Daily Jogging

Daily Jogging: జాగింగ్ తో జిమ్ ఫ‌లితాలు ప్ర‌తిరోజూ ఇలా!

Spread the love

Daily Jogging జాగింగ్ అనేది చ‌క్క‌ని ఆరోగ్య ప్ర‌క్రియ‌. జాగింగ్ వ‌ల్ల కొన్ని వారాల‌లోని మీ శ‌రీరం ఫిట్‌గా త‌యార‌వుతుంది. అయితే జాగింగ్ ప్రారంభించడానికి ముందుగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. జాగింగ్ చేసేట‌ప్పుడు మంచి దుస్తులు ఎంచుకోండి. మ‌రీ బిగుతుగా ఉన్న వాటిని కాకుండా వ‌దులుగా సౌక‌ర్య వంతంగా ఉన్న వాటిని ధ‌రించండి. ప‌రిగెత్త‌టానికి మంచి షూల‌ను వాడండి. షూ స‌రిగా లేన‌ట్ల‌యితే ప‌రిగెత్త‌టానికి సౌక‌ర్యంగా (Daily Jogging)ఉండ‌దు.

జాగింగ్ ప్రారంభించ‌డానికి ముందుగా కొన్ని సుల‌భ‌మైన వ్యాయామాల‌ను చేయండి. వీటిని వార్మ‌వ్ ఎక్స‌ర్‌సైజులు అంటారు. వేగంగా న‌డ‌వ‌డం ప్రారంభించి, కొద్ది కొద్దిగా ప‌రిగెత్తి, వేగంగా పరిగెత్తండి. వీటి వ‌ల‌న ప్ర‌శాంత‌మైన జాగింగ్‌ని ఆస్వాదిస్తారు. స‌రైన ప‌ద్ద‌తిలో ప‌రిగెత్తండి. స‌రైన విధంగా జాగింగ్ చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న వెన్ను నొప్పి లేదా వెన్ను స‌మ‌స్య‌లు ఇచ్చే ఇబ్బంది ఉంది. కాంక్రీటుతో చేసిన నేల‌పైన జాగింగ్ చేయ‌కుండా గ‌డ్డి ఉండే నేల‌పైన జాగింగ్ చేయ‌డం వ‌ల‌న కాళ్ల‌పైన ఒత్తిడి త‌గ్గుతుంది. జాగింగ్ చేయ‌డానికి ముందుగా నీటిని పుష్క‌లంగా తాగండి. వీలుంటే వాట‌ర్ బాటిల్‌ని వెంట తీసుకెళ్లండి. జాగింగ్ చేశాక వెంట‌నే ఆగ‌కుండా నెమ్మ‌దిగా వేగాన్ని త‌గ్గించి, నెమ్మ‌దిగా న‌డుస్తూ క్ర‌మంగా ఆపేయండి.

రోజు జాగింగ్ చేయ‌డం వ‌ల్ల జిమ్ చేసిన ఫ‌లితాల‌ను పొందుతారు. జాగింగ్‌ను ఉత్సాహ‌వంత‌మైన న‌డ‌క‌తో ప్రారంభించండి. ప్ర‌తిరోజూ 40 నిమిషాల జాగింగ్ వ‌ల‌న శ‌రీర బ‌రువు త‌గ్గుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు ప్ర‌భావాలు కూడా త‌గ్గుతాయి. మానిసిక ఒత్తిడి మాయ‌మైపోతుంది. జాగింగ్ వ‌ల‌న శ‌రీర ర‌క్త ప్ర‌సర‌ణ మెరుగు ప‌డ‌ట‌మే కాకుండా గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు బాగా త‌గ్గిపోతాయి. ప్ర‌తిరోజూ జాగింగ్ చేయ‌డం వ‌ల్ల వారం రోజుల్లో 1000 కేల‌రీలు వ్య‌య‌మ‌వుతాయి.

workout on an Empty Stomach:ప‌ర‌గ‌డుపున ఎక్స‌ర్‌సైజ్ ఉద‌యాన్నే చేస్తే?

workout on an Empty Stomachఆరోగ్యానికి ఆరోగ్యం.. అందానికి అందం.. ధృడ‌త్వానికి ధృడ‌త్వం ఇవ‌న్నీ ఒకేచోట ఎక్క‌డైనా దొరికితే అది ప‌క్కా ఎక్స‌ర్‌సైజేన‌ని సూచిస్తున్నారు ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు. Read more

aerobic exercise benefits: మ‌రింత పెద్ద‌వారిలా ముఖం క‌నిపించే వారికి ఇది చేస్తే బెట‌ర్‌!

aerobic exercise benefitsవ‌య‌సు పెరిగే కొద్దీ దిగులు మ‌నిషిని మ‌రింత పెద్ద వ‌య‌సు వారిలా క‌నిపించేలా చేస్తుంది. వ‌య‌సుతో పాటు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను, ముఖంపై వ‌చ్చే Read more

dreams psychological facts: వ్యాయామ క‌ల‌తో దేహ‌దారుఢ్యం..ఇక చేయ‌క‌పోయినా ప‌ర్వాలేదేమో!

dreams psychological facts పొద్దున్నే లేచి వ్యాయామం చెయ్యాల‌నీ, ఆరు ప‌ల‌క‌ల దేహం సాధించాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి? కానీ, గ‌బ‌గ‌బా త‌యారై, ర‌ద్దీ రోడ్డెక్కితేగాని స‌కాలంలో Read more

Exercise : ఎటువంటి ఖ‌ర్చులేని వ్యాయామం ఎంత మేలో?

Exercise : మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవ‌డం ముఖ్యం. అదే విధంగా ప్ర‌తి రోజూ వ్యాయామం చేయ‌డం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం చేసిన Read more

Leave a Comment

Your email address will not be published.