Crow attack in karnataka పాములు పగబడతాయని విన్నాం! మనుషులు కూడా పగ పడతారని కూడా అందరికీ తెలుసు. కానీ కాకులు పగబడతాయా? అవునా? నిజమా? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ కాకులు పగబట్టి ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నాయాట. దీనికి అవుననే సమాధానం కూడా వస్తుంది. ఎక్కడో కాదు ఇది పక్క రాష్ట్రంలో గ్రామస్థులు ఎదుర్కొంటున్న(Crow attack in karnataka) వింత భయం.
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం తాలూకా ఓబుళాపరం గ్రామంలో కాకి పగబట్టిందట. అలా పగబట్టడమే కాకుండా దాడులు కూడా చేస్తోందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ఆ కాకికి భయపడి ఇళ్ల నుంచి కూడా బయటకు రావడం లేదని ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు.

గత కొద్ది రోజులుగా ఆ గ్రామంలో సంచరిస్తున్న ఓ కాకి కొందరి స్థానికులను మాత్రం టార్గెట్ చేసింది. వారు గుంపులో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే రయ్యిన ఎగిరి వచ్చి వారిపైనే దాడి చేయడం ప్రారంభిస్తుందట. ఆ కాకి గోళ్లతో రక్కడం, ముక్కుతో పొడుస్తుండటంతో చేస్తుందట. ఇలా గ్రామంలోని మొత్తం 7 గురిపై పగబట్టి దాడి చేస్తున్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు. కాకే కదా అని గెదిమినప్పటికీ.. ఆ కాకి గ్రామం నుండి బయటకు పోవడం లేదంట. ఆ కాకి ఎందుకు పగ బట్టిందో?, పగబట్టిన ఆ మనుషులు కాకికి ఏ అన్యాయం చేశారో? ఎవరికీ తెలియదట.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!