Cybercrime news Hyderabadహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ భరత్ పూర్‌కు చెందిన సునీల్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు ఎలా సహకరిస్తాన్నాడంటే, ముందుగా నేరగాళ్లు మ్యాజిక్ బ్రిక్స్, నో బ్రోకర్ యాప్‌లలో ప్లాట్ రెంట్ తీసుకుంటామని నమ్మిస్తారు. అలా మోసాలకు పాల్పడి కోట్ల రూపాయలలో దోచుకుంటున్నారు. వారికి సహకరిస్తూ సునీల్ పర్సంటేజ్ డీల్(Cybercrime news Hyderabad) చేసుకుంటాడు.
మరో పద్ధతిలో ఆర్మీ అధికారులమని నమ్మిస్తారు. అలా నమ్మించి ప్లాట్ రెంట్ తీసుకుంటామంటారు. అలా అడ్వాన్స్ డబ్బులు పంపిస్తామని యజమానిని ముగ్గులో దింపుతారు. ప్లాట్ యజమాని ద్వారా అతని అకౌంట్ ను యాక్ చేసి డబ్బులు కాజేస్తారు. ఈ సైబర్ నేరగాళ్ల కు వెళ్లే డబ్బుల్లో 20 శాతం వాటాను సునీల్ తీసుకుంటాడు.


ఇలా మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు ద్వారా టెక్నాలజీ ఉపయోగించి బాధితుల అకౌంట్ల నుంచి వచ్చిన డబ్బులను తన పిఓఎస్ మెషిన్(POS Machine) ద్వారా క్యాష్ చేసుకుంటున్నాడు ఈ నిందితుడు. సునీల్‌ను అరెస్టు చేసి అతన్ని శోధా చేయగా అతని వద్ద 8 ఏటిఎం కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, 1 పిఓఎస్ మిషన్, 1.5 లక్షల రూపాయలు సీజ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!