Current Shock accident : విద్యుత్ షాక్కు ఐదు పాడిగేదెలు మృతి చెందాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ స్థంభాలు కుంగ్రిపోవడంతో వైర్లు నేలను తాకుతున్నాయి. ఇప్పుడు ఆ విద్యుత్ వైర్లు మూగజీవాలకు యమపాశాలుగా మారాయి.
Current Shock accident : విద్యుత్ షాక్తో ఐదు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని ముచ్చవరం గ్రామంలో చోటుచేసుకుంది. ముచ్చవరం గ్రామంలో ఇటీవల కాలంలో గాలులతో కూడిన వర్షం వచ్చింది. అదే సమయంలో పంట పొలంలో ఒక విద్యుత్ స్థంభం పూర్తిగా ఒరిగి ఉంది. విద్యుత్ వైర్లు కూడా పూర్తి స్థాయిలో నేలను తాకాయి. మేత తినేందుకు వెళ్లిన కొన్ని గేదెలు ఆ విద్యుత్ వైర్లలో ఒక తీగకు ఎర్త్ రావడంతో 5 పాడిగేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన పంట పొలము వద్దకు వెళ్లి చూడగా ఐదు పాడి గేదెలు మృత్యువాత పడి ఉన్నాయి. ఈ గేదెలు తాతా గోవర్థనవి రెండు, సాదం వెంకట నారాయణవి ఒకటి, సాదం వెంకటేశ్వరరావుది ఒకటి, శీలం కృష్ణయ్య ది ఒక గేదెగా గుర్తించారు. ఘటనా స్థలానికి గ్రామ సర్పంచ్ గంగవరపు వెంకటేశ్వరరావు చేరుకున్నారు. మృతి చెందిన గేదెలను పరిశీలించారు. వీటి విలువ సుమారుగా రూ.3 లక్షల 50 వేలు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని విద్యుత్తు అధికారులను సర్పంచ్ కోరారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!