cyber crime typesఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఎలాంటి సందర్భాల్లో ఈ నేరాలు జరుగుతాయో వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువుగా తరుచుగా అడిగే ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు(cyber crime types) తెలుసుకుందాం!
తక్కువ ధరకు బంగారం అమ్ముతామని వచ్చే గుర్తు తెలియని ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దు. డిష్ టివి కొన్నందుకు కూపన్ వచ్చిందని, దీనికి రూ.25 లక్షల లాటరీ తగిలిందని ఫోన్ చేసి చెబుతారు. ఆ డబ్బును జమ చేసేందుకు బ్యాంకు ఖాతా, పిన్ వివరాలు కావాలని ఒత్తిడి చేస్తారు. వివరాలు చెబితే మీ ఖాతా ఖాళీ అయినట్టే!. బీమాకు సంబంధించో, ఆదాయ పన్నుకు సంబంధించో రిఫండ్ వచ్చిందని, జమ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దు. ఆన్లైన్లో ఇలాంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.


బ్యాంకు ప్రతినిధినంటూ పరిచయం చేసుకుని మీ ఖాతాలు, పిన్ వివరాలు చెప్పాలని ఫోన్లో అడిగితే ఇవ్వకండి. బ్యాంకులు ఎప్పుడూ మిమ్మల్ని ఈ వివరాలు అడగవని గమనించండి. మీ ఫోన్‌ను రీచార్జ్ చేస్తామని, కొద్దిసేపు స్విచ్ఛాఫ్ చేయాలని వచ్చే కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించవద్దు. మీరు ఫోన్ స్విచాఫ్ చేయగానే అలాంటి ముఠాలు తక్షణం మీ బంధువులకు ఫోన్ చేసి మీకు ప్రమాదం జరిగిందని, కొంత సొమ్ము ఇవ్వాని మోసానికి పాల్పడుతుంటాయి. లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకున్నారంటూ వచ్చే ఫోన్ సందేశాలు, ఈమెయిళ్లను నమ్మకండి. ఇవ్వన్నీ నైజీరియన్ మోసాలు.
మీకు ఉద్యోగం వచ్చిందని మెయిళ్లకు లేదా ఫోన్‌కు వచ్చే సందేశాన్ని సంస్థ ప్రతినిధులు నుంచి ధ్రువీకరించుకోవాలి. ఉద్యోగం ఆశచూపి డబ్బులు గుంజే ముఠాలున్నాయి. విదేశా్లో ఉద్యోగం వచ్చింది, పాస్‌పోర్టును పోస్టు చేయాలంటూ వచ్చే సమాచారాన్ని కూడా నమ్మవద్దు. ఇవన్నీ ఆన్లైన్ మోసాలే. పాస్‌పోర్టు నేరగాళ్ల చేతికి చిక్కితే మీకు తిప్పలే. గ్యారంటీ లేకుండా రుణాలిస్తామని, ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత చెల్లిస్తే చాని పత్రికల్లో కనిపించే ప్రకటనలు కూడా మోసపూరితాలే. ఇంటి నుంచి పనిచేయండి, పెద్దమొత్తంలో సంపాదించండి అని చెబుతూ ఇందుకోసం డబ్బు డిపాజిట్ చేయాలనివచ్చే ప్రకటనలూ మోసపూరితాలే.


ఈ- మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాటు మొబైల్ నెంబర్లు కూడా తెలియజేయాలని, వెబ్ మెయిల్ నుంచి వచ్చే ఈ మెయిళ్లన్నీ మోసపూరితాలే. వెబ్ సర్వీస్ ప్రొవైడర్ ఇలాంటి సమాచారం అడగదు. భారత రిజర్వు బ్యాంకు నుంచి లేదా ఏదైనా బ్యాంకు నుంచి మీ ఖాతాసురక్షితంగా ఉండేందుకు ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేయండంటూ ఈ మెయిల్ ద్వారా వచ్చే సమాచారాన్ని అస్సలు నమ్మవద్దు. ఇలాంటి వాటిని ఫిషింగ్ మోసాలు అంటారు. బ్రాండెండ్ వస్తువులు, ఖరీదైన ఉత్పత్తులు తక్కువ ధరకే అమ్ముతున్నామని, చెల్లింపులు ఆన్లైన్ ద్వారా చేయాలని వచ్చే ప్రకటనలను నమ్మవద్దు. ఒక్కసారి మీ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను నమోదు చేయగానే ఖాతా ఖాళీ అయినట్టే. ఫొటోలు చూడాలంటూ పరిచయస్తుల నుంచి వచ్చినట్టుగా ఉండే ఈ మెయిల్స్‌ను కూడా ముట్టుకోవద్దు. విద్వేష పూరిత, అసభ్యకర సమాచారాన్ని ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్, బ్లాగు తదితరలా ద్వారా ఇతరులకు పంపడం నేరం.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!