Cryptocurrency

Cryptocurrency: Bitcoinపై ఆస‌క్తి చూపుతున్నారా? అయితే జేబులు, ఇళ్లు ఖాళీ అయిన‌ట్టే లెక్క‌?

Bank Impramation

Cryptocurrency: ఈ ప్రపంచంలో Money అనే పేరు ఇప్ప‌టిది కాదు. మొద‌ట్లో నివ‌సించిన జ‌నాభాలో ఎక్కువ శాతం మంది వ‌స్తువు మార్పిడి(exchange ) చేసుకునేవారు. త‌ర్వాత గోల్డ్ కాయిన్స్‌, సిల్వ‌ర్ కాయిన్స్ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చాయి. ఆ త‌ర్వాత మ‌నం కొన్ని సంవ‌త్స‌రాలుగా వాడుతున్న క‌రెన్సీ , రూపాయి నాణేలు చెలామ‌ణిలోకి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం google pay, phonepe వాడుతున్నారు. కొంత మంది credit, debit cards ద్వారా స్వైపింగ్ చేస్తు న్నారు. ఎవ‌రిని అడిగినా మా ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు అనే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు అంతా digitalization మ‌యం అయ్యింది. ప్ర‌పంచంలో కేవ‌లం 8% శాతం మాత్ర‌మే డ‌బ్బులు ప్ర‌జ‌ల చేతుల మీదుగా చెలామ‌ణి అవు తున్నాయి. మిగ‌తా 92% శాతం digital currencyగా మారింది. ఈ ర‌కంగా రోజు రోజుకూ మ‌నీ రూపం మారుతోంది. ఇప్పుడు మ‌నం వాడే డ‌బ్బు క్రిప్టోక‌రెన్సీ(Cryptocurrency) గా మారినా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌క్క‌ర్లేద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

క్రిప్టోక‌రెన్సీ అనేది డిజిట‌ల్ క‌రెన్సీగా చెప్ప‌వ‌చ్చు. దీనిపై ప్ర‌పంచంలో ఎవ‌రికీ నియంత్ర‌ణ ఉండ‌దు. దీనికి ఎవ్వ‌రూ కూడా కంట్రోల్ చేయ‌లేరు. అస‌లు దీనికి ఎవ‌రు ఎవ‌రికి పంపిస్తున్నారో కూడా ఊహించ‌లేమ‌ట‌. ప్ర‌స్తుతం మ‌నం వాడుతున్న డిజిట‌లైజేష‌న్ లో ఎవ‌రి బ్యాంక్ కైనా రూ.10 సెండ్ చేస్తే అది ఎవ‌రి బ్యాంక్ అడ్ర‌స్స్‌కు వెళుతుంది. వారి వివ‌రాలు ఏమిటో నిమిషాల్లో తెలుస్తుంది క‌దా!. ప్ర‌స్తుతం మ‌నం వాడుతున్న transsaction లావాదేవీల‌న్నీ ఆర్‌.బి.ఐ (Reserve Bank of India) ఆధ్వ‌ర్యంలోనే కంట్రోల్ చేస్తుంటారనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. కానీ క్రిప్టోక‌రెన్సీకి మాత్రం అలా నియంత్రించే వారు ఎక్క‌డా లేరు.

ఈ క్రిప్టోక‌రెన్సీలో చాలా ర‌కాల క‌రెన్సీలు ఉన్నాయి. అవి ఏమిటంటే?

  1. Bitcoin
  2. Ethereum
  3. Behance Coin
  4. Dogecoin
  5. Cardano

పైన చెప్పిన‌వే కాకుండా దాదాపుగా 4 వేల క్రిప్టోక‌రెన్సీ ఉన్నాయి. కానీ వీళ్ల‌ని నియంత్రించేవారు ఎవ్వ‌రూ లేరు. ఇది ఒక స‌మ‌స్య‌గానే చెప్పుకోవాలి. ఇప్పుడు వీటిలో ముఖ్య‌మైన బిట్‌కాయిన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం!

Bitcoin : బిట్‌కాయిన్‌ను మొట్ట‌మొద‌టిగా 2009లో ప్రారంభించారు. ఇది కూడా ఒక ర‌క‌మైన క్రిప్టో క‌రెన్సీనే. దీనిని Satoshi Nakamoto అనే వ్య‌క్తి రూపొందించారు. ఆశ్చ‌ర్యం క‌లిగే విష‌యం ఏమిటంటే అత‌ను ఎవ‌రో కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ కూడా తెలియ‌ద‌ట‌. ఒక బిట్‌కాయిన్ విలువ ప్ర‌స్తుతం రూ.24 ల‌క్ష‌ల 20 వేల 762/- లుగా ఉంది. బిట్ కాయిన్ వాల్యూ ఎప్పుడూ ఇంతే ఉంటుంద‌ని ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అది ఎప్పుడు ఎంత పెరుగుతుందో, త‌గ్గుతుందో మ‌న‌కు తెలియ‌దు. అచ్చం మ‌న షేర్ మార్కెటింగ్ లానే ఉంటుంది. ఇది డిమాండ్ – స‌ప్ల‌య్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు డిమాండ్ ఎక్కువుగా ఉంటే బిట్ కాయిన్ విలువ కూడా పెరుగుతుంది. డిమాండ్ విలువ త‌గ్గితే ధ‌ర విలువ త‌గ్గుతుంది.

భ‌విష్య‌త్తులో ఏదైనా కార‌ణం చేత ఆయా ప్ర‌భుత్వాలు బిట్‌కాయిన్‌ను బ్యాన్ చేసిన‌ట్ట‌యితే దాని విలువ త‌గ్గిపోతుంది. దీనికి సెక్యురిటీ అంటూ ఏమీ ఉండ‌దు. బిట్‌కాయిన్ అనేది ఇంట‌ర్ నెట్ అనుసం ధానం గా ప‌నిచేస్తుంది. మ‌న బ్యాంకుల‌కు లాక‌ర్లు ఉన్న‌ట్టు అది లాక‌ర్ల‌లో ఉండ‌దు. పొర‌పాటున భ‌విష్య‌త్తులో యాక‌ర్స్(hackers) దీనిని హాకింగ్ చేసిన‌ట్టు అయితే ప‌రిష్కారం ఏమిటి? అన్న‌దానికి కూడా స‌మాధానం లేదు. ఇప్పుడున్న‌ కంప్యూట‌ర్ సిస్టం అంతా పాడైతే ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్న‌మ‌వుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు రూ.4,00,000 ల‌క్ష‌లు ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స‌డ్ డిపాజిట్ చేశార‌నుకోండి. పొర‌పాటున ఆ బ్యాంక్ అనేది దివాళా తీసింద‌నుకోండి. ఆర్‌.బి.ఐ (రిజ‌ర్వ్ బ్యాంక్‌) మ‌న‌కు ఇన్సూరెన్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది. నేను ఉన్నాన‌ని ఆర్‌బిఐ రూ.5,00,000 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా ఇస్తుంది. కానీ బిట్‌కాయిన్‌లో మాత్రం ఒక్క రూపాయి కూడా పొర‌పాటున వెన‌క్కి రాదు.

మీరు బిట్‌కాయిన్‌లో రూ.10,00,000 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టార‌నుకుందాం. ఆ త‌ర్వాత ఏదో ఒక స‌మ‌స్య వ‌చ్చి (హాకింగ్‌, ఇంట‌ర్‌నెట్, ) బిట్‌కాయిన్ మూత‌ప‌డింద‌నుకోండి. అలాంట‌ప్పుడు మీ డ‌బ్బును ఎవ‌రైనా తెచ్చి ఇస్తారా? ఎవ్వ‌రూ ఇవ్వ‌రు. ఎవ‌రు కూడా మీ డ‌బ్బుకు షూరిటీ ఉండ‌రు.

ఈ మ‌ధ్య కాలంలో బిట్‌కాయిన్‌ను ఎక్కువుగా చ‌ట్ట‌వ్య‌తిరేక ఆన్‌లైన్ వ్యాపారాలు చేసే వారు ఉప‌యోగిస్తు న్నార‌ట‌. ఈ క్ర‌మంలో మ‌న దేశంలో క‌ర్ణాట‌క‌లో ఒక కేసు అయ్యింది. ఆ కేసు ఏమిటి? అంటే ఒక బాబును కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప‌ర్స్ ఆ త‌ల్లిదండ్రుల‌ను డ‌బ్బులు బిట్‌కాయిన్ రూపంలో డిమాండ్ చేశారు. ఎందుకంటే మ‌నం ఎవ‌రికి పంపిస్తున్నామో ఎవ్వ‌రికీ తెలియ‌దు. అదే బ్యాంక్ అకౌంట్ అయితే సులువుగా తెలిసిపోతుంది. ఆ బ్యాంక్ వివ‌రాలు వెంట‌నే మ‌న‌కు అందుతాయి. అందువ‌ల్ల‌నే ఇప్పుడు బిట్‌కాయిన్ కిడ్నాప‌ర్ల‌కు, మాఫియాకు అడ్డాగా మారింది. బిట్ కాయిన్ కేసును పోలీసులు కూడా ట్రాక్ చేయ‌లేర‌ట‌.

ఈ ర‌కంగా చాలార‌కాల illegal activites బిట్‌కాయ‌న్ ద్వారా న‌డుస్తున్నాయి. ఒక వేళ ఇదే ట్రెండ్ భార‌త దేశంలో కొన‌సాగితే మాత్రం ప్ర‌భుత్వం క‌చ్చితంగా బిట్‌కాయిన్‌ను బ్యాన్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అదే విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే స‌మ‌స్య ఉత్పన్న‌మైతే మాత్రం క్రిప్టోక‌రెన్సీ (బిట్‌కాయిన్‌) బ్యాన్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి. అయితే భ‌విష్య‌త్తు కూడా బిట్‌కాయిన్‌దే అని కూడా చెప్ప‌వ‌చ్చు. బిట్ కాయిన్ వ‌ల్ల ఎంత లాభం ఉంద‌నుకుంటున్నామో! అంత‌క‌న్న ఎక్కువుగా ద్రుష్ప‌భావాలు నెల‌కొన్నాయి అనేది అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌యం.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *