Dandruff Home Remedies | చుండ్రు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆ సమస్యే కొందరిని తీవ్రంగా వేధిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలదు. అలాంటప్పుడు ఇలా చేసే(Dandruff Home Remedies) చూడండి. మూడు రోజులకొకసారి Shampooతో స్నానం చేయాలి. అయితే ఏ షాంపూ సరిపోతుందో ముందుగా తెలుసుకొని ఉపయోగించాలి. ఇంట్లో ఒకే దువ్వెనను అందరూ వాడుతుంటారు. అలా కాకుండా చుండ్రు ఉన్నవారు సెపరేట్‌గా దువ్వెన ఉపయోగించాలి.
Dandruff Home Remedies
తగినంత సమయం నిద్రపోకపోయినా Dandruff సమస్య వేధిస్తుంటుంది. ఒత్తిడి ఎక్కువుగా ఉండటం కూడా కారణమే. కాబట్టి సమయానికి నిద్ర పోవాలి. రోజు అరగంట ధ్యానం, యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. చుండ్రును పోగొట్టడానికి Tulasi ఆకులు బాగా పనిచేస్తాయి. తులసి ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి, కొద్దిగీ నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టించాలి. మాడుకు పట్టేలా మర్ధన చేయాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య పోవడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య దూరమవుతుంది.
Dandruff Home Remedies: జుట్టు ఒత్తుగా కనిపించాలంటే!
జుట్టు నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు అరకప్పు పుల్లటి పెరుగూ, చెంచా తేనె కలిపి జుట్టుకి పట్టించాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని చన్నీళ్లతో షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతుంది. ఆరోగ్యంగా ఎదుగుతుంది.
ఎండ, ఇతరత్రా కారణాలతో జుట్టు చిట్లినప్పుడూ బాగా పాడైనప్పుడూ రెండు కప్పుల తాజా నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఇరువై నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే సమస్య దూరమవుతుంది. లేదంటే అరకప్పు Honeyను శుభ్రమైన తడి జుట్టుకు రాసుకుని ఇరువై నిమిషాలు ఆరనివ్వాలి. గోరువెచ్చని నీటితో శుభ్రపరు చుకోవాలి. అవసరాన్ని బట్టి దీనికి ఒక టేబుల్ స్పూన్ Olive Oilను కలపుకోవచ్చు. ఈ మిశ్రమం అతినీలలోహిత కిరణాల నుంచి జుట్టుని కాపాడుతుంది.

కలబంద రసానికి, చెంచా తేనె, చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకి, మాడుకీ కావాల్సిన తేమ అందుతుంది.