dandruff remedies: చుండ్రు చిక్కుల‌కు చెక్ ఇలా!

dandruff remedies: ఈ కాలంలో చుండ్రు స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది. తెల్ల‌గా పొట్టు మాదిరి రాలి పోతుంటుంది. మ‌రి ఈ స‌మ‌స్య‌ను వ‌దిలేయ‌కుండా, ఇంట్లో దొరికే ప‌దార్థాల‌తోనే ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.

dandruff remedies: చుండ్రు చిక్కుల‌కు చెక్ ఇలా!

వెనిగ‌ర్– మూడు క‌ప్పుల నీళ్ల‌లో క‌ప్పు వెనిగ‌ర్ క‌ల‌పాలి. త‌ల మీద మెల్ల‌గా మ‌ర్ద‌న చేసుకుంటూ ఆ నీళ్ల‌ను పోసుకోవాలి. ప‌దిహేను నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే స‌రిపోతుంది. ఇలా వారానికోసారి చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

ఆముదం– దీనిలో యాంటీఫంగ‌ల్ గుణాలు ఎక్కువ‌. ఆముదంతో మ‌ర్ద‌న చేయ‌డం వ‌ల్ల ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దూర‌మ‌వుతాయి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణా మెరుగ‌వుతుంది. గంట‌య్యాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌రచూ చేస్తేంటే చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది.

పెరుగూ, తేనె– ఓ నిమ్మ‌కాయ తీసుకుని దానిని క‌ప్పు పెరుగులో పిండాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి జుట్టుకు పూత‌లా వేయాలి. గంట‌య్యాక గాఢ‌త త‌క్కువ ఉన్న షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. దీనివ‌ల్ల యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు అంద‌డంతోపాటూ జుట్టు జిడ్డుగా మార‌కుండా ఉంటుంది. చుండ్రు స‌మ‌స్య కూడా అదుపులోకి వ‌స్తుంది.

వేప‌– ఈ ఆకుల్లో యాంటీ ఫంగ‌ల్ గుణాలు అందండంతో పాటూ జుట్టు జిడ్డుగా మార‌కుండా ఉంటుంది. చుండ్రు స‌మ‌స్య కూడా అదుపులోకి వ‌స్తుంది.

నిమ్మ‌ర‌సం– ఒక నిమ్మ చెక్క‌తో మాడుకు మ‌ర్ద‌న చేయాలి. ఇర‌వై నిమిషాల‌య్యాక క‌డిగేసుకోవాలి. నిమ్మ‌ర‌సం ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు దూరం చేసి ఆ స‌మస్య‌ను అదుపు చేస్తుంది. త‌ల‌లో పుండ్లు, గాయాల వంటివి ఉన్న‌ప్పుడు నిమ్మ‌కాయ జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది. ఇలా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, చుండ్రు త‌గ్గ‌క‌పోతే నిపుణుల‌ను సంప్ర‌దించాలి.

గ‌స‌గ‌సాలు– వంటింటిలో ఉన్న గ‌స‌గ‌సాల‌ను కొద్దిగా తీసుకుని, వాటికి పాలు చేరుస్తూ నూరుకోవాలి. త‌ర్వాత దానిని త‌ల‌కు బాగా ప‌ట్టించి, ఆరిన త‌ర్వాత త‌లంటు స్నానం చేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేశారంటే మూడు వారాల్లో చుండ్రు స‌మ‌స్య పూర్తిగా స‌మ‌సిపోతుంది.

చుండ్రు త‌గ్గాలంటే!

dandruff remedies: కొంత మంది మ‌హిళ‌ల‌ను చుండ్రు స‌మ‌స్య విప‌రీతంగా వేదిస్తుంటుంది. ఈ చుండ్రు వ‌ల్ల అనేక మంది స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. వారంలో క‌నీసం రెండు సార్లైనా త‌ల‌మ్మ‌టా కుంకుడుకాయ‌తో గానీ, సీతాకాయ‌తో గానీ స్నానం చెయ్యాలి. గ‌స‌గ‌ స‌లాను మెత్త‌గా పేస్టులా చేసుకుని త‌ల‌కు ప‌ట్టింటి ఒక గంట త‌ర్వాత గోరు వెచ్చ‌టి నీటితో స్నానం చెయ్యాలి.

ఒక క‌ప్పు వేడి నీటిలో నిమ్మ‌కాయ రసం పిండి త‌ల‌కు ప‌ట్టించి త‌ల‌స్నానం చెయ్యాలి. కొబ్బ‌రి నూనెలో క‌ర్పూరం క‌లుపుకుని కురుల‌కు ప‌ట్టించి అర‌గంట ఆగిన త‌ర్వాత స్నానం చేస్తే ఫ‌లితం ఉంటుంది. మందార ఆకుల‌ను వేడి నూనెలో క‌లిపి త‌ల‌కు రాసుకోవాలి. ఒక క‌ప్పులో కోడిగుడ్డు సొన‌వేసి దీనిలో ఒక‌టికి టేబుల్ స్పూన్‌లు షాంపూ వేసి క‌లిపి దీనితో త‌ల‌స్నానం చేయ్యాలి.

కొబ్బ‌రి నీళ్ల‌లో రెండు చుక్క‌లు నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే చుండ్రు నుండి ఉప‌స‌మ‌నం పొంద‌వ‌చ్చు. పారిజాతం గింజ‌ల్ని మెత్త‌గా నూరి పొడిచేసి దీన్ని నూనెలో క‌లిపి త‌ల‌కు ప‌ట్టింటి స్నానం చేస్తే ఫ‌లితం ఉంటుంది. త‌ల‌స్నానం చేసే ముందు కురుల‌కు పెరుగు ప‌ట్టింటి అర‌గంట త‌రువాత స్నానం చేస్తే చుండ్రు త‌గ్గుతుంది. జుట్టుకు హెర్బ‌ల్ ఆయిల్ మ‌సాజ్ చేసుకోవ‌డం వ‌ల్ల చుండ్రు(dandruff remedies)ను నివారించ‌వ‌చ్చు.

Share link

Leave a Comment