Cyber Cheating Vikarabad వికారాబాద్: డబ్బులు ఫ్రీగా రావని వారికి ఎంత చెప్పినా వినలేదు. సైబర్ వాళ్ల చేతులకు చిక్కవద్దంటే పెడచెవిన పెట్టారు. ఆఖరికి సైబర్ నేరగాళ్లకు కాసుల వర్షం కురిపించి బలయ్యారు ఆ గ్రామానికి చెందిన ప్రజలు. బాధితుల మాటల్లోనే..
వికారాబాద్ జిల్లాలోని మారుమూల పల్లె అయిన కడ్మూర్ గ్రామంలో ప్రజలు కాయకష్టం చేసుకుంటూ జీవించే వారు. వారి అమాయకత్వాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber Cheating Vikarabad) ఆ వూరి ప్రజలకు డబ్బులు ఎర చూపారు. కడ్మూర్ గ్రామ ప్రజలు నిండా ముంచి కుచ్చిటోపీ పెట్టారు సైబర్‌నేరగాళ్లు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు…దాదాపు 200 మందికి పైగా మోసపోయారంట. lion company పేరుతో ఉన్న ఒక లింక్(link)ను వారు ఓపెన్ చేసి ఒక యాప్(app)ను డౌన్లోడ్ చేసుకున్నారు.
గ్రుడ్డిగా నమ్మి!
ఆ యాప్‌లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తున్నాయని గ్రుడ్డిగా నమ్మి 200 మంది ఇన్వెస్ట్ చేశారు. రూ.500 నుంచి రూ.1,000,00 పెట్టుబడి పెడితే రోజూ ఆదాయం వస్తుందని చెప్పడంతో భారీగా పెట్టుబడి పెట్టేశారు. అయితే ఆ యువకులను సీమా అనే మహిళ వాట్సాప్ చాట్ద్వారా పెట్టుబడి పెట్టించారని చెబుతున్నారు బాధితులు.
న్యూయర్ ఆఫర్ అంటూ, రూ.10,000 వేలకు లకు రూ.1,000,00 అంటూ , లక్షకు 5 లక్షల ఆఫర్ అంటూ ఊరించింది ఆ కేడీ మహిళ. అయితే ఆ కిలేడీ మహిళా మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు స్థానికులు. అయితే మొదటి రోజు మాత్రం భారీగా ఆదాయం వచ్చింది. ఇది గమనించిన వారు అత్యాశతో అప్పు చేసి మరీ లక్షల రూపాయలు యాప్‌లో పెట్టుబడి పెట్టారు. ఆఖరికి అసలు విషయం బయట పడింది. ఆ మహిళ స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించారు. సైబర్ క్రైం(Cyber Cheating Vikarabad)ను ఆశ్రయించారు. ఎలాగైనా తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని పోలీసువారిని బాధితులు వేడుకుంటున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!