Core Web Vitals Assessment: Dangerous Journey: అంత్య ప్ర‌మాద‌క‌ర‌మైన Congoలో ట్రైన్ ప్ర‌యాణం...ప్

Dangerous Journey: అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర‌మైన Congoలో ట్రైన్ ప్ర‌యాణం…ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకోని ప్ర‌యాణించాల్సిందే!

Dangerous Journey: ఆఫ్రికా ఖండంలో కాంగో(Congo) దేశంలో ప్ర‌జ‌లు రైల్వే ప్ర‌యాణం చేయాలంటే క‌త్తిమీద సాముతో కూడుకున్న ద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే మ‌న‌లాగా విశాల మైన ఏసీ బోగీలు, కూర్చోవ‌డానికి కూర్చీలు, ప‌డుకోవ‌డానికి స్లీప‌ర్ బెడ్లు వారికి ఉండ‌వు. సాధార‌ణంగా రైల్వే ప్ర‌యాణం ప్ర‌తి రోజూ చేసే వారైతే మ‌హా అయితే 100 కిలోమీట‌ర్ల లోపు ప్ర‌యాణిస్తుంటారు. కానీ కాంగోలో మాత్రం రైలు ప్ర‌యాణం చేయాలంటే రోజుల త‌ర‌బ‌డి రైల్వో ఉండాల్సిందే.

కాంగో లో Swallow train అనే ఒక సాధార‌ణ రైలు ఒక‌టి ఉంది. అది దేశంలోని ప‌లు గ్రామీణ ప్రాంతాల‌ను తాకుతూ వెళుతుంది. ఉద‌యాన్నే ఈ స్వెల్లో ట్రైన్ త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తుంది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే వారు, ఇళ్ల‌కు వెళ్లే వారు త‌మ‌కు కావాల్సిన నిత్య‌వ‌స‌ర స‌రుకులు కొనుక్కొని ఈ ట్రైన్ ఎక్కుతారు. ఈ ట్రైన్‌కు సుమారు 10 నుంచి 15 బోగీలు ఉంటాయి. ఏ ఒక్క బోగీ కూడా విశాల‌వంతంగా ఉండ‌దు. త‌ట్ట‌లు, బుట్ట‌లు, కోళ్లు, సంచ‌లు తో స‌హా చిన్న చిత‌క‌, పెద్ద అంతా కూడా ఆ బోగీల్లోనే క‌లిసిమెలిసి ప్ర‌యాణం చేస్తుంటారు.

మ‌హిళ‌లు ఈ ట్రైన్‌లో పిల్ల‌ల‌తో క‌లిసి ఎక్కి ఎక్క‌డో ఒక చోట త‌లదాచుకుంటారు. ఇసుక వేస్తే రాల‌నంత ఖాళీ ఏమాత్ర‌మూ ఈ ట్రైన్‌లో ఉండ‌దు. ఇక యువ‌కులు, మ‌గ‌వారు రైలు బోగీల పైకి ఎక్కి కూర్చొని ప్ర‌యాణం చేస్తుంటారు. ఈ ట్రైన్ ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల‌ను క‌లుపుకొని ప్ర‌యాణం కొన‌సాగిస్తుంది. కొన్ని కొన్ని సార్లు ప్ర‌యాణించే రైలు బోగీల‌పైన ఆ యువ‌కులు ప‌రుగులు తీయ‌డం చూస్తే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది.

కొన్ని కొన్ని సార్లు మ‌నం రోడ్డు మీద బ‌స్సు ఆప‌క‌పోతే అద్దాలు ప‌గ‌ల‌గొట్టిన‌ట్టు ఆ దేశంలో కొన్ని ప‌ల్లెటూర్ల‌లో ట్రైన్ ఆప‌క‌పోతే రాళ్ల‌తో, క‌ర్ర‌ల‌తో అద్దాలు ప‌గ‌ల‌గొడ‌తార‌ని ఆ ట్రైన్ డ్రైవ‌ర్ చెబుతున్నాడు. రైలు ఎక్కిన త‌ర్వాత గ‌ర్భిణీ స్త్రీలు, వృద్ధులు , యువ‌కులు అనేది తేడా ఉండ‌వు. ఎవ‌రి ఇబ్బంది వారు ప‌డాల్సిందే. మ‌న దేశంలో ట్రైన్‌ల‌లో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు క‌నీసం టాయిలెట్ వ‌చ్చినా వాడుకునే స‌దుపాయ‌లు ఉన్నాయి. కానీ అక్క‌డ ఉండే ఒక‌టీ, రెండు ట్రైన్‌ల‌లో అసౌక‌ర్యాలు ఉండ‌వు. మ‌న ట్రైన్‌ల‌లో లాగా ఆక‌లివేసిన‌ప్పుడు తినుబండారాలు అమ్మేవారు ఉన్న‌ట్టు ఆ ట్రైన్‌ల‌లో ఉండ‌రు. ఆక‌లితో అలా ప్ర‌యాణం చేయాల్సిందే. క‌నీసం తాగ‌డానికి నీళ్ళ సౌక‌ర్యం కూడా ఉండ‌దు.

అక్క‌డ ఉండే ఒక‌టి రెండు ట్రైన్లు కూడా కొత్త‌గా ఉండ‌వు. ఎన్నో ఏళ్ల త‌ర‌బ‌డి న‌డుపుతూ ఉన్న ట్రైన్ల‌నే ఇప్ప‌టికీ వినియోగిస్తున్నారు. కొన్ని సార్లు ఆ ట్రైన్లు ప్ర‌యాణం మ‌ధ్య‌లో అక్క‌డ‌క్క‌డా అడ‌వుల్లో గంట‌ల కొద్ది చెడిపోయి ఆగిపోతుంటాయి. ఇంజ‌న్‌లో ఉన్న డ్రైవ‌ర్‌తో పాటు ఒక‌రు, ఇద్ద‌రు ట్రైన్ సిబ్బంది మ‌ర‌మ్మ‌తులు చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఆ ట్రైన్ క‌దులుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌యాణం చేసేవారంతా ట్రైన్ తిగి చెట్ల కింద‌, ట్రాకులు మీద కూర్చొని, నిల్చొని ప‌డిగాపులు కాయాల్సిందే. ట్రైన్ వెళ్లే ట్రాక్ కూడా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది. ఎక్క‌డ ట్రైన్ బోల్తా ప‌డుతుందో, ఎక్క‌డ నెమ్మ‌దిగా వెళ్లాల్లో ఆ ట్రైన్ న‌డిపే అనుభ‌వం ఉన్న డ్రైవ‌రే తెలుసు. ట్రైన్‌ను మ‌ర‌మ్మ‌తులు చేసే స్టేష‌న్ వ‌ద్ద కూడా ఎలాంటి కొత్త ప‌రిక‌రాలు ఉండ‌వు. వాడిన వాటినే వాడుతూ ట్రైన్‌కు మ‌ర‌మ్మ‌తులు చేసి న‌డుపుతుంటారు.

అక్క‌డ ప్ర‌జ‌లు ఉన్న ఒక‌టి, రెండు ట్రైన్ల‌లో అతిక‌ష్టంగా ఎందుకు ప్ర‌యాణం చేస్తారంటే.. అక్క‌డ వాహ‌నాలు వెళ్లేందుకు స‌రైన రోడ్డు వ్య‌వ‌స్థ లేదు. కొండ‌లు, గుట్ట‌లు మ‌ధ్య కొన్ని ట్ర‌క్కులు ప్ర‌యాణం చేస్తుంటాయి. అవి కూడా కొన్ని వంద‌ల మైళ్ల దూరం ప్ర‌యాణం చేస్తుంటాయి. వాటిలో ప్ర‌యాణించే వారు కూడా ఉన్నారు. ఆ వాహ‌నాలు పెద్ద పెద్ద గుంత‌లు దాటుకొని ప్రమాద‌ర‌క‌మైన ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *