయం, ఫ్యాక్ష‌నిజం తో Read more

Drusyam2 Launch : విక్ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాబోతున్న దృశ్యం 2 | Drusyam2

Drusyam2 Launch :Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది.:Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో విక్ట‌రీ వెంక‌టేష్ Read more

Leave a Comment

Your email address will not be published.