current affairs science and technologyపాఠకులకు తెలియజేయునది ఏమనగా ఉద్యోగాల కోసం, పోటీ పరీక్షల కోసం ఎంతో మంది కరెంట్ అఫైర్స్ కోసం చూస్తుంటారు. కావున వారి కోసం ప్రత్యేకంగా మేము కరెంట్ అఫైర్స్ ఏర్పాటు చేసి మాకు అందుబాటులో ఉన్న కొన్ని ప్రశ్నలు- జవాబులు సేకరించి మీకు అందజేస్తున్నాము. మీరు చదువుతున్న కరెంట్ అఫైర్స్‌తో పాటు ఇవి కూడా చదువుకోండి. వీలైతే మీ మిత్రులకు షేర్ (current affairs science and technology)చేయండి.
1.ఏ ఉపగ్రహ నౌక ద్వారా చంద్రయాన్ -1 ప్రయోగించారు?
జ.పీఎస్ఎల్వీ-సీ11 డి
2.భారత కమ్యూనికేషన్ సేవల ఉపగ్రహం ఇన్శాట్-4బిని ఎక్కడ నుంచి ప్రయోగించారు?
జ.ఫ్రెంచ్ గయానా
3.విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన ఏ గట్టి పదార్థాన్ని దంతాల్లో రంధ్రాలను పూడ్చడానికి వినియోగిస్తారు?
జ.కెవ్లార్
4.పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ ఎల్వీ) ఎన్ని దశల అంతరిక్ష నౌక?
జ.4
5.ఇటీవల పీఎస్ఎల్వీ- సీ8తో ప్రయోగించిన ఉపగ్రహం ఏది?
జ.అజైల్
6.చంద్రయాన్-1 ప్రయోగంలో భాగంగా ప్రయోగించిన మొత్తం పేలోడ్లు ఎన్ని?
జ.11
7.ఒకేసారి పది ఉపగ్రహాలను ఇస్రో ఏ ఉపగ్రహ నౌక ద్వారా ప్రయోగించింది?
జ.పీఎస్ఎల్వీ-సీ9బి
8.పీఎస్ఎల్వీ మొదటి దశలో వాడే ఘన ఇంధనం?
జ.హైడ్రాక్సీటెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైఈన్
9.చంద్రయాన్-1, చంద్రయాన్-2, ఏస్ట్రోశాట్ వంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని గ్రహించేందుకు ఉద్దేశించిన భారీ గ్రౌండ్ స్టేషన్ డీప్ స్పేస్ నెట్వర్క్(డిఎన్ఎస్) ఎక్కడ ఏర్పాటు అవుతోంది?
జ.బ్యాలాలు, కర్ణాటక


10.ఇస్రో త్వరలో ప్రయోగించనున్న రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం?
జ.రీశాట్
11.భూమి చుట్టూ ఓజోన్ పొర ఆవిర్భావానికి కారణమైన కిరణాలు?
జ.అతినీలలోహిత
12.బిందు ఘటన సిద్ధాంతం దేని ఆవిర్భావాన్ని వివరిస్తుంది?
జ.జీవి
13.కార్బన్ మోనాక్సైడ్ ప్రభావం ద్వారా రక్తంలో ఆక్సిజన్ రవాణాను చేపట్టే హీమోగ్లోబిన్ సామర్థ్యం తగ్గడాన్ని?
జ.అనీమిక్ హైపాక్సియా
14.కింది కాలుష్య కారకాల్లో మనిషిపై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రదర్శించనది ఏది?
జ.CO2
15.సిగరేట్ పొగలోని ఏ పదార్థాలు క్యాన్సర్ కారకాలుగా వ్యవహరిస్తాయి?
జ.పాలీ సైక్లిక్ హైడ్రోకార్బన్లు
16.వాతావరణంలోని ఏ మోతాదులో CO తలనొప్పిని కలుగజేస్తుంది?
జ.50ppm
17.గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన గ్రీన్హౌస్ వాయువు?
జ.CO2, N2O,CH4
18.పత్తి పోగుల కాలుష్యం ద్వారా ఊపిరితిత్తులకు సోకే వ్యాధి?
జ.బైస్సినోసిస్
19.లెడ్, సిల్వర్ పెయింట్ల రంగును నష్ట పరిచే కాలుష్య కారకం?
జ.సల్ఫర్ డై ఆక్సైడ్
20.National Environmental Engi-neering Research Institute (NEERI) ఏ నగరంలో ఉంది?
జ.నాగ్‌పూర్
21.సిగరెట్ పొగలో రేడియో ధార్మిక పదార్థం?
జ.పొలోనియం
22.వాయుకాలుష్యం (నివారణ, నియంత్రణ) చట్టం దేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ.1981
23.ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాలలో ఇస్రో ఇప్పటి వరకు ఎన్నింటిని ప్రయోగించింది?
జ.24
24.ఎడ్యుశాట్ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం?
జ.దూరవిద్య(Tele Education)
25.మొట్టమొదటి ఇన్శాట్ ఉపగ్రహాన్ని (INSAT 1-A) రోదసిలోకి ప్రయోగించిన తేది?
జ.ఏప్రిల్ 10, 1982
26.ఇన్శాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహాలు ప్రధానంగా ఏ రకానికి చెందుతాయి?
జ.జియోస్టేషనరీ
27.భారతదేశంలో ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం పేరు?
జ.సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR- శ్రీహరి కోట)
28.శ్రీ హరికోటలోని రెండు లాంచ్ ప్యాడ్ల నుంచి ఏటా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు?
జ.6


29.ఇన్శాట్ INSAT పూర్తి నామం?
జ.Indian National Satellite System
30.మెట్శాట్ METSAT అనగా?
జ.Meteorological Satellite (వాతావరణ ఉపగ్రహం)
31.1988లో IRS (Indian Remote Sensing) శాటిలైట్ వ్యవస్థలో ప్రస్తుతం ఎన్ని ఉపగ్రహాలు వాడుకలో ఉన్నాయి?
జ.10
32.వ్యవసాయం, పట్టణ ప్రణాళిక రూపకల్పన, సముద్ర తీర ప్రాంత పటాల రూపకల్పన మొదలుకొని టెలిమెడిసిన్ వరకు వివిధ రంగాలలో ఉపయోగించే ఉపగ్రహ వ్యవస్థ పేరు?
జ.IRS ఉపగ్రహ వ్యవస్థ
33.ఇన్శాట్, ఐ.ఆర్.ఎస్ ఉపగ్రహ వ్యవస్థల సేవలు రెండింటిని కలుపుకుని ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని ప్రారంభించింది, దాని పేరు?
జ.విలేజ్ రిసోర్స్ సెంటర్ (VRC), ఇటువంటి (VRC) లు దేశవ్యాప్తంగా 500 కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.
34.ఇప్పటి వరకూ ఇస్రో ప్రయోగించిన 19 ప్రయోగాలలో విఫలమైనవి ఎన్ని?
జ.1
35.ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన ఏడు GSLV (Geo- Synchronous Satellite Launch Vehicle) ప్రయోగాలలో ఎన్ని విజయవంతమైనవి?
జ.4
36.డైరెక్ట్ – టు – హోమ్ (DTH) సేవలు ఏ ఉపగ్రహ శ్రేణి ద్వారా అందిస్తున్నారు?
జ.INSAT 4 శ్రేణి
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!