Cyber Crime News | చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘరానా మోసం వెలుగు చూసింది. మెడికల్ ఉద్యోగి ఆధార్ లింక్‌తో ఆన్లైన్ దోపిడి జరిగింది. తిరుపతిలోని రుయా మెడికల్ కళాశాలలో జూనియర్ అసిసెంట్‌గా లావణ్య కుమార్ అనే ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10వ తేదీన యూనియన్ బ్యాంక్ నుండి రూ.10,000 మాయమయ్యాయి. డబ్బులు మాయం చేసింది సైబర్ నేరగాళ్లు అని తెలిసింది. అదే విధంగా లావణ్య కుమార్ నుండి మరికొన్ని డబ్బులు(Cyber Crime News) దోచుకునేందుకు ఫిబ్రవరి 20వ తేదీన ప్రయత్నం చేశారు.
బాధితుడు బయోమెట్రిక్ లాక్ చేయడంతో సైబర్ నేరగాళ్ల ప్రయత్నం విఫలం అయ్యింది. వెంటనే అలిపిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అలిపిరి ఎస్సై జయచంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడి ఆధార్ లింక్ అప్డేట్ చేయాలని ఈ ఆన్లైన్ దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ