dampudu biyyam benefitsమన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తినే ఆహారం అన్నం. ఎందుకంటే మన ప్రాంతాల్లో ఎక్కువుగా వరి పండిస్తారు కాబట్టి వెనుకటి రోజుల నుండి అన్నమే మన ప్రధాన ఆహారంగా వాడుతున్నాం. కానీ, మన తాతలు, నాన్నలు ఉన్నంత బలంగా మాత్రం మనం ఉండటం లేదు. దానికి కారణం మనం తీసుకునే ఆహారం, వారు వెనుకటి రోజుల్లో వడ్లని దంచి బియ్యాన్ని వండుకునే వారు. అలాగే బియ్యం నుండి వచ్చే గంజి కూడా తాగేవారు. ఎందుకంటే బియ్యం నుంచి వచ్చే పోషకాలు గంజిలో ఉంటాయి కాబట్టి. అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా రసాయన ఎరువులతో పంటలు పండిస్తుంటే తినేవారికి కొత్త రోగాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా బియ్యం విషయంలో మాత్రం చాలా మంది దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) కోసం చూస్తున్నారు. ఈ బియ్యం గోధుమ రంగులో ఉంటుంది. ఈ బియ్యం ఎందుకు మంచిదో(dampudu biyyam benefits) చూద్ధాం.


పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణ వ్యవస్థకు బ్రౌన్ రైస్(brown rice) ఎంతో ప్రయోజనకారి. ఇది ప్రేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ బియ్యంలో ఉండే పైటోన్యూట్రిఎంట్ లిగ్నాస్ రొమ్ము క్యాన్స్, గుండె జబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. వయసు మళ్లిన మహిళలపై జరిగిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వల్ల ఎంటారోలాక్టోన్ స్థాయిని పెంచుతుందని తెలుస్తుంది.
బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్డిఎల్ కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గోధుమ రంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణ వాహికలో క్యాన్స్ర్ కారక రసాయనాలను బయటకు పంపుతుంది.
శరీర బరువును సాధారణంగా ఉంచుతుంది. బ్రౌన్ రైస్‌లో పీచు సమృద్ధిగా ఉన్నందున మీరు అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమే కాక ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్టుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువుగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనాల్లో పీచు ఎక్కువుగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు దాదాపుగా సాధారణంగా ఉంటుంది. ఒక కప్పు బ్రౌన్ రైసలో దాదాపు 21% మెగ్నిషియం దొరుకుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, వేరొక అత్యవసర పోషకం కాల్షియం గ్రహించడానికి కూడా అవసరం.


టెంపుల్ విశ్వ విద్యాలయంలోని పరిశోధకులు బ్రౌన్ రైస్ తింటే రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనుల్లో ఫలకం చేరే స్థాయి తగ్గి, గుండె జబ్బులు వృద్ధి చెందకుండా కాపాడవచ్చని కనుగొన్నారు. అనేక అధ్యయనాల్లో తేలిందేమిటంటే బ్రౌన్ రైస్‌లోని మేగ్నిషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్‌లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!