current affairs 2021 questions and answers: మీరు పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్నారా? అయితే మీకోసం తెలుగులో అన్ని రకాల కరెంట్ అఫైర్స్‌ను అందిస్తున్నాము. మీ పోటీ పరీక్షలకు ఈ బిట్స్ చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం మా వెబ్‌సైట్‌ను అనుసరించిండి.
Q.నాసా ప్రయోగించిన ఇన్సైట్ ల్యాండర్ అంగారకుడిపై ఏ ప్రాంతంలో దిగనుంది?
A.ఎల్సియం ప్లానీషియా
Q.ఈ ఏడాది ఉత్తమ ఉద్యోగి పురస్కారం జాయింట్ లేబర్ కమిషనర్ వరహాలరెడ్డిని వరించింది. ఏ సమస్యలు పరిష్కరించినందుకు ఆయనకు ఈ పురస్కారం వరించింది?
A.కార్మికులు, యాజమాన్యాల మధ్య నెలకొన్న సమస్యలు
Q.ఆర్మేనియా పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తిరుగుబాటు నేత పేరేమిటి?
A.నికోల్ పాష్నియాన్
Q.రాజస్థాన్‌లో భారతసైన్యం నెలరోజులపాటు భారీ ఎత్తున నిర్వహించిన కసరత్తు పేరు ఏమిటి?
A.విజరుప్రహార్
Q.ఫేస్బుక్ డేటా కుంభకోణం వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన సంస్థ ఏది?
A.కేంబ్రిడ్జ్ అనలిటికా
Q.యుద్ధ భూమి సియాచిన్ ను సందర్శించిన మొదటి భారత రాష్ణ్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం. ఆయన ఏ సంవత్సరంలో సియాచిన్ ను సందర్భించారు?


A.2004
Q.బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఛైర్మన్‌గా సుభాష్ చంద్ర కుంతియా ఎవరి స్థానంలో బాధ్యతలు చేపట్టారు?
A.టీఎస్ విజయన్
Q.వేల కోట్ల డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ, తన ప్రయాణాలపై నిషేధానికి గురైన మలేషియా మాజీ ప్రధాని పేరేమి?
A.నజీజ్ రజాక్
Q.భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఏ క్రీడా కారిణిని జాతీయ క్యాంప్ నుండి సస్పెండ్ చేసింది?
A.పూనమ్ యాదవ్
Q.దేశంలో సంచలనం సృష్టించిన జ్యోతిర్మరు హత్య కేసులో మొత్తం తొమ్మిది మందిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చిన న్యాయమూర్తి ఎవరు?
A.సమీర్ అడ్కర్
Q.బంగాళాఖాతం గర్భంలో భారీ స్థాయి ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది అని తెలిపిన సంస్థ ఏది?
A.భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ
Q.పారిశ్రామిక, సేవా రంగాల్లో ప్రధమ స్థానంలో నిలిచిన విశాఖపట్నం జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎన్నో స్థానంలో నిలిచింది?
A.చివరి నుంచి మూడో స్థానంలో
Q.అతి తక్కువ రోజుల్లోనే ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలన్న తన కలను నిజం చేసుకున్న ఆస్ట్రేలియా వాసి పేరేమి?
A.స్టీవ్ ప్లెయిన్
Q.పాక్ మూలాలు కలిగి ఇటీవల బ్రిటన్ హోంమంత్రిగా నియమితులైన వారు ఎవరు?
A.సాజిద్ జావెద్
Q.రెండు కాళ్లు లేని 69 ఏళ్ల చైనావాసి తన ఐదో ప్రయత్నంలో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అతని పేరు ఏమిటి?
A.షియా బోయు
Q.న్యూయార్క్ సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక జడ్జిగా నియమితులైన భారత సంతతి మహిళ పేరు ఏమిటి?
A.దీపా అంబేకర్
Q.తాగునీటిని శుద్ధి చేసేందుకు నానో పరిజ్ఞానంతో కూడిన పాలిమర్ తెరను తయారు చేసిన హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం అచార్యులు ఎవరు?


A.అపర్ణ టి.గుప్తా, టి.పి. రాధాకృష్ణన్
Q.ఏ శాస్త్ర పరిశోధనకు గాను ప్రొఫెసర్ కె.ప్రమోద్ నాయర్‌కు విజిటర్స్ అవార్డును బహూకరించారు?
A.మానవీయ, ఆర్స్ట్, సాంఘిక శాస్త్రంలో
Q.రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఎప్పటివరకు పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు?
A.2024 వరకూ
Q.స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ – 9 రాకెట్ ద్వారా బంగ్లాదేశ్ కు చెందిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం పేరు ఏమిటి?
A.బంగబంధు – 1
Q.ఫ్రాన్స్ లో ఆగష్టులో జరగనున్న ఫిపా అండర్ 20 మహిళల వరల్డ్ కప్‌నకు అసిస్టెంట్ రిఫరీగా ఎంపికైన భారతీయ మహిళ ఎవరు?
A.ఉవేనా ఫెర్నాండేజ్
Q.ఏ పథకం కాలుష్యాన్ని తగ్గించేందుకు గణనీయంగా దోహదపడుతుంది?
A.ఉజ్వల యోజన
Q.మహిళలు డ్రైవింగ్ చేయడంపై పదేళ్లపాటు కొనసాగిన నిషేధాన్ని తొలగించి, వారికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా అందించనున్న దేశం ఏది?
A.సౌదీ అరేబియా
Q.తెలంగాణ ఔషద నియంత్రణ సంస్థ సంచాలకులుగా ఐఏఎస్ అధికారి ప్రీతీ మీనాకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె ఏ సంస్థ ప్రాజెక్టు సంచాలకులుగా ఉన్నారు?
A.రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ
Q.ఉభయ కొరియాల సమావేశం సందర్భంగా ఉత్తర కొరియా తన ఎంత సమయాన్ని ముందుకు జరిపింది?
A.30 నిముషాలు
Q.అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నూతన డైరెక్టర్‌గా ఎం.బి.వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈయనపై ముందు ఈ బాధ్యతలు నిర్వహించినవారు ఎవరు?
A.ఎల్.కె.నందా
Q.2017-18 సంవత్సర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీడీపీ గణాంకాల ప్రకారం పారిశ్రామిక, సేవారంగాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది?
A.విశాఖపట్నం
Q.జాతీయ సాంకేతిక అవార్డు – 2018ని అందుకున్న భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరు ఏమిటి?
A.కృష్ణ మోహన్
Q.హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ఫ్రైజెస్ అసోసియేషన్‌కు కొత్త ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు?
A.బొల్లు మురళి
Q.గిరిజన సహకార సంస్థ నూతన ఎండీగా డాక్టర్ టి.బాబూరావు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎవరిస్థానంలో ఈయన నిమితులయ్యారు?
A.రవి ప్రకాష్
Q.ఐరాస భద్రతా మండలిలో భారత్ కు 2021 – 22 కు గాను తాత్కాలిక సభ్యుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్టు అంగీకరించిన దేశం ఏది?
A.గ్వాటెమాల
Q.అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ అంగారకుడిపైకి మానవులను తరలించడానికి ఉద్దేశించిన రాకెట్ పేరు ఏమిటి?
A.బిల్ ఫాల్కన్ రాకెట్
Q.ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2012 – 16 మధ్య 530 మంది పాత్రికేయులు మృత్యువాత పడ్డారని నివేదిక ఇచ్చిన ప్రముఖ సంస్థ ఏది?
A.యునెస్కో
Q.ఫిడె ప్రపంచ అమెచ్యూర్ చెస్ ఛాంపియన్ షిప్ ను ఎక్కడ నిర్వహించారు?
A.ఇటలీ
Q.ఐపీఎల్ ల నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న 6వ క్రికెటర్ పేరు ఏమిటి?
A.రాబిన్ ఉతప్ప
Q.ఏపీ జీడీపీ – 2017-18 ప్రకారం స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అధికశాతం వాటా కలిగిన జిల్లా ఏది?
A.కృష్ణా
Q.గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు జాతీయ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో ఎవరిని ఓడించి అగ్రస్థానంలో నిలిచారు?
A.స్వప్నిల్ దోపాడే
Q.ఖనిజలా లభ్యతకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ఉక్కుశాఖ ఆధ్వర్యంలోని సంస్థల్లో ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి సంస్థ ఏది?
A.ఎన్ఎండీసీ
Q.ప్రపంచ టీమ్ ఛాంపియన్ షిప్లో 1985 తర్వాత భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి టాప్ – 15 లో నిలిచింది. ఈ స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్ లో భారత్ ఏ దేశ జట్టును ఓడించింది?
A.రుమేనియా
Q.2016, 2017 సంవత్సరానికి గాను డీఆర్డీఓ జీవిత కాల సాఫల్య పురస్కారాలు ఎవరికి ప్రదానం చేశారు?
A.డైరెక్టర్ జనరల్ వీకే సారస్వత్


Q.దక్షిణాసియాలో 3వ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో భారత్ ఎన్ని పతకాలతో అగ్రస్థానం దక్కించుకుంది?
A.20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలు
Q.కూరగాయలు, పూల సాగుకు సంబంధించి కొత్త వంగడాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో ఉద్యాన పరిశోధన క్షేత్రం ఏర్పాటు చేస్తుంది?
A.చిత్తూరు
Q.మలేషియా ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్లో భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ ఏ విభాగంలో పసిడి పతకం గెలిచాడు?
A.200 మీటర్ల బటర్ ఫ్లరు
Q.అంతర్జాతీయ నర్సుల దినోత్సవం?
A.మే 12
Q.అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త ఛైర్ పర్సన్‌గా వాల్ మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ బయ్యర్ స్థానంలో ఎవరిస్థానంలో నియమితులయ్యారు?
A.ప్రత్యూష్ కుమార్
Q.ఏ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవీంద్రశర్మకు కళారత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది?
A.2010
Q.అబుదాబి స్వ్కాష్ ఓపెన్ లో విజేతగా నిలిచింది ఎవరు?
A.భారత ఆటగాడు రమిత్ టాండన్
Q.2018-19 సంవత్సరం మొదటి త్రైమాసికానికి స్థిర ధరలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఎంత జీవీఏ లక్ష్యంగా నిలిచింది?
A.రూ.6,32,826 కోట్లు
Q.భారత యువ అథ్లెంట్ నీరజ్ చోప్రా జావెలిన్ ను ఎన్ని మీటర్ల దూరం విసిరి తన పేరిట ఉన్న జాతీయ రికార్డు (86.48 మీ) ను బద్దలు కొట్టాడు?
A.87.43 మీ.
Q.దక్షిణ కొరియాలోని డాంగీ నగరంలో జరిగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత మహిళల హాకీ జట్టుకు సారథ్యం వహిస్తుంది ఎవరు?
A.సునీత లక్రా
Q.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఇచ్చిన రుణాల మీద వడ్డీ రూపేణా ఎంత శాతం ఆదాయంలో వృద్ధి నమోదైంది?
A.3.2 %
Q.ఏపీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
A.డాక్టర్ పోలినేని అంకమ్మ, చౌదరి
Q.బాయిలర్ నిపుణుడిగా పేరుగాంచిన దిలీప్ కుమార్ దూబే ప్రభుత్వం రంగంలోని ఎన్టీపీసీ కొత్త దక్షిణ ప్రాంతీయ ఈడీగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఏ ప్రాంత ఈడీగా ఉన్నారు?
A.రామగుండం ఎన్టీపీసీ
Q.ఇటీవలే మలేషియా ప్రధానిగా ఎవరు ఎన్నికైనవారు ఎవరు?
A.మహథీర్ మహమ్మద్
Q.రోలాండ్ గారోస్ అండర్ -18 టోర్నీలో ఫర్దీన్ ఖమర్, ఫర్హత్ అలీన్ ఎవరిపై విజేతలుగా నిలిచారు?
A.ఆయుష్, శ్రావ్య
Q.భారత పురుషుల హాకీ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
A.హరేంద్రసింగ్
Q.బ్యాడ్మింటన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన ఇద్దరు మలేసియా క్రీడా కారులపై ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిషేధం విధించింది. వారు ఎవరు?
A.జుల్ఫాడ్లి జుల్కిఫ్లి (20 ఏళ్లు), టాన్ చున్ సియాంగ్ (15 ఏళ్లు)
Q.తెలంగాణ పోలీసుశాఖ రూపొందించిన వాట్సాప్ ను పోలి ఉండే సరికొత్త మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి?
A.కాప్ కనెక్ట్
Q.పరాగ్వే ఓపెన్ – 2018 టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?
A.పెట్రా క్విటోవా
Q.డబ్ల్యూటీఓ తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15 అత్యంత కాలుష్య పూరిత నగరాల్లో భారత్ కు సంబంధించి ఎన్ని ఉన్నాయి?
A.14
Q.పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు నియమితులయ్యారు?
A.మల్లిఖార్జున ఖర్గే
Q.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల ఆవిష్కరించిన మొబైల్ యాప్ ఎన్సీబీఎన్(నారా చంద్రబాబు నాయుడు) ను ఎవరు రూపొందించారు?
A.రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం