Current Affairs 2021 : పోటీపరీక్షలకు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ఇచ్చాము. ఇవి కూడా చదవండి. ఈ ఏడాది (2021) జనవరి నుంచి మే వరకు జరిగిన పలు విశేషాలపై కరెంట్ అఫైర్స్ ఇవి. ప్రతి ఒక్కరూ వీటిని షేర్ చేయండి!.
Current Affairs 2021 :-
1.కాంగ్రెస్ సీనియర్ నేత బూటాసింగ్ ఇటీవల మృతి చెందారు. అయితే ఆయన ఎన్నిసార్లు M.P గా ఎన్నియ్యారు?
జ.8 సార్లు
2.2020-21 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి అప్పుల మొత్తం అంచనా ఎన్నిలక్షల కోట్లరూపాయలుగా ఉంది?
జ.రూ.3,48,998 కోట్లు
3.భారతదేశంలో ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)ల సంఖ్యను గుర్తించండి.
జ.20
4.ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వివాదానికి దారితీసిన రామతీర్థం దేవాలయం ఏ జిల్లాలో ఉంది?
జ.విజయనగరం
5.భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, కోవిడ్ టీకా తొలిదశలో భాగంగా ఎన్ని కోట్లమందికి ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.
జ.3 కోట్లు
6.2020 డిసెంబర్లో భారత్ ఎగుమతులు ఎంత శాతం తగ్గుదలను నమోదు చేశాయి.
జ.0.8%
7.2020 డిసెంబర్లో భారత దిగుమతులు ఎంత శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
జ.7.6%
8.2020 డిసెంబర్లో భారత వాణిజ్యలోటు ఎంత శాతం పెరుగుదలను చూపింది.
జ.25.78%
9.కరోనా ఐసోలేషన్ బబుల్ నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా కొందరు భారత క్రికెటర్లపై విచారణకు ఆదేశించింది. ఈ జాబితాలో దీనితో సంబంధంలేని క్రికెటర్‌ను గుర్తించండి.
జ.నటరాజన్
10.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యనభ్యసించే వైద్య విద్యార్థులు ఎన్నేళ్లపాటు ప్రభుత్వ ఆసుపత్రులలో తప్పనిసరిగా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది?
జ.3సంవత్సరాలు
11.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ క్రింద వివిధ రంగాలలో రైతులకు బ్యాంకులు ఎన్నికోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేశాయి.
జ.రూ.7362 కోట్లు.
12.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా తొలివిడతలో ఎన్ని లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.
జ.15.60 లక్షలు
13.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆదుకునే నిమిత్తం ఎన్ని టన్నుల రంగు మారిన ధాన్యాన్ని సేకరించింది.
జ. 1 లక్ష టన్నులు
14.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా ఏర్పరచుకుంది.
జ. 28 లక్షలు
15.భారత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల డెయిరీ రైతులకు కిసాన్ కార్డ్‌లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
జ.1.50 కోట్లు
1.ఇటీవల రోహ్తంగ్ ప్రాంతంలో 300 మంది మంచులో చిక్కుకుపోయిన పర్యాటకులను ఆ ప్రాంత పోలీసులు కాపాడారు. అయితే రోహ్తంగ్ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు?
జ.హిమాచల్ ప్రదేశ్
2.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ – కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్ని కోట్ల రూపాయలతో కృష్ణపట్నం ప్రాంతంలో భారీ లెదర్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది.
జ.రూ.281 కోట్లు
3.ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం బ్లడ్ ప్రెషర్ రక్తపోటుతో ఎంత శాతం మంది పురుషులు బాధపడుతున్నట్టు వెల్లడించింది.
జ.7.1%
4.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకూ జరిగిన ప్రసవాలలో ఏ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.
జ.విశాఖపట్నం
5.ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్న ప్రమాదకర రోడ్లను డెమోకారిడార్లుగా మార్చాలని నిర్ణయించింది.
జ.100 కి.మీ.
6.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇళ్ళలో భాగంగా ఏ జిల్లాలో ఇళ్ళను అత్యధికంగా పంపిణీ చేయడం జరిగింది.
జ.తూర్పుగోదావరి
7.భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCFAL) లో ఎంత శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది.
జ.10%
8.T20 క్రికెట్ ప్రపంచకప్ అంచనా వ్యయాన్ని గుర్తించండి?
జ.రూ.906 కోట్లు
9.సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) 2020 డిసెంబర్ త్రైమాసికంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన సాప్ట్ వేర్ సేవలు ఎగుమతి జరిగినట్టు వెల్లడించింది.
జ.రూ.1.2 కోట్లు
10.రెమ్ డెసివిర్ కరోనా ఔషధం కంటే ప్రాలాట్రెక్జేట్ అనే ఔషధం కరోనా పై బాగా పనిచేస్తోందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ప్రాలాట్రెక్జేట్ ఔషధాన్ని దేని చికిత్స నిమిత్తం వాడతారు?
జ.కాన్సర్
11.కరోనా పాజిటివ్ రావడంతో ఇటీవల ప్రపంచ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ఆటగాడు కెంటోమొమట థాయ్ లాండ్ ఓపెన్ నుండి వైదొలిగాడు. ఇతడు ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు.
జ.జపాన్
12.భారతకేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివాద్ సే విశ్వాస్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయల పన్ను బకాయిల వివాదాలు గడిచిన సంవత్సరం పరిష్కారమైనట్టు ప్రకటించింది.
జ.రూ.1 లక్షకోట్లు
13.గడిచిన సంవత్సరం కేంద్ర GST, I.T, కస్టమ్స్ శాఖలు పన్ను ఎగవేతలకు పాల్పడ్డ ఎంతమందిని అరెస్టు చేశాయని ప్రకటించాయి.
జ.187
14.2008 నుండి భారత ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) ను ఆదుకునేందుకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు పైగా సమకూర్చినట్టు CAG తన నివేదికలో వెల్లడించింది.
జ.రూ.4 లక్షల కోట్లు.
15.దశాబ్ధాల కాలంగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన సూక్ష్మజీవులను పెంచడానికి శాస్త్రవేత్తలు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతులలో అత్యంత సురక్షితమైన పద్ధతిని గుర్తించండి.
జ.వెరోసెల్ ఫ్లాట్ ఫామ్
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి