Dark Chocolate | లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాల్లో చాక్లెట్ను కూడా ఒకటిగా చెబుతుంటారు వైద్య నిపుణులు. ఏంటటా దాంట్లో ప్రత్యేకత? అంటే…ఉంది. చాక్లెట్లలో ఉండే అమైనో ఆమ్లాలు అడ్రినలిన్ (adrenaline), డోపమైన్ (dopamine) రసాయనాలు విడుదలకు కారణమవుతాయి. అడ్రినలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తే, డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్. ఇక వాటిలో ఉంటే కొన్ని రసాయనాలు పురుషాంగంలోని రక్త నాళాల్లో ఉండే ఎండోథిలియం పనితీరును మెరుగుపరుస్తాయి. రక్త నాళాలను వ్యాకోచింపజేసే రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి ఇదే(ఎండోధీలియం) కీలకం.
గ్రీస్, స్విట్జర్లాండ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలిందీ ఈ విషయం. కానీ ఈ లాభాలన్నీ డార్క్ చాక్లెట్(Dark Chocolate) తింటే మాత్రమే పొందగలమంటున్నారు వారు. 70 నుంచి 90 శాతం కోకోవా ఉంటేనే అది డార్క్ చాక్లెట్. అంతకన్నా తక్కువ ఉండే వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలుండవట.
Illegal relationships:నడి వయసులో తీనెటీగ అంతే మరి!
వయసులో ఉన్న మగవారితో పోలిస్తే, మధ్య వయసు పురుషులే ఎక్కువుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని ఓ అధ్యయనం. అనేక రకాల శారీరక, మానసిక కారణాలు ఇందుకు దోహదం చేస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వారి విశ్లేషించిన దాని ప్రకారం..సాధారణంగా పురుషులు రెండు పదుల వయసులో ఉన్నప్పుడు జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలూ బాధ్యతలూ చాలా ఉంటాయి. ఆ వయసులో లైంగిక ఉత్తేజం అధికంగా ఉన్నప్పటికీ, కెరీర్ పైనే ఎక్కువుగా దృష్టి కేంద్రీకరిస్తారు.

అదే నాలుగు పదుల వయసు వచ్చేసరికి జీవితంలో బాగానే స్థిరపడి ఉంటారు. ఒడుదొడుకులూ కష్టాలూ వచ్చినా అప్పటి దాకా సంపాదించుకున్న అనుభవంతో వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా వస్తుంది. డబ్బు ఇచ్చే సుఖాలను అప్పటికే అనుభవించి ఉండటం వల్ల కొత్త సుఖాల కోసం అన్వేషణ మొదలు పెడతారట. అదండీ సంగతి. మీ శ్రీవారు నలభైలో పడ్డారా.. అయితే ఆయన గారి మీద ఓ కన్నేసి ఉంచండి మరి!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!