lockup death : మ‌హిళ లాకప్‌డెత్ ఘ‌ట‌న‌పై ద‌ళిత సంఘాల ఆగ్ర‌హం!

lockup death : ద‌ళిత మ‌హిళ మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్, కుమారుడిపైన చిత్ర‌హింస‌ల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ జ‌రిపించాల‌ని, బాధిత కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని హ‌త్య‌కు పాల్ప‌డిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, హ‌త్యానేరం కింద కేసులు న‌మోదు చేయాల‌ని కెవిపిఎస్‌,బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశాయి.


lockup death: ఖ‌మ్మం జిల్లా చింత‌కాని మండ‌లం కోమ‌ట్ల‌గూడెం గ్రామానికి చెందిన ద‌ళిత కుటుంబ‌పైన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అడ్డ‌గూడూరు పోలీస్ స్టేష‌న్ లో చోరీ కేసు మోప‌బ‌డింద‌ని కెవిపిఎస్ ఖ‌మ్మం జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నందిపాటి మ‌నోహ‌ర్ పేర్కొన్నారు. అంబ‌డిపూడి మ‌రియ‌మ్మ అనే ద‌ళిత మ‌హిళ పోలీస్ స్టేష‌న్‌లో లాక‌ప్ డెత్‌కు గురైన ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే విచార‌ణ జ‌రిపించాల‌ని, సంబంధిత బాధ్యుల‌పైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కేసుతో పాటు హ‌త్యానేరం కేసుల‌ను న‌మోదు చేయాల‌ని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌న్నారు. అతికిరా త‌కంగా దాడికి గురైన బాధితుడు ఉద‌య్‌కిర‌ణ్ కు మెరుగైన వైద్యం అందించాల‌ని నందిపాటి మ‌నోహ‌ర్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుడైన ఉద‌య్‌కిర‌ణ్‌ను కెవిపిఎస్ జిల్లా బృందంతో క‌లిసి వెళ్ళి ఆయ‌న ప‌రామ‌ర్శించారు.

ద‌ళితుల‌పై అనునిత్యం దాడులు!

తెలంగాణ రాష్ట్రంలో అనునిత్యం దళితుల‌పై దాడులు, హ‌త్య‌లు, వెలివేత‌లు, అణిచివేత‌ల‌కు గుర‌వ్వ‌డం అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ విలువల‌కు తూట్లు పొడుస్తూ చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, అధికారులే ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌టం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల దురంహంకార హ‌త్య‌లు పెచ్చురిల్లినా ప్ర‌భుత్వం ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం స్పందించి మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్‌కు పాల్ప‌డిన‌, ఆమె కుమారుడైన ఉద‌య్ మ‌ర్మాంగ అవ‌యవాల‌పైన అతికిరాత‌కంగా దాడికి పాల్ప‌డిన పోలీసుల‌పైన త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , బాధిత కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కెవిపిఎస్ ప‌ట్ట‌ణ నాయ‌కులు గ‌ద్ద‌ల వీర‌బాబు, గ‌ద్ద‌ల అనిల్‌, పి.స‌త్య‌నారాయ‌ణ‌. ఎన్‌.కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి : బ‌హుజ‌న్ స‌మాజ్

ద‌ళిత మ‌హిళ మ‌రియ‌మ్మ హ‌త్య‌పై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో న్యాయ విచార‌ణ జ‌రిపించాల‌ని, వారి కుటుంబానికి ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ జిల్లా ఉపాధ్య‌క్షులు చెరుకుప‌ల్లి నాగేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు. పోలీసు వారు సిఆర్‌పిసి 41(ఏ) నోటీసులు ఇవ్వ‌కుండా ద‌ళిత స‌మాజాన్ని పోలీసు వారు పోలీస్ స్టేష‌న్ ను పిలిపించి మాన‌సికంగా, శారీర‌కంగా హింస‌కు గురిచేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌ళిత స‌మాజాన్ని లాక్ అప్ డెత్ చేస్తున్నార‌ని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా న‌డ‌వాల్సిన పోలీస్ వ్య‌వ‌స్థ రాజ్యాంగ వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంద‌ని అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌లో ద‌ళితుల‌కు అన్యాయం జరుగుతోంద‌ని, టిఆర్ఎస్ ప్ర‌భుత్వం పోలీస్ శాఖ వారికి అండ‌దండ‌లుగా ఉండ‌టం స‌రైంద‌ని కాద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఎస్పీ పార్టీ మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ మిర్యాల నాగ‌రాజు, బీఎస్సీ రూర‌ల్ నాయ‌కులు ల‌క్ష్మ‌ణ్ పాల్గొన్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *