డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు
DHPS : Khammam: దళితుల, గిరిజనుల, బీసి ల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు రాజ్యాంగ ఉనికికే పెను ప్రమాదమని, వెంటనే ధర్మారెడ్డి ని ఎమ్మెల్యే పదవి నుండి తప్పించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్పిఎస్) రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వరంగల్ లో నిర్వహించిన ఓసి గర్జన సభలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడిన మాటలను సంఘం రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పరకాల ఎమ్మెల్యే రాష్ట్రం వెనుకుబాటుకు దళితులు, గిరిజనులు, బహుజనులు వారే కారణం అని మాట్లాడటం సబబు కాదని పేర్కొన్నారు. ఇలా మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దళిత బహుజన ఉన్నతాధికారుల, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసి కించపరిచే విధంగా మాట్లాడిన అగ్రకుల అహంకారి చల్లా ధర్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బలహీన వర్గాల ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసిన ఆయనకు భారత రాజ్యాంగాన్ని రాసింది ఏ కులం వారో తెలియదా? అని ధర్మారెడ్డిని ప్రకటనలో ప్రశ్నించారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా అంచనా వేయడం తన మూర్ఘత్వానికి నిదర్శమని, ఈ దేశాన్ని పాలించే దమ్ము, ధైర్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగే శక్తి దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలకు ఉందని ధర్మారెడ్డి చరిత్ర తెలుసుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలపై అవసరమైతే మానవ హక్కుల సంఘానికి తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి ఫిర్యాదు చేస్తుందని ప్రకటనలో మందా వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇది చదవండి:గుంటూరు జిల్లా కలెక్టర్గా Vivek Yadav బాధ్యతలు స్వీకరణ
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక
ఇది చదవండి:యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను భర్తీ చేయాండి: గవర్నర్
ఇది చదవండి:తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
ఇది చదవండి:నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి
ఇది చదవండి:భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
ఇది చదవండి:మొట్ట మొదటి సారి మెట్రోలో గుండె తరలింపు!
ఇది చదవండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్) పాలసీ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి: టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు