Local panchayat elections : టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
Visakapatnam: విశాఖపట్టణం జిల్లా గూడెం కొత్తవీధి మండలం ధారకొండ గ్రామస్థులు కొత్తగా ఆలోచించారు. తమ గోడు పట్టించుకోని అధికారులు ఎన్నికల వేళయినా మాట వింటారేమోనని భావించారు. ఊరిలోని ప్రాథమికోన్నత పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులంతా కలిసి పిల్లలతో పాఠశాల ఆవరణంలోనే ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. పాఠశాలలో 180 మంది విద్యార్థలున్నారన్నారు. ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురే ఉన్నారని, వారిలో ఒకరు సెలవులో ఉంటే, మరొకరు విధులకు హాజరు కావడం లేదని వాపోయారు. మిగిలిన ఒక్క టీచర్ అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో రెండేళ్ల క్రితం వరకు 9 మంది టీచర్లు ఉండేవారని, వారిలో ఆరుగురు రాజకీయ సిఫారుసులతో డిప్యూటేషన్ వేయించుకుని వెళ్లిపోయారని చెప్పారు. అధికారులు స్పందించి తక్షణమే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని, లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికల్లో జనసేనాకు టిడిపి మద్దతు!
ఇది చదవండి: ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఇది చదవండి:గుంటూరు జిల్లా కలెక్టర్గా Vivek Yadav బాధ్యతలు స్వీకరణ
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక
ఇది చదవండి:యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను భర్తీ చేయాండి: గవర్నర్
ఇది చదవండి:తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
ఇది చదవండి:నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి