Cyclone Yaas : యస్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. తీవ్ర గాలులు, వర్షం దాటికి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా లో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇండియన్ ఆర్మీ బృందం పలు ప్రాంతాల్లో ఎమ్ర్జెన్సీ సర్వీసు ప్రారంభించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
Cyclone Yaas : గత కొద్ది రోజులుగా వణికిస్తోన్న యస్ తీవ్ర తుపాను ఎట్టకేలకు ఒడిశాలోని బాలాసోర్‌కు దగ్గరలో తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. అయితే ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతూ మూడు గంటల్లో బలహీన పడనుంది. తీరం దాటే సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల్లోని తీర ప్రాంత జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భయంకరమైన భీకరగాలులతో పాటు భారీ వర్షాలతో ఆయా ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. పలుచోట్ల ఇళ్ళు, భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. తుపాను దాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 130 – 155 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలలు ప్రభావంతో ఒడిశాలోని భద్రక్ జిల్లా వణికిపో యింది. తీవ్రమైన గాలి దాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఇక ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్ తీరంలో సముద్రం బాగా ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలో 30 గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తుపాను ప్రభావం జిల్లాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఒడిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
పౌర్ణమి రోజు అల్లకల్లోలం


బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో యస్ తుపాను ప్రభావం మరింత తీవ్రంగా మారనున్నట్టు వాతవారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో అలల ఉధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారే అవకాశముందని ఐఎండీ అధికారి మీడియాకు తెలిపారు. దీంతో తీర ప్రాంతాల్లో తుపాను పెను బీభత్సం సృష్టించనున్నట్టు హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ లోని 5 సబ్ డివిజన్లు, ఒడిశాలోని 4 బ్లాక్‌లు నీట మునిగే ప్రమాదముందన్నారు. సాధారణంగా జాబిల్లి భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ కనిపిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు విపరీతంగా ఉంటాయి. అలలు గరిష్ట ఎత్తుల్లో ఎగిసిపడుతుంటాయి. ఇక చంద్రగ్రహణం కూడా ఇదే రోజున కావడంతో భారత్‌లోని మధ్యాహ్నం 3.15 గంటల నుంచి చంద్రగ్రహణం మొదలవనుంది. దీంతో ఈ సాయంత్రం తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!