dandruff remove tips

dandruff remove tips: చుండ్రు త‌గ్గాలంటే ఏం చేయాలి?

Health Tips
Share link

dandruff remove tips ఎంత ఒత్తుజుట్టు ఉన్నా, త‌ల‌లో చుండ్రు చేరితే కురులు వెల‌వెల‌బోతాయి. న‌లుగురిలో న‌గుబాటు చేసే చుంట్రు స‌మ‌స్య‌ను చిన్న చిన్న చిట్కాల‌తో దూరం చేసుకోవ‌చ్చు. వారంలో క‌నీసం రెండుసార్లైనా కుంకుడు కాయ ర‌సంతో త‌ల‌స్నానం చేయాలి. ఉసిరి, కుంకుడుకాయ‌, శీకాకాయ పొడుల‌ను స‌మ‌పాళ్ల‌ల్లో క‌లిపి, రెండు లీట‌ర్ల నీటిలో ఉడ‌క‌బెట్టాలి. మిశ్ర‌మం ద‌గ్గ‌రికి వ‌చ్చాక షాంపుగా వాడితే మంచి ఫ‌లితం ఉంటుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మ‌రసం క‌లిపి కుదుళ్ల‌కు బాగా ప‌ట్టేలా మ‌ర్థ‌న చేసుకోవాలి. గంట త‌ర్వాత త‌లస్నానం చేస్తే, చుండ్రు స‌మ‌స్య కొంత(dandruff remove tips) తీరుతుంది.

గ‌స‌గ‌సాల‌ను మెత్త‌గా పేస్ట్‌లా చేసుకుని, త‌లకు ప‌ట్టించి గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది. క‌ప్పు వేడిన‌టిలో నిమ్మ‌కాయ ర‌సం క‌లిపి త‌ల‌కు ప‌ట్టించి కాసేపాగి త‌ల‌స్నానం చేస్తే మంచి గుణం ఉంటుంది. మందారాకుల‌ను వేడినూనెలో క‌లిపి త‌ల‌కు రాసుకోవాలి. త‌రుచూ ఇలా చేస్తే చుండ్రు స‌మ‌స్య తీరుతుంది. కుదుళ్ళు బ‌లంగా అవుతాయి.

పారిజాతం గింజ‌ల‌ను మెత్త‌గా నూరి దాన్ని నూనెలో క‌లిపి త‌ల‌కు ప‌ట్టించి, గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. పుదీనా ఆకుల‌ను మెత్త‌గా రుబ్బి, కాస్త నీళ్లు క‌లిపి మాడుకు ప‌ట్టించాలి. గంట‌న్న‌ర త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే చుండ్రు త‌గ్గుతుంది. గుడ్డు తెల‌సొన‌ను జుట్టుకు ప‌ట్టించి, గంట త‌ర్వాత స్నానం చేయాలి. ఇలాంటి స‌హ‌జ చిట్కాలు పాటిస్తే చుండ్రు స‌మ‌స్య ఉండ‌దు.

(dandruff remove tips)మ‌రికొన్ని చిట్కాలు!

గోరు వెచ్చ‌ని కొబ్బ‌రినూనె త‌రుచూ మాడుకు రాస్తూ ఉండాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు అదుపులో ఉంటుంది. మెంతుల్లో అమినో ఆమ్లాలు, ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చుండ్రు రాకుండా అడ్డుకుంటాయి. రెండు చెంచాల మెంతుల్ని క‌ప్పు నీళ్ల‌లో రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే వాటిని మెత్త‌గా చేసి మాడుకు ప‌ట్టించి అర‌గంట త‌ర్వాత గాఢ‌త త‌క్కువున్న షాంపూతో క‌డిగేయాలి. దీని వ‌ల్ల జుట్టు మెరుస్తుంది.

వేపాకులో ఫంగ‌స్‌ను పార‌దోలే గుణాలున్నాయి. దీంతో చుండ్రు, దాని తాలుకు దుర‌ద మాయ‌మ‌వు తుంది. త‌గిన‌న్ని వేపాకుల‌ను నాలుగైదు కప్పుల వేడినీళ్ల‌లో వేయాలి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే ఆ నీళ్ల‌లో జుట్టును క‌డిగేయాలి. వేపాకుల ముద్ద‌ని మాడుకు ప‌ట్టించి గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేసినా ఫ‌లితం క‌నిపిస్తుంది.

నిమ్మ‌ర‌సంలో ఉండే ఆమ్లాలు చుండ్రు స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. ఒక నిమ్మ‌కాయ ర‌సాన్ని క‌ప్పునీళ్ల‌లో వేసి ఆ మిశ్ర‌మంలో జుట్టు క‌డిగేయాలి. ఇలా త‌రుచూ చేస్తుంటే చుండ్రు అదుపులోఉంటుంది. చెంచా టీ ట్రీ నూనెను క‌ప్పు వేడినీళ్ల‌లో క‌ల‌పాలి. త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత ఈ నీళ్ల‌ను త‌ల‌మీద దార‌లా పోసి మ‌ర్థ‌నా చేసి రెండు నిమిషాల త‌ర్వాత క‌డిగేస్తే స‌రిపోతుంది. క‌ల‌బంద గుజ్జును మాడు, జుట్టుకి ప‌ట్టించి పావుగంట త‌ర్వాత షాంపూతో క‌డిగేసినా ఫ‌లితం ఉంటుంది.

See also  What are the benefits of Oiling hair?

Leave a Reply

Your email address will not be published.