Current Affairs in Telugu : డైలీ క‌రెంట్ అఫైర్స్ జూన్ – 2021

Current Affairs in Telugu : అన్ని పోటీ ప‌రీక్ష‌ల‌కు డైలీ క‌రెంట్ అఫైర్స్‌ను మా వెబ్‌సైట్ నందు అంద‌జేస్తున్నాం. కావున ఎవ‌రైనా ఉద్యోగాల‌కై పోటీ ప‌రీక్ష‌ల నిమిత్తం ప్రిపేర్ అయ్యే వారికి ఇవి ఎంతోగాను ఉప‌యోగ‌ప‌డ‌తాయి. తాజా స‌మాచారంతో అన్ని రంగాల‌కు చెందిన క్వ‌శ్చ‌న్స్‌, బిట్లు అంద‌జేస్తున్నాం. తాజా తాజా స‌మాచారం, క‌రెంట్ అఫైర్స్ కోసం మా వెబ్‌సైట్ లింక్ నోటిఫికేషన్‌ను ఓకే చేసుకోండి!


Current Affairs in Telugu : –

తొలిసారిగా మాన‌వుడికి సోకిన బ‌ర్డ్ ఫ్లూ?
ప‌క్షుల‌కు వ్యాపించే బ‌ర్డ్ ఫ్లూ చైనాలో తొలిసారిగా బ‌ర్డ్ ఫ్లూ ఓ వ్య‌క్తికి సోకింది. ఆ దేవ ఆరోగ్య క‌మిష‌న్ (NHC) ప్ర‌క‌టించింది. H10N3 స్ట్రెయిన్ వ్యాపించింద‌ని వెల్ల‌డించింది. తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ న‌గ‌రానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బ‌ర్డ్ ఫ్లూ సోకింద‌ని జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ వివ‌రించింది.

మాజీ ఎమ్మెల్యే అవుతూ రామిరెడ్డి క‌న్నుమూత‌!
గుంటూరు జిల్లా దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి (86) క‌న్నుమూశారు. అవుతు రామిరెడ్డి 1967 – 72 లో ఎమ్మెల్యేగా, 1981 – 86 కాలంలో ఈమ‌ని స‌మితి అధ్య‌క్షుడిగా సేవ‌లందించారు.

ఏపీ ఆర్టీసీ ఎండీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు నియామ‌కం!
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీగా సీనియ‌ర్ ఐపిఎస్ అధికారి ద్వార‌కాతిరుమ‌ల‌రావు నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ఆర్‌టీసీ ఎండీగా విధులు నిర్వ‌ర్తిస్తున్న ఆర్పీ ఠాకూర్ రిటైర్ కావ‌డంతో ఆ స్థానాన్ని ద్వార‌కా తిరుమ‌ల‌రావు భ‌ర్తీ చేయ‌నున్నారు.

మాజీ సీఎస్ ఎస్వీ ప్ర‌సాద్ క‌న్నుమూత‌
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(CS) ఎస్వీ ప్ర‌సాద్ క‌న్న‌మూశారు. 2010 లో ఉమ్మ‌డి ఏపీలో సీఎస్‌గా ప‌నిచేసిన ఎస్వీ ప్ర‌సాద్ ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌కు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హ‌యాంలో ఎస్వీ ప్ర‌సాద్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.

CI President గా న‌రేంద్ర‌న్‌
కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఇండ‌స్ట్రీ (సీఐఐ) నూత‌న ప్రెసిడెంట్‌గా 2021 -22 సంవ‌త్స‌రానికి గాను TATA STEEL CEO, ఎండీ టి.వి న‌రేంద్ర‌న్ నియ‌మితుల‌య్యారు. 2016 -17 లో సీఐఐ తూర్పు ప్రాంత ఛైర్మ‌న్‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. వ‌ర‌ల్డ్ స్టీల్ అసోసియేష‌న్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్‌పూర్ బోర్డు ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ ఛైర్మ‌న్‌గా, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెట‌ల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కొన‌సాగుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్‌గా బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌, సీఎండీ సంజీవ్ బ‌జాజ్ ఎన్నిక‌య్యారు. అలాగే సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో మోటోకార్ప్ ఛైర్మ‌న్‌, సీఈఓ ప‌వ‌న్ ముంజాల్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Indian navy chief of material గా బాధ్య‌లు స్వీక‌రించిన వైస్ అడ్మిర‌ల్ సందీప్ నైథానీ
ఇండియ‌న్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియ‌ల్‌గా, వైస్ అడ్మిర‌ల్ సందీప్ నైథానీ, ఎవిఎస్ఎం, విఎస్ఎంగా ఛార్జ్ తీసుకున్నారు. పూణె ఖ‌డ‌క‌వ‌స్లాలోని నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీకి చెందిన గ్రాడ్యుయేట్ అయిన ఆయ‌న‌ను 1985, జ‌న‌వ‌రి 1న భార‌తీయ నావికాద‌ళ ఎలక్ట్రిక‌ల్ బ్రాంచ్‌లో నియ‌మించారు. IIT ఢిల్లీ నుంచి రాడార్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప‌ట్టాను పొందిన అడ్మిర‌ల్ డిఫెన్స్ స‌ర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (DSSC), నేష‌న‌ల్ డిఫెన్స్ కాలేజీ (NDC) కి చెందిన ప్ర‌ముఖ పూర్వ విద్యార్థి కూడా.

విశాఖ‌ప‌ట్నం నావ‌ల్ డాక్ యార్డ్ అడ్మిర‌ల్ సూప‌రింటెండెంట్ గా ఐ.బి.ఉత్త‌య్య‌
విశాఖ‌ప‌ట్నం, నావ‌ల్ డాక్ యార్డ్‌, అడ్మిర‌ల్ సూప‌రింటెండెంట్‌గా, రియ‌ర్ అడ్మిర‌ల్ ఐ.బి ఉత్త‌య్య‌, వి.ఎస్‌.ఎమ్ రియ‌ర్ అడ్మిర‌ల్ కుమార్ నాయ‌క్ నుంచి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రియ‌ల్ అడ్మిర‌ల్ ఐ.బి ఉత‌య్య‌, వి.ఎస్‌.ఎమ్‌, 1987, న‌వంబ‌ర్ నెల‌లో భార‌త నావికాద‌ళంలో చేరారు. అడ్మిర‌ల్ ఐ.బి ఉత్త‌య్య‌, మైరెన్ ఇంజ‌నీరింగ్‌లో బి.టెక్‌. డిగ్రీ, గ‌ణిత మోడ‌లింగ్‌, కంప్యూట‌ర్ సిమ్యులేష‌న్‌లో ఎం.టెక్ డిగ్రీతో పాటు స్ట్రాట‌జిక్ స్ట‌డీస్‌లో ఎం.ఫిల్‌. డిగ్రీని క‌లిగి ఉన్నారు. 33 ఏండ్ల స‌ర్వీసులో, అడ్మిర‌ల్ ఐ.బి. ఉతయ్య‌, భార‌త నావికాద‌ళానికి చెందిన‌, యుద్ద నౌక‌ల రూప‌క‌ల్ప‌న డైరెక్ట‌రేట్‌, శిక్ష‌ణ అకాడ‌మీలు, నావ‌ల్ డాక్ యార్డ్‌, క‌మాండ్‌, నావ‌ల్ ప్ర‌ధాన కార్యాల‌యాల‌లో వివిధ హోదాల్లో సేవ‌లందించారు.

జాతీయ వాలీబాల్ జ‌ట్టులో శివ‌
తెలంగాణ కుర్రాడు న‌క్క శివ జాతీయ వాలీబాల్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా రావిచేడ్ గ్రామానికి చెందిన శివ గ‌త నెల హ‌ర్యాన‌లో నిర్వ‌హించిన అండ‌ర్ -19 రాష్ట్రస్తాయి పోటీల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌త్తాచాటాడు. జూన్ 8వ తేదీ నుంచి నేపాల్‌లో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ వాలీబాల్ పోటీల్లో అత‌డు బ‌రిలోకి దిగనున్నాడు.

Magma Fincorp ఛైర్మ‌న్‌గా అదార్ పునావాలా!
ముంబై కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ మాగ్మా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ నూత‌న ఛైర్మ‌న్‌గా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆదార్ పునావాలాను నియ‌మించిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. పునావాలా ప్ర‌స్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ – అస్ట్రాజెనెకా త‌యారు చేసిన కోవిషీల్డ్ క‌రోనా వ్యాక్సిన్‌ను భార‌త్‌లో సీరం కంపెనీ ఉత్ప‌త్తి చేస్తోంది. మాగ్మా కంపెనీలో పునావాలా ఆధ్వ‌ర్యంలో రైజింగ్ స‌న్ హోల్డింగ్స్ రూ.3,456 కోట్ల పెట్టుబ‌డి పెట్టింది.

Share link

Leave a Comment