Current Affairs June 2021 in Telugu: అన్ని పోటీ పరీక్షలకై ఉపయోగపడే కరెంట్ అపైర్స్ జూన్ 2021.
2 కొత్త జాతుల సాలీళ్లకు ఏఎస్ఐ పేరు
శాస్త్రవేత్తలు సాలీళ్లలో రెండు కొత్త జాతుల్ని కనుగొన్నారు. మహారాష్ట్రలో కనుగొన్న ఈ రెండు కొత్త జాతులకు 26/11 టెర్రరిస్ట్ దాడిలో మృతి చెందిన ఏఎస్ఐ తుకారమ్ ఓంబుల్ పేరు పెట్టారు. ఐసియస్ తుకారమి అని వీటికి నామకరణం చేశారు. మహారాష్ట్రలో కనుక్కోబడిన సాలీళ్లలోని రెండు కొత్త జాతులకు పోలీసు అమరవీరుడు తుకారమ్ పేరు వచ్చేలా ఐసియస్ తుకారమి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ముంబైకి చెందిన తుకారమ్ ఓంబుల్ 2008 లో తాజ్హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో మృతువాత పడ్డారు. 26/11 నిరాయుధుడైన తుకారమ్ కసబ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిం చారు. ఈ నేపథ్యంలో కసబ్ జరిపిన కాల్పుల్లో తుకారమ్ వీర మరణం పొందారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ఇచ్చి గౌరవించింది.
భారత రక్షణ స్థావరంపై తొలి డ్రోన్ ఉగ్రదాడి
జమ్మూలోని భారత వైమానిక దళ (ఐఏఎఫ్) స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవా దులు భారత కీలక రక్షణ స్థావరాలపై డ్రోన్ దాడికి తెగబడడం ఇదే తొలిసారి. జమ్మూ విమానా శ్రయంలోని ఐఏఎఫ్ స్టేషన్‌పై శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండు బాంబులను జారవిడిచారు. జమ్మూ విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైమానిక దళ నియంత్రణలో ఉంటుంది.
ట్విట్టర్‌కు గ్రీవెన్స్ ఆఫీసర్ గుడ్‌బై
సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల నియమించిన తాత్కాలిక ఫిర్యాదుల స్వీకరణ అధికారి ధర్మేంద్ర చాతుర్ పదవికి రాజీనామా చేశారు. భారత్‌లో ట్విట్టర్ వినియోగదారుల ఫిర్యాదుల కోసం మన దేశానికి చెందిన వారినే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలని కొత్త ఐటీ నిబంధనలు చెబుతు న్నాయి. దీంతో ఇటీవల ట్విట్టర్ సంస్థ ధర్మేంద్ర చాతుర్‌ని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. కానీ ఇప్పుడు ట్విట్టర్ వెబ్సైట్లో ఆయన పేరు కనిపించడం లేదు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేశారు.
దేశంలో నివాసయోగ్య నగరాల్లో అగ్రస్థానంలో బెంగుళూరు
కర్ణాటక రాజధాని, ఐటీ సిటీ బెంగళూరు దేశంలో నివాసయోగ్య నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ – 2020 ప్రకారం భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, విస్తరిస్తున్న ఐటీ రంగం తదితరాలతో ఈ హోదాను సొంతం చేసుకుంది. విజ్ఞాన, పర్యావరణ కేంద్రం(సీఎస్ఈ) విడుదల చేసిన నివాస యోగ్యాల నగరాల జాబితాలో బెంగుళూరు తర్వాత స్థానాల్లో చెన్నై, సిమ్లా, భువనేశ్వర్, ముంబై నిలిచాయి. ఢిల్లీ ఆరోస్థానంలో నిలవడమే కాకుండా ఆర్థిక సామర్థ్యంలోనూ చాలా వెనుకబడి ఉంది. నాణ్యమైన జీవన ప్రమాణాల్లో చాలా వెనుకబడి ఉంది. నాణ్యమైన జీవన ప్రమాణాల్లో 60.84 శాతం మార్కులతో చెన్నై తొలిస్థానం, 55.67 శాతం మార్కులతో బెంగళూరు రెండో స్థానం, భోపాల్ మూడో స్థానంలో నిలిచాయి. ఇది ఆర్థిక సామర్థ్యం అంశంలో బెంగళూరు టాప్‌లో నిలిచింది. 100కు 78.82 శాతం మార్కులు లభించాయి. బెంగుళూరు తర్వాత ఢిల్లీలో రెండో స్థానం (53.73 శాతం) దక్కింది.
శ్రీకాళహస్తి అన్నప్రసాదానికి ఐఎస్ఓ సర్టిఫికెట్
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో అన్నప్రసాదం నాణ్యత, శుభ్రతకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. హెచ్‌వైఎం సంస్థ ప్రతినిధులు ఆదివారం ఐఎస్ఓ ధ్రువపత్రాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు.
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు డయానా అవార్డు
తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కింది. బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్‌ను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్‌పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
భారత్‌కు 4 కోట్ల డాలర్ల సహాయాన్ని ప్రకటించిన అమెరికా ఏజెన్సీ
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్నేహ హస్తాన్ని అందించింది. ఇండియాకు అదనంగా మరో 41 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆ దేశం ప్రకటించింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఆ సాయాన్ని వినియోగించనున్నారు. ఇప్పటి వరకు అమెరికా 200 మిలియన్ల డాలర్ల విలువైన సహాయాన్ని అందించింది. కోవిడ్ టెస్టింగ్, మెంటల్ హెల్త్ సర్వీస్, మెడికల్ సర్వీస్‌కు ఆ నిధులను ఖర్చు చేయనున్నారు. అమెరికా ఏజెన్సీ సుమారు రెండు లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు శిక్షణ ఇచ్చింది. మే నెలలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వంద మిలియన్ డాలర్ల కోవిడ్ సహాయాన్ని ప్రకటించారు.
ఇజ్రాయెల్‌లో ఆదిమానవుల శిలాజాలు
ఆదిమానవులకు సంబంధించిన కొత్త జాతిని మధ్య ఇజ్రాయెల్‌లో కనుగొన్నట్టు ఆ దేశ పరిశోధకులు తెలిపారు. టెల్ అవీవ్‌లోని ఓ సిమెంట్ ప్లాంట్ కింద 1.30 లక్షల సంవత్సరాలకు చెందిన ఓ పుర్రె కింద దవడకు సంబంధించిన శిలాజాలను కనుగొన్నట్టు చెప్పారు. నియండర్తల్స్కు దగ్గరి పోలిక కలిగిన ఈ ఆదిమానువల జాతికి “నెషర్ రామ్లా హోమో అని పేరు పెట్టినట్టు టెల్ అవీవ్ యూనివర్శిటీ, హెబ్రే యూనివర్శిటీ ఆఫ్ జెరూసలేం పరిశోధకులు తెలిపారు. నెషర్ రామ్లా హోమోలకు పొడవైన దంతాలు ఉండేవని, దవడ ముందు భాగం ఉండేది కాదని అంచనా వేస్తున్నారు.
జర్నలిస్ట్ సాయినాథ్కు జపాన్ పురస్కారం
ఆశియా దేశాల సంస్కృతి, వారసత్వాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించే వారికిచ్చే ప్రఖ్యాత ఫుకువోకా గ్రాండ్ ఫ్రైజ్ 2021 సంవత్సరానికి గానూ భారత్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ పి.సాయినాథ్ ను వరించింది. గ్రామీణ భారత సంస్కృతిని తన రచనలతో వెలుగులోకి తీసుకొచ్చిన సాయినాథ్ ఈ పురస్కరానికి అర్హులని జపాన్ కు చెందిన పుకువోకా పురస్కార కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
రాజీనామా చేసిన స్వీడన్ ప్రధాని
స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్వెస్ తన పదవికి రాజీనామా చేశారు. స్టీఫెన్‌కు వ్యతిరేకంగా గతవారం ఆ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో ఆయన పదవికి రాజీనామా చేయడానికి వారం రోజులు సమయం ఇచ్చారు. వారం రోజులు గడువు పూర్తి కావడంతో స్టీఫెన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. దీంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంలో విఫలమై పదవిని పోగొట్టుకున్న తొలి స్వీడన్ ప్రధానిగా ఆయన అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
Current Affairs Bits 2021
- రష్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దీపికా కుమారి ఏ పతాకాన్ని గెలుచుకున్నారు.
జ.బంగారు పతకం
- రాబోయే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ ఈతగాడు ఎవరు
జ.సజన్ ప్రకాష్
3. ఫిన్లాండ్లో జరిగిన కుర్టెన్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా ఏ పతకం సాధించాడు.
జ.కాంస్యపతకం
4.పెరూంలో జరిగిన పారా వరల్డ్ కప్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రుబినా ఫ్రెంచ్ ఏ పతకాన్ని గెలుచుకుంది.
జ. బంగారుపతకం
- ఏ నగరంలో నరేంద్ర మోడీ జెన్ గార్డెన్ ప్రారంభించారు.
జ.అహ్మదాబాద్
6.బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో క్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2021లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు.
జ. ఐఐఎం బెంగళూరు
- ఆర్చరీ ప్రపంచ కబ్ 2021 లో వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు.
జ.బంగారు పతకం
8.గ్లోబల్ ట్రావెల్ పోర్టల్ లవ్ ఎక్స్‌ప్లోరింగ్.కామ్ ప్రపంచంలోని 26 అందమైన ఫౌంటెన్ల జాబితాలో ఏ భారతీయ ఫౌంటెన్ పేరు పెట్టబడింది.
జ. ఆనందం యొక్క ఫౌంటెన్ (కోల్కత్తా)
9.మాట్ హాంకాక్ స్థానంలో బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ దేశ నూతన ఆరోగ్య మంత్రిగా ఎవరు నియమించబడ్డారు.
జ. సాజిద్ జావిద్.
10.టోక్యో ఒలింపిక్స్ నుండి వైదొలిగిన ప్రసిద్ధ టెన్నిస్ ఆటగాడు ఎవరు?
జ.సెరెనా విలియమ్స్
11.మహారాష్ట్రలో కనిపించే కొత్త జాతుల సాలీడు పేరు ఏమిటి?
జ. ఇసియాస్ తుకారామి.
12.స్మార్ట్ సిటీ అవార్డు 2020 యొక్క 100 నగరాల జాబితాలో ఏ నగరాలకు మొదటి స్థానం లభించింది?
జ.ఇండోర్ మరియు సూరత్
13.17 సంవత్సరాల 150 రోజుల్లో అన్ని ఫార్మాట్లలో అడుగుపెట్టిన ప్రపంచంలోనే తొలి భారతీయ, మూడో మహిళ క్రీడాకారిణిగా నిలిచిన భారతీయ మహిళా క్రికెట్ ఎవరు?
జ.షఫాలి వర్మ.
14.గ్రేట్ వర్క్ టు ప్లేస్ (జిపిటిడబ్ల్యూ) చేత దేశంలో ఉత్తమ యజమానుల జాబితాలో ఏ సంస్థ చేర్చబడింది. మరియు వాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా చేర్చబడింది?
జ. ఒఎన్‌జిసి.