Core Web Vitals Assessment: current affairs 2021 questions and answers: క‌రెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ 20

current affairs 2021 questions and answers: క‌రెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ 2021

current affairs 2021 questions and answersఅన్ని పోటీ ప‌రీక్ష‌ల‌కు, గ్రూప్స్‌కు మేము అందించే క‌రెంట్ అఫైర్స్ చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కొంత మంది విద్యావేత్త‌లు, మేధావులు సెలెక్ట్ చేసి అందిస్తున్న ఈ క‌రెంట్ అఫైర్స్‌ను మేము సేక‌రించి మీకోసం (current affairs 2021 questions and answers)అందిస్తున్నాం.

1.నీతి ఆయోగ్ ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్ 2020-21(SDG India Index 2020-21) లో ఏ రాష్ట్రం అగ్ర‌స్థానంలో ఉంది.
జ‌. కేర‌ళ‌

2.రైతుల‌కు విత్త‌నాల‌ను పంపిణీ చేయ‌డానికి వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్య‌క్ర‌మం ఏది?
జ. సీడ్ మినికిట్‌

3.AAI స‌ర‌ళీకృత FTO విధానం ప్ర‌కారం భార‌త‌దేశం ఎన్ని కొత్త ప్ల‌యింగ్ ట్రైనింగ్ అకాడ‌మీల‌ను పొందుతుంది?
జ‌. 8

4.భార‌త నావికాద‌ళానికి ఆరు సంప్ర‌దాయ జ‌లాంత‌ర్గాముల‌ను దేశీయంగా నిర్మించ‌డానికి ప్ర‌భుత్వం ఎంత మొత్తాన్ని విడుద‌ల చేసింది?
జ‌. రూ.43000 కోట్లు

5.ఏ న‌గ‌రం లో విశ్వ‌మిత్రి న‌ది కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక ను అమ‌లు చేయాల‌ని జాతీయ గ్రీన్ ట్రిబ్యున‌ల్ అధికారుల‌ను ఆదేశించింది?
జ‌. వ‌డోద‌ర‌

6.ఇంజ‌నీరింగ్ & మెడిక‌ల్ కాలేజీల్లో విద్యార్థినుల‌కు 33% రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించిన రాష్ట్రం?
జ‌.బిహార్‌

7.సింధు బెస్ట్ మెగా ఫుడ్ పార్క్‌ను న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ఇటీవ‌ల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ‌.ఛ‌త్తీస్‌ఘ‌డ్‌

8.వాయువ్య రాష్ట్రాలు, పంజాబ్‌, హ‌రియాణ‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్ము & క‌శ్మీర్ల‌, ల‌డాఖ్ కేంద్ర ప్రాంతాల‌లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ఏ సంవ‌త్స‌రానికి వేగ‌వంతం అవుతుంది?
జ‌.2022

9.ఉద్యోగ అవ‌కాశాల‌ను పెంచ‌డానికి ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం నాలెడ్జ్ ఎకాన‌మీ మిష‌న్‌న‌ను ప్రారంభించింది?
జ‌.కేర‌ళ‌

10.ఫైల‌ట్ ప్రాజెక్టుగా 3 ఇథ‌నాల్ స్టేష‌న్ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎక్క‌డ ప్రారంభించారు?
జ‌.ఫూణే

11.ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న‌ను ఏ నెల వ‌ర‌కు పొడిగించారు?
జ‌.దీపావ‌ళి వ‌ర‌కు

12.విద్యా మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన 2019-20 సంవ‌త్స‌రానికి పాఠ‌శాల విద్య జాతీయ ప‌నితీరు గ్రేడింగ్ సూచిక‌లో ఏ రాష్ట్రం అగ్ర‌స్థానంలో ఉంది?
జ‌.పంజాబ్‌

13.భార‌త‌దేశ తొలి అంత‌ర్జాతీయ స‌ముద్ర సేవ‌ల క్ల‌స్ట‌ర్ ఏర్పాటు ఎక్క‌డ జ‌ర‌గ‌నుంది?
జ‌.గుజ‌రాత్‌

14.2020లో 20 సంస్క‌ర‌ణ‌లు అనే ఇ-బుక్‌లెట్‌ను విడుద‌ల చేసిన మంత్రిత్వ‌శాఖ?
జ‌.ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌

15.పిర‌మ‌ల్ ఫౌండేష‌న్ స‌హాకారంతో సూర‌క్షిత హ‌మ్ సుర‌క్షిత్ తుమ్ అభియాన్ ను ఏ సంస్థ ప్రారంభించింది?
జ‌.నీతీ అయోగ్‌

16.భార‌త్‌లో ఏ రాష్ట్రంలోని గ్రామం కొత్త క‌రోనా వైర‌స్ వ్య‌తిరేకంగా వ‌యోజ‌నుల‌కు టీకాలు వేసిన మొద‌టి గ్రామంగా అవ‌త‌రించింది?
జ‌.వీయ‌న్ గ్రామం-జ‌మ్ము, క‌శ్మీర్‌

17.సుస్థిర ప‌ట్ట‌ణాభివృద్ధి రంగంలో భార‌త‌దేశం ఏ దేశంలో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది?
జ‌.జ‌పాన్‌

18.సుస్థిర ప‌ట్ట‌ణాభివృద్ధి రంగంలో కేంద్ర మంత్రివ‌ర్గం ఏ దేశంతో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చ‌కుంది?
జ‌.మాల్దీవులు

19.గ్రూపు ఆఫ్ సెవెన్ (జి7) దేశాల ఆరోగ్య మంత్రుల‌కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది?
జ‌.బ్రిట‌న్‌

20.స్వ‌చ్ఛ‌మైన శ‌క్తి ఆవిష్క‌ర‌ణ కోసం ప్ర‌పంచ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన దేశం?
జ‌.భార‌త్‌

21.జంతు వ్యాధుల ప్ర‌మాదాల‌పై స‌ల‌హా ఇవ్వ‌డానికి వ‌న్ హెల్త్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన సంస్థ‌?
జ‌.ఐక్య‌రాజ్య‌స‌మితి

22.స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2021 ప్ర‌కారం సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాన్ని సాధించ‌డంలో భార‌త్ ర్యాంక్‌?
జ‌.117

23.8వ అంత‌ర్జాతీయ నైట్రోజ‌న్ ఇనిషియేటివ్ కాన్ఫ‌రెన్స్ (INI 2020) ఏ దేశంలో జ‌రిగింది?
జ‌.జ‌ర్మ‌నీ

24.FATF- ప్రాంతీయ అనుబంధ సంస్థ మ‌నీలాండరింగ్‌కు వ్య‌తిరేకంగా ఆసియా పసిఫిక్ గ్రూప్ (APG) ఏ దేశంలో మెరుగైన ఫాలో – అప్ హోదాను క‌లిగి ఉంది?
జ‌.పాకిస్థాన్‌.

25.తాజా టైమ్స్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ఆసియా విశ్వ‌విద్యాల‌య ర్యాంకింగ్స్ 2021లో ఎన్ని భార‌తీయ విశ్వ‌విద్యాల‌యాలు టాప్ 100లో స్థానం సంపాదించాయి?
జ‌.3

26.మూడు ఎంహెచ్‌-60 రోమియో మ‌ల్టీ-రోల్ ఛాప‌ర్ల‌ను ఏ దేశం భార‌త్‌కు అప్ప‌గిస్తుంది?
జ‌.అమెరికా

27.త‌ప్పిపోయిన వారిని గుర్తించ‌డానికి ఇంట‌ర్‌ఫోల్ ప్రారంభించిన కొత్త గ్లోబ‌ల్ డేటాబేస్ పేరు?
జ‌.I-Familia

28.2022-24 సంవ‌త్స‌రానికి యూఎన్ ఎక‌నామిక్ & సోష‌ల్ కౌన్సిల్‌కు ఎన్నికైన దేశం?
జ‌.భార‌త్‌

29.జి7 దేశాలు ఏర్పాటు చేసిన క‌నీస ప్ర‌పంచ కార్పొరేట్ ప‌న్ను రేటు ఎంత‌?
జ‌.15%

30.ది ఎక‌నామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబ‌ల్ లైవ్బిలిటీ ర్యాంకింగ్ 2021 ఎడిష‌న్ ప్ర‌కారం ప్ర‌పంచంలో జీవించ‌గ‌లిగేందుకు అతి త‌క్కువ ఆస్కారం ఉన్న‌న‌గ‌రం?
జ‌.ద‌మాస్క‌స్‌

31.బిట్‌కాయిన్ లీగ‌ల్ టెండ‌ర్ చేసిన మొద‌టి దేశం?
జ‌.ఎల్ సాల్వ‌డార్‌

32.రైల్వే 2020-21లో ఎన్ని మిలియ‌న్ ట‌న్నుల స‌రుకు ర‌వాణా లోడింగ్ రికార్డు స్థాయిలో సాధించింది?
జ‌.1233 మిలియ‌న్ ట‌న్నులు

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *