Crop Holiday in Konaseema: ఏడాదికి మూడు పంటలు పండించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమలో రైతులు క్రాప్ హాలిడేకు పిలుపు నివ్వడం రాజకీయంగా చర్చనీయాంశంమైంది. దీనిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
Crop Holiday in Konaseema: తూర్పుగోదావరి: కోనసీమ ప్రాంతంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటనలు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంటేనే పచ్చని పైర్లకు చిరునామా అని అన్నారు. మూడు పంటలు పండే అటువంటి ప్రాంతంలో రైతులు పంటల విరామానికి నిర్ణయం తీసుకోవడంపై నారా లోకేష్ ఓ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పూడుకుపోయిన డ్రైయిన్లు, వరుస విపత్తులు, ముంపు బెడతతో పంట విరామానికి కోనసీమ రైతులు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఎందరు అధికారులు వచ్చి పరిశీలించినా డ్రెయిన్లు, ముంపు సమస్యని పరిష్కరించడం లేదని గత్యంతరం లేకే ఖరీఫ్‌కి క్రాప్ హాలిడే ప్రకటించామని కోనసీమ రైతులు చెబుతున్నారన్నారు.
కోనసీమ ప్రాంతాలైన సఖినేపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాలలో ఏటా వేలాది ఎకరాలు ముంపునకు గురై, కోట్ల రూపాయల పంట నష్టపోతున్న రైతులు 2011 తర్వాత క్రాప్ హాలిడే నిర్ణయం తీసుకోవడం వారి ఇబ్బందుల తీవ్రతని తెలియజేస్తోందన్నారు. ఈ ఏడాది పంట కాల్వలకు ముందుగానే నీరు వదిలినా నాట్లు వేయకుండా పంట విరామానికి మొగ్గు చూపుతున్న రైతులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉందని సూచించారు.
క్రాప్ హాలిడేకి రైతులు సిద్ధం కావడానికి ముంపు ప్రధాన కారణమైతే, పంట నష్టపోయినా పంట నష్ట పరిహారం అందకపోవడం మరొక కారణంగా తెలుస్తోందన్నారు. ధీమా కల్పించని బీమా ఎందుకు అంటోన్న అన్నదాతల గోడు విని సర్కారు స్పందించాలని నారా లోకేష్ కోరారు. ఎన్నికష్టాలు ఎదురైనా, ఎంత నష్టం వచ్చినా భరిస్తూ పంటలు వేస్తూ వచ్చిన రైతన్నలు, సర్కారు నుంచి ఎటువంటి సాయం అందక విరక్తితో పంటల విరామానికి తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోనసీమ ప్రాంతంలో క్రాప్హాలిడేకి సిద్ధమవుతోన్న రైతుల సమస్యలు తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిశీలించి, ప్రోత్సాహకాలు అందించి మళ్లీ రైతులు పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నారా లోకేష్ సూచించారు.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్